శ్రీమద్భగవద్గీత - 310: 07వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 310: Chap. 07, Ver. 30


🌹. శ్రీమద్భగవద్గీత - 310 / Bhagavad-Gita - 310 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 30 🌴

30. సాధిభూతాధి దైవం మాం సాధియజ్ఞం చ యే విదు: |
ప్రయాణకాలే ఆపి చ మాం తే విదుర్యుక్తచేతస: ||


🌷. తాత్పర్యం :

నా యందు సంలగ్నమైన చిత్తము కలిగిన వారు దేవదేవుడనైన నన్నే భౌతికజగత్తును, సర్వదేవతలను, సమస్త యజ్ఞములను నియమించు వానిగా తెలిసికొని మరణ సమయ మందును నన్ను (దేవదేవుడు) అవగాహనతో ఎరిగి యుందురు.

🌷. భాష్యము :

కృష్ణభక్తిరసభావన యందు వర్తించు జనులు దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణముగా అవగాహనము చేసికొను మార్గము నుండి ఎన్నడును వైదొలగురు. శ్రీకృష్ణభగవానుడు ఈ విధముగా జగత్తును మరియు దేవతలను కూడా నడుపువాడై యున్నాడో కృష్ణభక్తిరసభావాన యొక్క దివ్యసాంగత్యము ద్వారా మనుజుడు తెలిసికొనగలడు. కృష్ణభక్తిభావనతో గల దివ్యసాహచర్యము ద్వారా క్రమముగా అతడు దేవదేవుని యందు విశ్వాసమును పొందును. అటువంటి కృష్ణభక్తిరసభావితుడు మరణసమయమున కూడా మరువబోడు. ఆ విధముగా సహజముగనే అతడు కృష్ణలోకమగు గోలోకబృందావనమును చేరగలడు.

ఏ విధముగా మనుజుడు సంపూర్ణ కృష్ణభక్తిపరాయణుడు కాగలడో ఈ సప్తమాధ్యాయము ప్రత్యేకముగా వివరించినది.

కృష్ణభక్తిరస భావనను తిరిగి పొందుటకు మానవజన్మము చక్కని అవకాశమనియు, కనుక దానిని దేవదేవుని నిర్హేతుక కరుణను పొందుటకు సంపూర్ణముగా ఉపయోగించ వలెననియు అంతట అతడు నిశ్చయముగా తెలిసి కొనుము. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, బ్రహ్మజ్ఞానము, పరమాత్మజ్ఞానము, జన్మమృత్యు జరావ్యాధుల నుండి ముక్తి మరియు దేవదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుక్తసేవ లనెడి పలు అంశములు ఈ అధ్యాయమున చర్చించబడినవి. భక్తితో శ్రవణ, కీర్తనములను చేయుట యందు దివ్యానందమును పొందుచు ఆ విధముగా చేయుట వలన తన లక్ష్యములన్నియును సిద్ధించునన్న విశ్వాసమును పొందును ఆ విధముగా చేయుట వలన తన లక్ష్యములన్నియును సిద్ధించునన్న విశ్వాసమును పొందును.

అతని అట్టి నిశ్చయాత్మక శ్రద్ధయే “దృఢవ్రతము” అని పిలువబడును. అదియే భక్తియోగమునకు నాంది యని సర్వశాస్త్రములు వచించుచున్నవి. భగవద్గీత యందలి ఈ సప్తమాధ్యాయము అటువంటి శ్రద్ధ యొక్క సారాంశమై యున్నది.

శ్రీమద్భగవద్గీత యందలి “భగవద్విజ్ఞానము” అను సప్తమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 310 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 30 🌴

30. sādhibhūtādhidaivaṁ māṁ sādhiyajñaṁ ca ye viduḥ
prayāṇa-kāle ’pi ca māṁ te vidur yukta-cetasaḥ


🌷 Translation :

Those in full consciousness of Me, who know Me, the Supreme Lord, to be the governing principle of the material manifestation, of the demigods, and of all methods of sacrifice, can understand and know Me, the Supreme Personality of Godhead, even at the time of death.

🌹 Purport :

Persons acting in Kṛṣṇa consciousness are never deviated from the path of entirely understanding the Supreme Personality of Godhead. In the transcendental association of Kṛṣṇa consciousness, one can understand how the Supreme Lord is the governing principle of the material manifestation and even of the demigods. Gradually, by such transcendental association, one becomes convinced of the Supreme Personality of Godhead, and at the time of death such a Kṛṣṇa conscious person can never forget Kṛṣṇa. Naturally he is thus promoted to the planet of the Supreme Lord, Goloka Vṛndāvana.

This Seventh Chapter particularly explains how one can become a fully Kṛṣṇa conscious person. The beginning of Kṛṣṇa consciousness is association of persons who are Kṛṣṇa conscious.

Human form of life is an opportunity to regain Kṛṣṇa consciousness and that it should be fully utilized to attain the causeless mercy of the Supreme Lord. Many subjects have been discussed in this chapter: the man in distress, the inquisitive man, the man in want of material necessities, knowledge of Brahman, knowledge of Paramātmā, liberation from birth, death and diseases, and worship of the Supreme Lord. Determined faith is called dṛḍha-vrata, and it is the beginning of bhakti-yoga, or transcendental loving service. That is the verdict of all scriptures. This Seventh Chapter of the Bhagavad-gītā is the substance of that conviction.

Thus end the Bhaktivedanta Purports to the Seventh Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Knowledge of the Absolute.

🌹 🌹 🌹 🌹 🌹

27 Feb 2020