శ్రీమద్భగవద్గీత - 294: 07వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 294: Chap. 07, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 294 / Bhagavad-Gita - 294 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 14 🌴

14. దైవీహ్యేషా గుణమయాయి మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ||


🌷. తాత్పర్యం :

త్రిగుణాత్మకమైన నా ఈ దైవీమాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కాని నన్ను శరణుజొచ్చినవారు దీనిని సులభముగా దాట గలుగులుగుదురు.

🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణునకు అసంఖ్యాకములైన శక్తులు కలవు. అవన్నియును దివ్యమైనవి. జీవులు అతని శక్తిలో భాగములై కారణముగా దివ్యులైనను మయాశక్తి సంపర్కముచే వారి ఆదియైన ఉన్నతశక్తి కప్పబడియుండును. ஆఆ విధముగా మాయాశక్తిచే కప్పబడినప్పుడు ఎవ్వరును దాని ప్రభావము నుండి తప్పించుకొనలేరు.

పూర్వమే తెలుపబడినట్లు భౌతికములు, ఆధ్యాత్మికములు అగు ప్రకృతులు శ్రీకృష్ణభగవానుని నుండియే ఉత్పన్నమగుచున్నందున నిత్యములై యున్నవి. జీవులు భగవానుని నిత్యమైన ఉన్నతప్రకృతికి చెందినవారు.

కాని గౌణప్రకృతి సంపర్కము వలన (భౌతికపదార్థ సంపర్కము) వారి మోహము సైతము నిత్యమగుచున్నది. కనుకనే బద్ధజీవుడు “నిత్యబద్ధుడు” అని పిలువబడుచున్నాడు. ఏ సమయమున అతడు బద్ధుడైనాడన్న చరిత్రను కనుగొనుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. కనుకనే భౌతికప్రకృతి గౌణశక్తియైనను ప్రకృతిబంధము నుండి జీవుని ముక్తి అత్యంత కఠినమై యున్నది. జీవుడు అతిక్రమింపలేనటువంటి భగవత్సంకల్పము చేతనే భౌతికప్రకృతియు నడుచుటయే అందులకు కారణము. భౌతికప్రకృతి గౌణమైనను శ్రీకృష్ణభగవానునితో సంబంధమును కలిగి అతని సంకల్పము చేతనే నడుచుచున్నందున భౌతికప్రకృతి విశ్వము యొక్క సృష్టి, లయములందు అద్భుతముగా పనిచేయుచుండును.

“మాయం తు ప్రకృతిం విద్యాన్ మాయినం తు మహేశ్వరమ్ (శ్వేతాశ్వతరోపనిషత్తు 4.10) – మాయ అసత్యము లేదా తాత్కాలికమైనను దాని వెనుక ఘన ఇంద్రజాలకుడైన దేవదేవుడు కలడు. అతడే మహేశ్వరుడు మరియు దివ్యనియామకుడు” అని వేదములు సైతము ఈ విషయమును నిర్ధారించుచున్నవి. “గుణము” అను దానికి వేరొక అర్థము త్రాడు. అనగా బద్ధజీవుడు మొహమనెడి త్రాళ్ళతో గట్టిగా బంధింపబడియున్నాడని అవగతము చేసికొనవలెను. చేతులు, కాళ్ళు బంధింపబడిన వ్యక్తి తనను తాను బంధముక్తుని గావించుకొనలేడు. బంధరహితుడైన వాడే అతనికి సహాయము చేయవలసి యుండును. బంధింపబడి యున్నవాడు బంధింపబడిన వానిచే సహాయము నొందలేడు గనుక రక్షించువాడు ముక్తుడై యుండవలెను. కనుక కేవలము శ్రీకృష్ణభగవానుడు లేదా అతని ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు మాత్రమే బద్ధజీవునికి బంధము నుండి ముక్తిని గూర్చవలదు. అట్టి ఉన్నతమైన సహాయము లేనిదే ఎవ్వరును ప్రకృతిబంధము నుండి విడివడలేరు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 294 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 14 🌴

14. daivī hy eṣā guṇa-mayī mama māyā duratyayā
mām eva ye prapadyante māyām etāṁ taranti te

🌷 Translation :

This divine energy of Mine, consisting of the three modes of material nature, is difficult to overcome. But those who have surrendered unto Me can easily cross beyond it.

🌹 Purport :

The Supreme Personality of Godhead has innumerable energies, and all these energies are divine. Although the living entities are part of His energies and are therefore divine, due to contact with material energy their original superior power is covered. Being thus covered by material energy, one cannot possibly overcome its influence. As previously stated, both the material and spiritual natures, being emanations from the Supreme Personality of Godhead, are eternal. The living entities belong to the eternal superior nature of the Lord, but due to contamination by the inferior nature, matter, their illusion is also eternal.

The conditioned soul is therefore called nitya-baddha, or eternally conditioned. No one can trace out the history of his becoming conditioned at a certain date in material history. Consequently, his release from the clutches of material nature is very difficult, even though that material nature is an inferior energy, because material energy is ultimately conducted by the supreme will, which the living entity cannot overcome. Inferior, material nature is defined herein as divine nature due to its divine connection and movement by the divine will.

🌹🌹🌹🌹🌹

10 Feb 2020