🌹. శ్రీమద్భగవద్గీత - 287 / Bhagavad-Gita - 287 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 07 🌴
07. మత్త: పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ||
🌷. తాత్పర్యం :
ఓ ధనంజయా! నా కన్నను శ్రేష్ఠమైన సత్యము వేరొక్కటి లేదు. దారమునందు ముత్యములు కూర్చాబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడియున్నది.
🌷. భాష్యము :
పరతత్త్వము సాకారమా లేక నిరాకారమా అను విషయముపై ఒక వివాదము కలదు. కాని భగవద్గీతకు సంబంధించినంతవరకు పరతత్త్వమనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడే. ఈ విషయమే భగవద్గీత యందు అడుగుగడుగునా నిర్దారింపబడినది. ముఖ్యముగా ఈ శ్లోకములో పరతత్త్వము సాకారమని నొక్కి చెప్పబడినది. దేవదేవుడే పరతత్త్వమనెడి విషయమును బ్రహ్మసంహిత సైతము ద్రువీకరించినది.
“ఈశ్వర: పరమ: కృష్ణ: సచ్చిదానందవిగ్రహ: - ఆదిదేవుడును, ఆనందనిదానమును, గోవిందుడును, సచ్చిదానంద విగ్రహుడును అగు శ్రీకృష్ణుడే పరతత్త్వమైన దేవదేవుడు”. ఈ ప్రాణములన్నియును పరతత్త్వము సర్వకారణకారణుడైన దివ్యపురుషుడని నిస్సందేహముగా నిరూపించుచున్నవి. కాని నిరాకారవాదులు శ్వేతాశ్వతరోపనిషత్తు (3.10) నందు తెలుపబడిన విషయమును ఆధారము చేసికొని తమ నిరాకారవాదనను చేయుదురు.
“తతో యదుత్తరతరం తదురూప మనామయమ్/ య ఏతద్విదు రమృతాస్తే భవన్త్యథేతరే దుఃఖమేవాపియన్తి – విశ్వపు తొలిజీవియైన బ్రహ్మదేవుడు ఈ భౌతికజగమునందు దేవతలు, మానవులు, జంతువుల కన్నను అత్యంత ఘనుడని తెలియబడుచున్నాడు. కాని ఆ బ్రహ్మదేవునకు పరముగా భౌతికరూపరహితము మరియు భౌతికకల్మషరహితము నైన తత్త్వము (పరమపురుషుడు) వేరొకటున్నది. అతనిని తెలిసికొనగలిగినవాడు సైతము అతని దివ్యుడు కాగా, అతనిని తెలిసికొనలేనివారు భౌతికజగమునందు దుఃఖభాగులదురు.”
నిరాకారవాది ఈ ఉపనిషద్వాక్యములోని “అరూపమ్” అను పదమునకే ఎక్కువ ప్రాధాన్యత నొసగుచున్నను వాస్తవమునకు ఈ “అరూపము” అను పదము నిరాకారవాదమును సూచించుట లేదు. కేవలము అది బ్రహ్మసంహితలో వర్ణింపబడిన సచ్చిదానంద దివ్యరూపమునే సూచించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 287 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 07 🌴
07. mattaḥ parataraṁ nānyat kiñcid asti dhanañ-jaya
mayi sarvam idaṁ protaṁ sūtre maṇi-gaṇā iva
🌷 Translation :
O conqueror of wealth, there is no truth superior to Me. Everything rests upon Me, as pearls are strung on a thread.
🌹 Purport :
There is a common controversy over whether the Supreme Absolute Truth is personal or impersonal. As far as Bhagavad-gītā is concerned, the Absolute Truth is the Personality of Godhead, Śrī Kṛṣṇa, and this is confirmed in every step. In this verse, in particular, it is stressed that the Absolute Truth is a person.
That the Personality of Godhead is the Supreme Absolute Truth is also the affirmation of the Brahma-saṁhitā: īśvaraḥ paramaḥ kṛṣṇaḥ sac-cid-ānanda-vigrahaḥ; that is, the Supreme Absolute Truth Personality of Godhead is Lord Kṛṣṇa, who is the primeval Lord, the reservoir of all pleasure, Govinda, and the eternal form of complete bliss and knowledge. These authorities leave no doubt that the Absolute Truth is the Supreme Person, the cause of all causes.
The impersonalist, however, argues on the strength of the Vedic version given in the Śvetāśvatara Upaniṣad (3.10): tato yad uttara-taraṁ tad arūpam anāmayam/ ya etad vidur amṛtās te bhavanti athetare duḥkham evāpiyanti. “In the material world Brahmā, the primeval living entity within the universe, is understood to be the supreme amongst the demigods, human beings and lower animals. But beyond Brahmā there is the Transcendence, who has no material form and is free from all material contaminations. Anyone who can know Him also becomes transcendental, but those who do not know Him suffer the miseries of the material world.”
The impersonalist puts more stress on the word arūpam. But this arūpam is not impersonal. It indicates the transcendental form of eternity, bliss and knowledge as described in the Brahma-saṁhitā quoted above.
🌷 🌷 🌷 🌷 🌷
3 Feb 2020