శ్రీమద్భగవద్గీత - 308: 07వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 308: Chap. 07, Ver. 28


🌹. శ్రీమద్భగవద్గీత - 308 / Bhagavad-Gita - 308 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 28 🌴

28. యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |
తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతా: ||


🌷. తాత్పర్యం :

పూర్వజన్మము లందు, ప్రస్తుత జన్మము నందు పుణ్యకార్యములను చేయుచు పాపములను పూర్తిగ నశింప జేసికొనిన మనుజులు ద్వంద్వ మోహముల నుండి విడివడినవారై నా సేవ యందు దృఢవ్రతముతో నెలకొనెదరు.

🌷. భాష్యము :

దివ్యమైన ఆధ్యాత్మికస్థితిని పొందుటకు అర్హతను కలిగినవారు ఈ శ్లోకమున పేర్కొనబడినవారు. పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచకులైనవారికి కోరిక మరియు ద్వేషములనెడి ద్వంద్వములను దాటుటకు దుస్సాధ్యము. కేవలము ధర్మనియమాను సారముగా జీవనము గడుపుచు పుణ్యముగా వర్తించి పాపఫలమును నశింపజేసికొనినవారే భక్తిమార్గమును చేపట్టి క్రమముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని శుద్ధజ్ఞానమును పొందు స్థాయికి ఎదగగలరు. తదుపరి వారు క్రమముగా ఆ భగవానుని తలచుచు సమాధిమగ్నులు కాగలరు. ఆధ్యాత్మికస్థితి యందు నెలకొనుటకు ఇదియే సరియైన పద్ధతి. శుద్ధభక్తుల సంగమములో కృష్ణభక్తిరసభావన ద్వారా ఇట్టి ఉద్ధారము సాధ్యపడగలదు. మాహాభక్తుల సాంగత్యమున మనుజుడు భ్రాంతి నుండి విడివడుటయే అందులకు కారణము.

ఎవరేని నిజముగా ముక్తిని వాంఛించినచో భక్తులకు సేవను గూర్చవలెనని శ్రీమద్భాగవతము (5.5.2) నందు తెలుపబడినది (మహాత్సేవం ద్వారమాహు: విముక్తే: ). కాని భౌతికభావన కలిగిన కామ్యకర్మరతులతో సంగత్వము కలిగినవాడు తమస్సుకు చేరు మార్గమును చేపట్టినవాడగును (తమోద్వారం యోషితాం సంగిసంగమ్). కనుకనే బద్ధజీవులను భ్రాంతి నుండు తప్పించుటకే కృష్ణభక్తులు జగమంతటను సంచరించుచుందురు. శ్రీకృష్ణభగవానుని దాసత్వమనెడి తమ నిజస్థితిని మరచుటన్నది ఆ భగవానుని నియమమోల్లంఘనమని నిరాకారవాదులు ఎరుగజాలరు. కనుకనే మనుజుడు తన సహజస్థితియైన శ్రీకృష్ణుని దాసత్వమున తిరిగి నెలకొననంతవరకు ఆ భగవానుని అవగతము చేసికొనుట గాని, దృఢవ్రతముతో ఆ దేవదేవుని భక్తియుతసేవ యందు పూర్ణముగా నిలుచుట గాని సంభవింపదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 308 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 28 🌴

28. yeṣāṁ tv anta-gataṁ pāpaṁ janānāṁ puṇya-karmaṇām
te dvandva-moha-nirmuktā bhajante māṁ dṛḍha-vratāḥ


🌷 Translation :

Persons who have acted piously in previous lives and in this life and whose sinful actions are completely eradicated are freed from the dualities of delusion, and they engage themselves in My service with determination.

🌹 Purport :

Those eligible for elevation to the transcendental position are mentioned in this verse. For those who are sinful, atheistic, foolish and deceitful, it is very difficult to transcend the duality of desire and hate.

Only those who have passed their lives in practicing the regulative principles of religion, who have acted piously, and who have conquered sinful reactions can accept devotional service and gradually rise to the pure knowledge of the Supreme Personality of Godhead. Then, gradually, they can meditate in trance on the Supreme Personality of Godhead.

That is the process of being situated on the spiritual platform. This elevation is possible in Kṛṣṇa consciousness in the association of pure devotees, for in the association of great devotees one can be delivered from delusion.

It is stated in the Śrīmad-Bhāgavatam (5.5.2) that if one actually wants to be liberated he must render service to the devotees (mahat-sevāṁ dvāram āhur vimukteḥ); but one who associates with materialistic people is on the path leading to the darkest region of existence (tamo-dvāraṁ yoṣitāṁ saṅgi-saṅgam). All the devotees of the Lord traverse this earth just to recover the conditioned souls from their delusion.

The impersonalists do not know that forgetting their constitutional position as subordinate to the Supreme Lord is the greatest violation of God’s law.

Unless one is reinstated in his own constitutional position, it is not possible to understand the Supreme Personality or to be fully engaged in His transcendental loving service with determination.

🌹 🌹 🌹 🌹 🌹

25 Feb 2020