🌹. శ్రీమద్భగవద్గీత - 295/ Bhagavad-Gita - 295 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 15 🌴
15. న మాం దుష్కృతినో మూఢా: ప్రపద్యన్తే నరాధమా: |
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితా: ||
🌷. తాత్పర్యం :
దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము హరింపబడినవారు, దానవప్రవృత్తియైన నాస్తికస్వభావమును కలిగియుండువారు నా శరణము నొందరు.
🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని చరణకమలములకు కేవలము శరణమునొందుట ద్వారా మనుజుడు అతికఠినమైన ప్రకృతినియమములను దాటగాలడని భగవద్గీత యందు తెలుపబడినది. అట్టి యెడ విద్యావంతులైన తాత్త్వికులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్థులు, పాలకులు, సామాన్యజనుల నేతలు పలువురు ఎందులకు సర్వశక్తిసంపన్నుడైన శ్రీకృష్ణభగవానుని చరణకమలములకు శరణుజొచ్చరనెడి ప్రశ్న ఇచ్చట ఉదయించును. మానవులకు మార్గదర్శకులైనవారు పలురీతులలో గొప్ప ప్రణాలికలు మరియు పట్టుదలతో ముక్తిని (ప్రకృతి నియమముల నుండి విడుదల) బడయుటకై పలు సంవత్సరములు లేదా జన్మలు యత్నింతురు. కాని దేవదేవుడైన శ్రీకృష్ణుని చరణకమలములకు కేవలము శరణము నొందుట ద్వారా ముక్తి సాధ్యమగుచున్నప్పుడు మేధావులు మరియు కష్టించువారును అగు నాయకులు ఎందులకై ఈ సులభవిధానము ఎన్నుకొనుటలేదు?
ఈ ప్రశ్నకు భగవద్గీత స్పష్టముగా సమాధానమొసగుచున్నది. మానవులకు వాస్తవముగా మార్గదర్శకులైన బ్రహ్మ, శివుడు, కపిలుడు, సనకాదిఋషులు, మనువు, వ్యాసుడు, దేవలుడు, అసితుడు, జనకుడు, ప్రహ్లాదుడు, బలిమహారాజు, తదనంతరము వారైన మధ్వాచార్యులు, రామానజాచార్యులు, శ్రీచైతన్యమాహాప్రభువు మరియు శ్రద్ధను కలిగినటువంటి తాత్వికులు, ప్రజానేతలు, విద్యాబోధకులు, శాస్త్రజ్ఞుల వంటివారు సర్వశక్తిసమన్వితుడు మరియు ప్రామాణికుడును అగు శ్రీకృష్ణభగవానుని చరణకమలములకు శరణము నొందియేయున్నారు. కేవలము నిజమైన తత్త్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, బోధకులు, నేతలు కానివారు మాత్రమే విషయాభిలాషులై తమను తాము గొప్పగా ప్రదర్శించుకొనుచు ఆ భగవానుని ప్రణాళికను గాని, మార్గమును గాని అంగీకరించుట లేదు. వారు భగవానుని గూర్చిన అవగాహన ఏమియునులేక కేవలము లోకవ్యవహార ప్రణాళికలను మాత్రము పలుజేయుచు, భౌతికస్థితికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకొనుటకు బదులు వాటిని మరింత వృద్ధిచేసికొందురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 295 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 7 - Jnana Yoga - 15 🌴
15. na māṁ duṣkṛtino mūḍhāḥ prapadyante narādhamāḥ
māyayāpahṛta-jñānā āsuraṁ bhāvam āśritāḥ
🌷 Translation :
Those miscreants who are grossly foolish, who are lowest among mankind, whose knowledge is stolen by illusion, and who partake of the atheistic nature of demons do not surrender unto Me.
🌹 Purport :
It is said in Bhagavad-gītā that simply by surrendering oneself unto the lotus feet of the Supreme Personality Kṛṣṇa one can surmount the stringent laws of material nature. At this point a question arises: How is it that educated philosophers, scientists, businessmen, administrators and all the leaders of ordinary men do not surrender to the lotus feet of Śrī Kṛṣṇa, the all-powerful Personality of Godhead? Mukti, or liberation from the laws of material nature, is sought by the leaders of mankind in different ways and with great plans and perseverance for a great many years and births. But if that liberation is possible by simply surrendering unto the lotus feet of the Supreme Personality of Godhead, then why don’t these intelligent and hard-working leaders adopt this simple method?
The Gītā answers this question very frankly. Those really learned leaders of society like Brahmā, Śiva, Kapila, the Kumāras, Manu, Vyāsa, Devala, Asita, Janaka, Prahlāda, Bali, and later on Madhvācārya, Rāmānujācārya, Śrī Caitanya and many others – who are faithful philosophers, politicians, educators, scientists, etc. – surrender to the lotus feet of the Supreme Person, the all-powerful authority. Those who are not actually philosophers, scientists, educators, administrators, etc., but who pose themselves as such for material gain, do not accept the plan or path of the Supreme Lord. They have no idea of God; they simply manufacture their own worldly plans and consequently complicate the problems of material existence in their vain attempts to solve them.
🌹 🌹 🌹 🌹 🌹
11 Feb 2020