🌹. శ్రీమద్భగవద్గీత - 504 / Bhagavad-Gita - 504 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 15 🌴
15. సర్వేన్ద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ |
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ||
🌷. తాత్పర్యం : పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారుడైనను ఇంద్రియరహితుడు. అతడు సర్వజీవులను పోషించు వాడైనను ఆసక్తి లేనట్టివాడు. అతడు ప్రకృతిగుణములకు అతీతుడేగాక వానికి ప్రభువును అయియున్నాడు.
🌷. భాష్యము : జీవుల సర్వేంద్రియములకు కారణభూతుడైనను భగవానుడు అట్టి జీవుల భౌతికేంద్రియముల వంటివాటిని కలిగియుండడు. వాస్తవమునకు జీవులు సైతము ఆధ్యాత్మికమైన ఇంద్రియములనే కలిగియున్నను, బద్ధస్థితిలో అవి భౌతికాంశములచే ఆవరింపబడి యుండుట వలన వాటి ద్వారా భౌతికకర్మలే ప్రకటితమగుచుండును. కాని భగవానుని ఇంద్రియములు ఆ విధముగా ఆచ్ఛాదితము కాకపోవుట వలన దివ్యములై నిర్గుణములని పిలువబడుచున్నవి.
గుణమనగా ప్రకృతి త్రిగుణములని భావము. అనగా అతని ఇంద్రియములు భౌతికఆచ్ఛాదనారహితములు. అవి మన ఇంద్రియముల వంటివి కావని అవగతము చేసికొనగలవు. మన ఇంద్రియ కార్యకలాపములన్నింటికి అతడే కారణుడైనను అతడు మాత్రము గుణరహితమైన దివ్యేంద్రియములను కలిగియున్నాడు. ఈ విషయమే “అపాణిపాదో జవనో గ్రహీతా” యని శ్వేతాశ్వతరోపనిషత్తు (3.19) నందలి శ్లోకములో చక్కగా వివరింపబడినది. అనగా భగవానుడు భౌతికగుణ సంపర్కము కలిగిన హస్తములను కాక దివ్యహస్తములను కలిగియుండి, తనకు అర్పించినదానిని వాని ద్వారా స్వీకరించును. ఇదియే బద్ధజీవునకు మరియు పరమాత్మునకు నడుమ గల భేదము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 504 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 15 🌴
15. sarvendriya-guṇābhāsaṁ sarvendriya-vivarjitam
asaktaṁ sarva-bhṛc caiva nirguṇaṁ guṇa-bhoktṛ ca
🌷 Translation : The Supersoul is the original source of all senses, yet He is without senses. He is unattached, although He is the maintainer of all living beings. He transcends the modes of nature, and at the same time He is the master of all the modes of material nature.
🌹 Purport : The Supreme Lord, although the source of all the senses of the living entities, doesn’t have material senses like they have. Actually, the individual souls have spiritual senses, but in conditioned life they are covered with the material elements, and therefore the sense activities are exhibited through matter. The Supreme Lord’s senses are not so covered. His senses are transcendental and are therefore called nirguṇa.
Guṇa means the material modes, but His senses are without material covering. It should be understood that His senses are not exactly like ours. Although He is the source of all our sensory activities, He has His transcendental senses, which are uncontaminated. This is very nicely explained in the Śvetāśvatara Upaniṣad (3.19) in the verse apāṇi-pādo javano grahītā. The Supreme Personality of Godhead has no hands which are materially contaminated, but He has His hands and accepts whatever sacrifice is offered to Him. That is the distinction between the conditioned soul and the Supersoul.
🌹 🌹 🌹 🌹 🌹
26 Aug 2020