శ్రీమద్భగవద్గీత - 473: 12వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 473: Chap. 12, Ver. 04


🌹. శ్రీమద్భగవద్గీత - 473 / Bhagavad-Gita - 473 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -04 🌴

04. సన్నియమ్యేన్ద్రియగ్రామాం సర్వత్ర సమబుద్ధయ: |
తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతా: ||

🌷. తాత్పర్యం : సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వల యెడ సమభావము కలిగి పూర్ణముగా ఉపాసించు సర్వభూతహితులైనవారు సైతము అంత్యమున నన్ను పొందుదురు.

🌷. భాష్యము : జీవహృదయస్థుడైన పరమాత్మను గాంచుటకై దర్శనము, శ్రవణము, ఆస్వాదనము, కర్మముల వంటి ఇంద్రియపరకర్మల నుండి మనుజుడు విరమింపవలెను. ఆ సమయముననే పరమాత్ముడు సర్వత్రా కలడనెడు అవగాహనకు అతడు రాగలడు. ఈ సత్యదర్శనము పిమ్మట అతడు ఏ జీవిని ద్వేషింపడు. అట్టి భావనలో అతడు బాహ్యతొడుగును గాక ఆత్మను వీక్షించుచుండుటచే మానవునికి, జంతువునకు నడుమ భేదమును గాంచడు. కాని ఇట్టి నిరాకారానుభవ విధానము సామాన్యునకు అత్యంత కఠినమైనది.

🌹🌹🌹🌹🌹




🌹 Bhagavad-Gita as It is - 473 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 04 🌴

04. sanniyamyendriya-grāmaṁ sarvatra sama-buddhayaḥ
te prāpnuvanti mām eva sarva-bhūta-hite ratāḥ


🌷 Translation : The impersonal conception of the Absolute Truth – by controlling the various senses and being equally disposed to everyone, such persons, engaged in the welfare of all, at last achieve Me.

🌹 Purport : It is inferred that one has to approach Lord Kṛṣṇa, otherwise there is no perfect realization. Often there is much penance involved before one fully surrenders unto Him. In order to perceive the Supersoul within the individual soul, one has to cease the sensual activities of seeing, hearing, tasting, working, etc. Then one comes to understand that the Supreme Soul is present everywhere. Realizing this, one envies no living entity – he sees no difference between man and animal because he sees soul only, not the outer covering. But for the common man, this method of impersonal realization is very difficult.

🌹 🌹 🌹 🌹 🌹


4 Aug 2020