శ్రీమద్భగవద్గీత - 475: 12వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 475: Chap. 12, Ver. 06


🌹. శ్రీమద్భగవద్గీత - 475 / Bhagavad-Gita - 475 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -06 🌴

06. యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పతా: |
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్తే ఉపాసతే ||



🌷. తాత్పర్యం : ఓ పార్థా! సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింత లేక నాకు భక్తులై, మనస్సును నా యందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించు చున్న వారిని..,

🌷. భాష్యము : పరమభాగ్యుశాలురైన భక్తులు శ్రీకృష్ణభగవానునిచే అతిశీఘ్రముగా భవసాగరము నుండి తరింపజేయబడుదురని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భగవానుడు అత్యంత ఘనుడని మరియు జీవుడు అతనికి సేవకుదనియు తెలిసికొనగలిగే జ్ఞానమునకు శుద్ధభక్తియోగమున మనుజుడు అరుదెంచును.

శ్రీకృష్ణభగవానునికి సేవను గూర్చుటయే జీవుని నిజధర్మము. అతడట్లు చేయనిచో మాయను సేవింప వలసివచ్చును. పూర్వము తెలుపబడినట్లు భక్తియోగము చేతనే శ్రీకృష్ణభగవానుఇ సంపూర్ణతత్త్వము అవగతము కాగలదు. కనుక ప్రతి యొక్కరు పూర్ణముగా భక్తియుతులు కావలెను.

🌹🌹🌹🌹🌹




🌹 Bhagavad-Gita as It is - 475 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 06 🌴

06. ye tu sarvāṇi karmāṇi mayi sannyasya mat-parāḥ
ananyenaiva yogena māṁ dhyāyanta upāsate

🌷 Translation : O Partha, Those who worship Me, giving up all their activities unto Me and being devoted to Me without deviation, always meditating upon Me..,

🌹 Purport : It is explicitly stated here that the devotees are very fortunate to be delivered very soon from material existence by the Lord. In pure devotional service one comes to the realization that God is great and that the individual soul is subordinate to Him. His duty is to render service to the Lord – and if he does not, then he will render service to māyā.

As stated before, the Supreme Lord can be appreciated only by devotional service. Therefore, one should be fully devoted. One should fix his mind fully on Kṛṣṇa in order to achieve Him. One should work only for Kṛṣṇa. It does not matter in what kind of work one engages, but that work should be done only for Kṛṣṇa. That is the standard of devotional service.

🌹 🌹 🌹 🌹 🌹


6 Aug 2020