శ్రీమద్భగవద్గీత - 469: 11వ అధ్., శ్లో 55 / Bhagavad-Gita - 469: Chap. 11, Ver. 55


🌹. శ్రీమద్భగవద్గీత - 469 / Bhagavad-Gita - 469 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 55 🌴

55. మత్కర్మకృన్మత్పరమో మద్భక్త: సఙ్గవర్జిత: |
నిర్వైర: సర్వభూతేషు య: స మామేతి పాణ్డవ ||

🌷. తాత్పర్యం : ఓ ప్రియమైన అర్జునా! కామ్యకర్మలు, మనోకల్పనలనెడి కల్మషముల నుండి విడివడి నా శుద్ధభక్తి యందు నియుక్తుడయ్యెడివాడును, నన్నే తన జీవితపరమగమ్యముగా భావించి నా కొరకై కర్మనొనరించువాడును, సర్వజీవుల యెడ మిత్రత్వమును కలిగినవాడును అగు మనుజుడు తప్పక నన్నే చేరగలడు.

🌷. భాష్యము : ఆధ్యాత్మికాకాశము నందలి కృష్ణలోకములో దివ్యపురుషుడు శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సంబంధమును పొందవలెనని అభిలషించువాడు ఆ భగవానుడే స్వయముగా తెలిపినటువంటి ఈ సూత్రమును తప్పక అంగీకరింపవలెను. కనుకనే ఈ శ్లోకము గీతాసారముగా పరిగణింప బడుచున్నది. ప్రకృతిపై ఆధిపత్యమును వహింపవలెనను ప్రయోజనముచే భౌతికజగత్తునందు మగ్నులైనవారును, నిజమైన ఆధ్యాత్మికజీవనమును గూర్చి తెలియనివారును అగు బద్దజీవుల కొరకే భగవద్గీత ఉద్దేశింపబడియున్నది.

మనుజుడు ఏ విధముగా తన ఆధ్యాత్మికస్థితిని, భగవానునితో తనకు గల నిత్య సంబంధమును అవగతము చేసికొనగలడో చూపి, ఏ విధముగా భగవద్దామమునకు అతడు తిరిగి చేరగలడో ఉపదేశించుటకే భగవద్గీత ఉద్దేశింపబడినది. మనుజుడు తన ఆధ్యాత్మిక కర్మమున (భక్తియుతసేవ) విజయమును సాధించు విధానమును ఈ శ్లోకము స్పష్టముగా వివరించుచున్నది. కర్మకు సంబంధించినంతవరకు మనుజుడు తన శక్తినంతటిని కృష్ణభక్తిభావన కర్మలకే మరల్చవలెను.

శ్రీమద్భగవద్గీత యందలి “విశ్వరూపము” అను ఏకాదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 469 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 55 🌴

55. mat-karma-kṛn mat-paramo mad-bhaktaḥ saṅga-varjitaḥ
nirvairaḥ sarva-bhūteṣu yaḥ sa mām eti pāṇḍava


🌷 Translation : My dear Arjuna, he who engages in My pure devotional service, free from the contaminations of fruitive activities and mental speculation, he who works for Me, who makes Me the supreme goal of his life, and who is friendly to every living being – he certainly comes to Me.

🌹 Purport : Anyone who wants to approach the supreme of all the Personalities of Godhead, on the Kṛṣṇaloka planet in the spiritual sky, and be intimately connected with the Supreme Personality, Kṛṣṇa, must take this formula, as stated by the Supreme Himself. Therefore, this verse is considered to be the essence of Bhagavad-gītā. The Bhagavad-gītā is a book directed to the conditioned souls, who are engaged in the material world with the purpose of lording it over nature and who do not know of the real, spiritual life.

The Bhagavad-gītā is meant to show how one can understand his spiritual existence and his eternal relationship with the supreme spiritual personality and to teach one how to go back home, back to Godhead. Now here is the verse which clearly explains the process by which one can attain success in his spiritual activity: devotional service.

Thus end the Bhaktivedanta Purports to the Eleventh Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Universal Form.

🌹 🌹 🌹 🌹 🌹

1 Aug 2020