🌹. శ్రీమద్భగవద్గీత - 474 / Bhagavad-Gita - 474 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -05 🌴
05. క్లేశోధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్ |
అవ్యక్తా హి గతిర్దు:ఖం దేహవద్భిరవాప్యతే ||
🌷. తాత్పర్యం : పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్త్వము నందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి యనునది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహధారులకు ఎల్లప్పుడును కష్టతరమే.
🌷. భాష్యము : పరమపురుషుని అచింత్య, అవ్యక్త, నిరాకారతత్త్వమార్గము ననుసరించు ఆధ్యాత్మికవాదుల సమూహము జ్ఞానయోగులని పిలువబడుచుండ, పూర్ణ కృష్ణభక్తిభావనలో ఆ దేవదేవుని భక్తియుతసేవ యందు నియుక్తులైన ఆధ్యాత్మికులు భక్తియోగులని పిలువబడుదురు. ఈ జ్ఞానయోగము, భక్తియోగము నడుమ గల భేదము ఇచ్చట చక్కగా విశదీకరింపబడినది. అంత్యమున మనుజుని ఒకే లక్ష్యమునకు గొనివచ్చునదైనను జ్ఞానయోగవిధానము మిక్కిలి క్లేశకరము. కాని శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్షసేవా మార్గమైనందున భక్తియోగము అత్యంత సులభమైనదే గాక జీవాత్మకు సహజధర్మమై యున్నది. జీవుడు అనంతకాలముగా బద్ధుడై యున్నాడు. తాను దేహమును కానని సిద్ధాంతపూర్వకముగా అవగాహన చేసికొనుట అతనికి అత్యంత కరినమైన విషయము.
కనుక భక్తియోగియైనవాడు శ్రీకృష్ణుని శ్రీవిగ్రహమును పూజనీయమైనదిగా స్వీకరించును. మనస్సులో కొద్దిపాటి దేహభావన స్థిరమై యుండుటచే అందులకు కారణము. దానిని ఆ విధముగా అతడు అర్చనమునందు నియోగించును. అయినను దేవదేవుని రూపమునకు మందిరమునందు చేయబడు పూజ విగ్రహారాధానము కాదు. అర్చనము సగుణము (గుణసహితము) మరియు నిర్గుణము(గుణరహితము) అను రెండు విధములుగా నుండునని వేదవాజ్మయము నుండి నిదర్శనము లభించుచున్నది. భగవానుని రూపము భౌతికగుణములతో రూపొందియుండుటచే మందిరమునందలి శ్రీవిగ్రహారాధానము సగుణమని తెలియబడును. భగవానుని రూపము ఆ విధముగా భౌతికములైన రాయి, దారువు లేదా తైలవర్ణపటములతో సూచింపబడినను అదెన్నడును నిజమునకు భౌతికము కాదు. అదియే దేవదేవుని పూర్ణస్వభావమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 474 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 12 - Devotional Service - 05 🌴
05. kleśo ’dhika-taras teṣām avyaktāsakta-cetasām
avyaktā hi gatir duḥkhaṁ dehavadbhir avāpyate
🌷 Translation : For those whose minds are attached to the unmanifested, impersonal feature of the Supreme, advancement is very troublesome. To make progress in that discipline is always difficult for those who are embodied.
🌹 Purport : The group of transcendentalists who follow the path of the inconceivable, unmanifested, impersonal feature of the Supreme Lord are called jñāna-yogīs, and persons who are in full Kṛṣṇa consciousness, engaged in devotional service to the Lord, are called bhakti-yogīs. Now, here the difference between jñāna-yoga and bhakti-yoga is definitely expressed. The process of jñāna-yoga, although ultimately bringing one to the same goal, is very troublesome, whereas the path of bhakti-yoga, the process of being in direct service to the Supreme Personality of Godhead, is easier and is natural for the embodied soul.
The individual soul is embodied since time immemorial. It is very difficult for him to simply theoretically understand that he is not the body. Therefore, the bhakti-yogī accepts the Deity of Kṛṣṇa as worshipable because there is some bodily conception fixed in the mind, which can thus be applied. Of course, worship of the Supreme Personality of Godhead in His form within the temple is not idol worship. There is evidence in the Vedic literature that worship may be saguṇa or nirguṇa – of the Supreme possessing or not possessing attributes. Worship of the Deity in the temple is saguṇa worship, for the Lord is represented by material qualities. But the form of the Lord, though represented by material qualities such as stone, wood or oil paint, is not actually material. That is the absolute nature of the Supreme Lord.
🌹 🌹 🌹 🌹 🌹
5 Aug 2020