శ్రీమద్భగవద్గీత - 494: 13వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 494: Chap. 13, Ver. 05


🌹. శ్రీమద్భగవద్గీత - 494 / Bhagavad-Gita - 494 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 05 🌴

05. ఋషిభిర్బహుధా గీతం ఛన్దోభిర్వివిధై: పృథక్ |
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై: ||


🌷. తాత్పర్యం : క్షేత్రము, క్షేత్రములను గూర్చిన ఆ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేదగ్రంథము లందు వర్ణింప బడినది. అట్టి జ్ఞానము విశేషముగా వేదాంతసూత్రములందు కార్యకారణములతో హేతుబద్ధముగా ప్రకటింప బడినది.

🌷. భాష్యము : ఈ క్షేత్రక్షేత్రజ్ఞ జ్ఞానమును విశదీకరించుటలో దేవదేవుడైన శ్రీకృష్ణుడే వాస్తవమునకు అత్యున్నత ప్రామాణికుడై యున్నాడు. అయినను సామాన్య ఆచారము ప్రకారము విద్వాంసులు మరియు ప్రామాణికులైనవారు సర్వదా ఏ విషయమును గూర్చియైననను పూర్వపు ఆచార్యుల వచనములను నిదర్శనములుగా చూపుదురు గనుక ఇచ్చట శ్రీకృష్ణుడు ఆత్మ, పరమాత్మల అతి వివాదాస్పాదమైన ద్వైతాద్వైత విషయములను ప్రామాణికమైనవిగా అంగీకరించబడిన వేదాంతసూత్రములకు అన్వయించుచు వివరించుచున్నాడు. కనుకనే తొలుత అతడు “ఇది పలువురు ఋషుల అభిప్రాయము ననుసరించి యున్నది” యని పలికియుండెను. అట్టి ఋషులలో వేదాంతసూత్ర కర్తయైన వ్యాసదేవుడు గొప్ప ఋషి.

ఆ వ్యాసదేవుని వేదాంతసూత్రములలో ద్వైతత్వము పూర్ణముగా విశదీకరింపబడినది. వ్యాసదేవుని జనకుడైన పరాశరముని సైతము గొప్ప ఋషి. ఆయన తన ధర్మగ్రంథములలో “అహం త్వం చ తథాన్యే.... “ యని రచించియుండెను. “అనగా నేను, నీవు, ఇతర జీవులనెడి మనమందరము భౌతికదేహముల యందున్నను వాస్తవమునకు దివ్యులమే. కాని ప్రస్తుతము మన వివిధకర్మల కారణముగా మనము వివిధ ప్రకృతిజన్యగుణములచే బంధితులమైనాము. తత్కారణముగా కొందరు ఉన్నతగుణ స్థితిలో, మరికొందరు అధమనైజములో నిలిచియున్నారు. కాని ఈ ఉన్నత, అధమ స్వభావములనునవి అజ్ఞానజనితములు. అవియే అసంఖ్యాక జీవరాసులుగా ప్రకటమగుచుండును. కాని చ్యుతి లేనటువంటి పరమాత్ముడు మాత్రము ప్రకృతిజన్య త్రిగుణములచే అపవిత్రుడు గాక దివ్యుడై యున్నాడు.”

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 494 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 05 🌴

05. ṛṣibhir bahudhā gītaṁ chandobhir vividhaiḥ pṛthak
brahma-sūtra-padaiś caiva hetumadbhir viniścitaiḥ


🌷 Translation : That knowledge of the field of activities and of the knower of activities is described by various sages in various Vedic writings. It is especially presented in Vedānta-sūtra with all reasoning as to cause and effect.

🌹 Purport : The Supreme Personality of Godhead, Kṛṣṇa, is the highest authority in explaining this knowledge. Still, as a matter of course, learned scholars and standard authorities always give evidence from previous authorities. Kṛṣṇa is explaining this most controversial point regarding the duality and nonduality of the soul and the Supersoul by referring to a scripture, the Vedānta, which is accepted as authority. First He says, “This is according to different sages.” As far as the sages are concerned, besides Himself, Vyāsadeva (the author of the Vedānta-sūtra) is a great sage, and in the Vedānta-sūtra duality is perfectly explained.

And Vyāsadeva’s father, Parāśara, is also a great sage, and he writes in his books of religiosity, aham tvaṁ ca tathānye.… “we – you, I and the various other living entities – are all transcendental, although in material bodies. Now we are fallen into the ways of the three modes of material nature according to our different karma. As such, some are on higher levels, and some are in the lower nature. The higher and lower natures exist due to ignorance and are being manifested in an infinite number of living entities. But the Supersoul, which is infallible, is uncontaminated by the three qualities of nature and is transcendental.”

🌹 🌹 🌹 🌹 🌹


21 Aug 2020