శ్రీమద్భగవద్గీత - 472: 12వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 472: Chap. 12, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 472 / Bhagavad-Gita - 472 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -03 🌴

03. యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచిన్త్యం చ కూటస్థమచలం ద్రువమ్ ||

🌷. తాత్పర్యం : ఇంద్రియాతీతమును, సర్వవ్యాపకమును, అచింత్యమును, మార్పురహితమును, స్థిరమును, అచలమును అగు అవ్యక్త తత్త్వమును (పరతత్త్వపు నిరాకార భావనను) ఆరాధించు వారును..,

🌷. భాష్యము : దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా పూజింపక అదే గమ్యమును పరోక్షమార్గమున సాధింప యత్నించువారు సైతము అంత్యమున ఆ పరమగమ్యమైన శ్రీకృష్ణుని చేరగలరు. “బహుజన్మల పిదప జ్ఞానియైనవాడు వాసుదేవుడే సర్వస్వమని తెలిసి నన్ను శరణువేడుచున్నాడు.” అనగా బహుజన్మల పిదప సంపూర్ణజ్ఞానము ప్రాప్తించనంతనే మనుజుడు శ్రీకృష్ణుని శరణుజొచ్చును. ఈ శ్లోకమునందు తెలుపబడిన విధానము ద్వారా మనుజుడు దేవదేవుని చేరగోరినచో ఇంద్రియనిగ్రహము కలిగి, సర్వులకు సేవను గూర్చుచు, సర్వజీవుల హితకార్యములందు నియుక్తుడు కావలసియుండును. అనగా ప్రతియొక్కరు శ్రీకృష్ణుని దరిచేరవలసియున్నదనియు, లేని యెడల పూర్ణానుభావమునకు ఆస్కారమే లేదనియు గ్రహింపవచ్చును. అట్టి భగవానునికి శరణాగతిని పొందుటకు పూర్వము మనుజుడు తీవ్రతపస్సును నొనరించ వలసి యుండును.

🌹🌹🌹🌹🌹







🌹 Bhagavad-Gita as It is - 472 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 03 🌴

03. ye tv akṣaram anirdeśyam avyaktaṁ paryupāsate
sarvatra-gam acintyaṁ ca kūṭa-stham acalaṁ dhruvam


🌷 Translation : But those who fully worship the unmanifested, that which lies beyond the perception of the senses, the all-pervading, inconceivable, unchanging, fixed and immovable..

🌹 Purport : Those who do not directly worship the Supreme Godhead, Kṛṣṇa, but who attempt to achieve the same goal by an indirect process, also ultimately achieve the same goal, Śrī Kṛṣṇa. “After many births the man of wisdom seeks refuge in Me, knowing that Vāsudeva is all.” When a person comes to full knowledge after many births, he surrenders unto Lord Kṛṣṇa. If one approaches the Godhead by the method mentioned in this verse, he has to control the senses, render service to everyone and engage in the welfare of all beings.

🌹 🌹 🌹 🌹 🌹


4 Aug 2020