శ్రీమద్భగవద్గీత - 499: 13వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 499: Chap. 13, Ver. 10


🌹. శ్రీమద్భగవద్గీత - 499 / Bhagavad-Gita - 499 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 10 🌴

10. అసక్తిరనభిష్వఙ్గః పుత్రదారగృహాదిషు |
నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు ||


🌷. తాత్పర్యం : అనాసక్తి, పుత్రకళత్ర గృహాదుల బంధము నుండి విముక్తి, సుఖదుఃఖ సమయము లందు సమభావము.,

🌷. భాష్యము : వాస్తవమైన ఆధ్యాత్మిక జీవనము ఆధ్యాత్మిక గురువును పొందిన పిమ్మటయే ఆరంభమగును గనుక భక్తియోగము నందున్నవారికి కూడా గురువును స్వీకరించుట అత్యంత ముఖ్యమైనది. ఈ జ్ఞానవిధానమే నిజమైన మార్గమని పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా పలుకుచున్నాడు. దీనికి అన్యముగా ఊహింపబడునదంతయు అర్థరహితమే.

పుత్ర, కళత్ర, గృహములందు అసంగత్వముగా వారియెడ ఎట్టి ప్రేమను కలిగియుండరాదని భావముకాదు. వాస్తవమునకు ప్రేమకు అవియన్నియును సహజ లక్ష్యములు. కాని ఆధ్యాత్మికపురోగతికి వారు అనుకూలము గాకున్నచో మనుజుడు వారియెడ ఆసక్తిని కలిగియుండరాదు.

సుఖదుఃఖములనునవి భౌతిక జీవనమునకు అనుబంధమైన విషయములు. కనుక గీత యందు ఉపదేశింప బడినట్లు వాటిని సహించుటను అలవరచు కొనవలెను. సుఖదుఃఖముల రాకపోకలను నిరోధించుట అసాధ్యము గనుక మనుజుడు భౌతిక జీవన విధానమునందు ఆసక్తిని విడనాడ వలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 499 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 10 🌴

10. asaktir anabhiṣvaṅgaḥ putra-dāra-gṛhādiṣu
nityaṁ ca sama-cittatvam iṣṭāniṣṭopapattiṣu


🌷 Translation : Detachment; freedom from entanglement with children, wife, home and the rest; even-mindedness amid pleasant and unpleasant events;

🌹 Purport : The principle of accepting a spiritual master, as mentioned in the eighth verse, is essential. Even for one who takes to devotional service, it is most important. Transcendental life begins when one accepts a bona fide spiritual master. The Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, clearly states here that this process of knowledge is the actual path. Anything speculated beyond this is nonsense.

As for detachment from children, wife and home, it is not meant that one should have no feeling for these. They are natural objects of affection. But when they are not favorable to spiritual progress, then one should not be attached to them.

Happiness and distress are concomitant factors of material life. One should learn to tolerate.

🌹 🌹 🌹 🌹 🌹


23 Aug 2020