🌹. శ్రీమద్భగవద్గీత - 503 / Bhagavad-Gita - 503 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 14 🌴
14. సర్వత సర్వత: పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖమ్ |
సర్వత: శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి ||
🌷. తాత్పర్యం : సర్వత్ర అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించియున్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి నిలిచి యుండును.
🌷. భాష్యము : సూర్యుడు తన అపరిమిత కిరణములను ప్రసరించుచు స్థితిని కలిగియున్నట్లు, పరమాత్ముడు తన శక్తిని సర్వత్ర వ్యాపింపజేయుచు నిలిచియుండును. అతడు సర్వవ్యాపి రూపమున స్థితిని కలిగియుండగా ఆదిగురువైన బ్రహ్మ మొదలుగా చీమ వరకు సర్వజీవులు అతని యందు స్థితిని కలిగియుందురు. అనగా అసంఖ్యాకములుగా గల శిరములు, పాదములు, హస్తములు, నయనములు, అసంఖ్యాక జీవులన్నియును పరమాత్మ యందే స్థితిని కలిగియున్నవి. జీవులందరును పరమాత్ముని అంతర్భాహ్యములందు స్తితులై యున్నారు. కనుకనే అతడు సర్వవ్యాపిగా తెలియబడినాడు. పరమాత్మవలెనే తాను సైతము సర్వత్ర పాదములు మరియు హస్తములు కలిగి యున్నానని జీవుడెన్నడును పలుకలేడు. అది ఎన్నటికిని అతనికి సాధ్యము కాదు.
వాస్తవమునకు తన హస్తములు మరియు పాదములు సర్వత్ర వ్యాపించియున్నను అజ్ఞానకారణముగా తాను అది తెలియలేకున్నాననియు, కాని సరియైన జ్ఞానసముపార్జన పిమ్మట నిజముగా తాను అట్టి స్థితిని పొందగలననియు జీవుడు తలచినచో అది సత్యవిరుద్ధమే కాగలదు. అనగా ప్రకృతిచే బద్ధుడైన జీవుడు ఎన్నడును పరమాత్ముడు కాజాలడు. పరమాత్ముడు సర్వదా జీవునికి భిన్నమైనవాడు. ఉదాహరణకు భగవానుడు హద్దు అనునది లేకుండా తన హస్తములను చాచగలడు. కాని జీవునకు అది సాధ్యము కాదు. కనుకనే తనకు ఎవరైనా పత్రమునుగాన, పుష్పమునుగాని, ఫలమునుగాని లేదా జలమునుగాని అర్పించినచో తాను స్వీకరింతునని ఆ శ్రీకృష్ణభగవానుడు పలికియున్నాడు. అనగా అతడు తన ధామమునందు దివ్యలీలలలో నిమగ్నుడై యున్నను సర్వవ్యాపకుడై యుండునని భావము. భగవానుని వలె తానును సర్వవ్యాపినని జీవుడెన్నడును పలుకజాలడు. కనుకనే ఈ శ్లోకము పరమాత్మునే(దేవదేవుని) వర్ణించుచున్నది గాని జీవాత్ముని కాదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 503 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 14 🌴
14. sarvataḥ pāṇi-pādaṁ tat sarvato ’kṣi-śiro-mukham
sarvataḥ śrutimal loke sarvam āvṛtya tiṣṭhati
🌷 Translation : Everywhere are His hands and legs, His eyes, heads and faces, and He has ears everywhere. In this way the Supersoul exists, pervading everything.
🌹 Purport : As the sun exists diffusing its unlimited rays, so does the Supersoul, or Supreme Personality of Godhead. He exists in His all-pervading form, and in Him exist all the individual living entities, beginning from the first great teacher, Brahmā, down to the small ants. There are unlimited heads, legs, hands and eyes, and unlimited living entities. All are existing in and on the Supersoul. Therefore the Supersoul is all-pervading. The individual soul, however, cannot say that he has his hands, legs and eyes everywhere. That is not possible. If he thinks that under ignorance he is not conscious that his hands and legs are diffused all over but when he attains to proper knowledge he will come to that stage, his thinking is contradictory. This means that the individual soul, having become conditioned by material nature, is not supreme. The Supreme is different from the individual soul.
The Supreme Lord can extend His hand without limit; the individual soul cannot. In Bhagavad-gītā the Lord says that if anyone offers Him a flower, or a fruit, or a little water, He accepts it. If the Lord is a far distance away, how can He accept things? This is the omnipotence of the Lord: even though He is situated in His own abode, far, far away from earth, He can extend His hand to accept what anyone offers. That is His potency. In the Brahma-saṁhitā (5.37) it is stated, goloka eva nivasaty akhilātma-bhūtaḥ: although He is always engaged in pastimes in His transcendental planet, He is all-pervading. The individual soul cannot claim that he is all-pervading. Therefore this verse describes the Supreme Soul, the Personality of Godhead, not the individual soul.
🌹 🌹 🌹 🌹 🌹
25 Aug 2020