శ్రీమద్భగవద్గీత - 509: 13వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 509: Chap. 13, Ver. 20


🌹. శ్రీమద్భగవద్గీత - 509 / Bhagavad-Gita - 509 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 20 🌴

20. ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి |
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్ ||


🌷. తాత్పర్యం : జీవులు మరియు భౌతికప్రకృతి రెండును అనాది యని తెలిసికొనవలెను. వాని యందలి పరివర్తనములు మరియు భౌతికగుణము లనునవి భౌతికప్రకృతి నుండి ఉద్భవించినవి.

🌷. భాష్యము : ఈ అధ్యాయమునందు తెలుపబడిన జ్ఞానము ద్వారా మనుజుడు కర్మక్షేత్రము (దేహము) మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞులను (జీవాత్మ, పరమాత్మ) గూర్చి తెలిసికొన వచ్చును.

కర్మక్షేత్రమైన దేహము భౌతికప్రకృతినియమమై నట్టిది. దాని యందు బద్ధుడై దేహకర్మల ననుభవించు ఆత్మయే పురుషుడు(జీవుడు). అతడే జ్ఞాత. అతనితోపాటు గల వేరొక జ్ఞాతయే పరమాత్ముడు. కాని ఈ ఆత్మా, పరమాత్మ రూపములు దేవదేవుడైన శ్రీకృష్ణుని భిన్న వ్యక్తీకరణములే యని మనము అవగాహనము చేసికొనవలెను. ఆత్మా ఆ భగవానుని శక్తికి సంబంధించినది కాగా, పరమాత్మ రూపము అతని స్వీయ విస్తృతరూపమై యున్నది

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 509 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 20 🌴

20. prakṛtiṁ puruṣaṁ caiva viddhy anādī ubhāv api
vikārāṁś ca guṇāṁś caiva viddhi prakṛti-sambhavān


🌷 Translation : Material nature and the living entities should be understood to be beginningless. Their transformations and the modes of matter are products of material nature.

🌹 Purport : By the knowledge given in this chapter, one can understand the body (the field of activities) and the knowers of the body (both the individual soul and the Supersoul).

The body is the field of activity and is composed of material nature. The individual soul that is embodied and enjoying the activities of the body is the puruṣa, or the living entity. He is one knower, and the other is the Supersoul. Of course, it is to be understood that both the Supersoul and the individual entity are different manifestations of the Supreme Personality of Godhead. The living entity is in the category of His energy, and the Supersoul is in the category of His personal expansion.

🌹 🌹 🌹 🌹 🌹


31 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 508: 13వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 508: Chap. 13, Ver. 19


🌹. శ్రీమద్భగవద్గీత - 508 / Bhagavad-Gita - 508 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 19 🌴

19. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత: |
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ||


🌷. తాత్పర్యం : ఈ విధముగా క్షేత్రము(దేహము), జ్ఞానము, జ్ఞేయములను గూర్చి నాచే సంక్షేపముగా చెప్పబడినది. కేవలము నా భక్తులే దీనిని పూర్తిగా అవగాహనము చేసికొని నన్ను పొందగలరు.

🌷. భాష్యము : శ్రీకృష్ణభగవానుడు ఇంతవరకు దేహము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి సంక్షేపముగా వివరించెను. వాస్తవమునకు ఈ జ్ఞానము జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానవిధానములనెడి మూడు అంశములను కూడియుండును. ఈ మూడును కలసినప్పుడే అది విజ్ఞానమనబడును. అట్టి సంపూర్ణజ్ఞానమును కేవలము శ్రీకృష్ణభగవానుని భక్తులే ప్రత్యక్షముగా అవగాహనము చేసికొనగలరు. ఇతరులకిది సాధ్యము కాదు. ఈ మూడు అంశములు అంత్యమున ఏకమగునని అద్వైతులు పలికినను భక్తులు ఆ విషయమును ఆంగీకరింపరు.

జ్ఞానము మరియు జ్ఞానాభివృద్ది యనగా కృష్ణభక్తిభావనలో తనను గూర్చి తాను తెలియగలుగుట యని భావము. భౌతికచితన్యము నందున్న మనము మన చైతన్యమును కృష్ణపరకర్మలలోనికి మార్చినచో కృష్ణుడే సర్వస్వమనెడి విషయమును అవగతమగును. అంతట నిజజ్ఞానము మనకు ప్రాప్తించగలదు. అనగా జ్ఞానమనగా భక్తియుక్త సేవావిధానమును సంపూర్ణముగా అవగాహనము చేసికొనుట యందు ప్రాథమికదశ మాత్రమే. ఈ విషయమును పంచదశాధ్యాయమునందు స్పష్టముగా వివరింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 508 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 19 🌴

19. iti kṣetraṁ tathā jñānaṁ jñeyaṁ coktaṁ samāsataḥ
mad-bhakta etad vijñāya mad-bhāvāyopapadyate


🌷 Translation : Thus the field of activities [the body], knowledge and the knowable have been summarily described by Me. Only My devotees can understand this thoroughly and thus attain to My nature.

🌹 Purport : The Lord has described in summary the body, knowledge and the knowable. This knowledge is of three things: the knower, the knowable and the process of knowing. Combined, these are called vijñāna, or the science of knowledge. Perfect knowledge can be understood by the unalloyed devotees of the Lord directly. Others are unable to understand.

The monists say that at the ultimate stage these three items become one, but the devotees do not accept this. Knowledge and development of knowledge mean understanding oneself in Kṛṣṇa consciousness. We are being led by material consciousness, but as soon as we transfer all consciousness to Kṛṣṇa’s activities and realize that Kṛṣṇa is everything, then we attain real knowledge. In other words, knowledge is nothing but the preliminary stage of understanding devotional service perfectly. In the Fifteenth Chapter this will be very clearly explained.

🌹 🌹 🌹 🌹 🌹


30 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 507: 13వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 507: Chap. 13, Ver. 18


🌹. శ్రీమద్భగవద్గీత - 507 / Bhagavad-Gita - 507 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 18 🌴

18. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమస: పరముచ్యతే |
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితమ్ ||


🌷. తాత్పర్యం : తేజోపూర్ణములైన సర్వములందు తేజ:కారణుడతడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము, జ్ఞానవిషయము, జ్ఞానగమ్యము కూడా అతడే. అతడే ఎల్లరి హృదయములందు స్థితుడై యున్నాడు.

🌷. భాష్యము : సూర్యుడు,చంద్రుడు, నక్షత్రములు వంటి తేజోమయములైన వాని తేజమునకు పరమాత్ముడే (దేవదేవుడే) కారణు. ఆధ్యాత్మికజగమునందు సూర్యుడు లేదా చంద్రుని అవసరము లేదనియు. దేవదేవుని తేజము అచ్చట విస్తరించియుండుటయే అందులకు కారణమనియు వేదవాజ్మయమున తెలుపబడినది. కాని భగవానుని తేజమైన ఆ బ్రహ్మజ్యోతి ఈ భౌతికజగమునందు మహాతత్త్వముచే (భౌతికాంశములు) కప్పుబడుట వలన ఇచ్చట వెలుగు కొరకు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు మనకు అవసరములగుచున్నవి. ఇటువంటివి ఆధ్యాత్మికజగత్తున ఏమాత్రము అవసరముండవు.

భగవానుని ప్రకాశమానమైన కాంతి చేతనే సర్వమును ప్రకాశింపజేయబడుచున్నదని వేదములందు స్పష్టముగా తెలుపబడినది. దీనిని బట్టి అతడు భౌతికజగత్తు నందు స్థితిని కలిగిలేదని స్పష్టమగుచున్నది. ఆధ్యాత్మిక ఆకాశమున అత్యంతదూరములో దివ్యధామమునందు అతడు స్థితుడై యున్నాడు. ఈ విషయమును వేదములు సైతము నిర్ధారించియున్నవి. “ఆదిత్యవర్ణం తమస: పరస్తాత్ (శ్వేతాశ్వతరోపనిషత్తు 3.8) అనగా సూర్యుని వలె నిత్యకాంతిమంతుడైన భగవానుడు ఈ భౌతికజగత్తు అంధకారమునకు ఆవల నున్నాడు”.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 507 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 18 🌴

18. jyotiṣām api taj jyotis tamasaḥ param ucyate
jñānaṁ jñeyaṁ jñāna-gamyaṁ hṛdi sarvasya viṣṭhitam


🌷 Translation : He is the source of light in all luminous objects. He is beyond the darkness of matter and is unmanifested. He is knowledge, He is the object of knowledge, and He is the goal of knowledge. He is situated in everyone’s heart.

🌹 Purport : The Supersoul, the Supreme Personality of Godhead, is the source of light in all luminous objects like the sun, moon and stars. In the Vedic literature we find that in the spiritual kingdom there is no need of sun or moon, because the effulgence of the Supreme Lord is there. In the material world that brahma-jyotir, the Lord’s spiritual effulgence, is covered by the mahat-tattva, the material elements; therefore in this material world we require the assistance of sun, moon, electricity, etc., for light.

But in the spiritual world there is no need of such things. It is clearly stated in the Vedic literature that because of His luminous effulgence, everything is illuminated. It is clear, therefore, that His situation is not in the material world. He is situated in the spiritual world, which is far, far away in the spiritual sky. That is also confirmed in the Vedic literature. Āditya-varṇaṁ tamasaḥ parastāt (Śvetāśvatara Upaniṣad 3.8). He is just like the sun, eternally luminous, but He is far, far beyond the darkness of this material world.

🌹 🌹 🌹 🌹 🌹


29 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 506: 13వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 506: Chap. 13, Ver. 17


🌹. శ్రీమద్భగవద్గీత - 506 / Bhagavad-Gita - 506 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 17 🌴

17. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ |
భూతభర్తృ చ తత్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ||

🌷. తాత్పర్యం : పరమాత్ముడు జీవుల యందు విభజింపబడినట్లు కనిపించినను అతడెన్నడును విభజింపబడక ఏకమై నిలిచియుండును. సర్వ జీవులను పోషించు వాడైనను, సర్వులను కబళించునది మరియు వృద్ధి నొందించునది అతడే యని అవగాహనము చేసికొనవలెను.

🌷. భాష్యము : శ్రీకృష్ణభగవానుడు ప్రతివారి హృదయమునందు పరమాత్మ రూపమున వసించియున్నాడు. దీని భావము అతడు విభజింపబడినాడనియా? అట్లెన్నడును కాబోదు. వాస్తవమునకు అతడు సదా ఏకమై యుండును. దీనికి సూర్యుని ఉపమానమును ఒసగవచ్చును. మధ్యాహ్న సమయమున సూర్యుడు తన స్థానమున నిలిచి నడినెత్తిమీద నిలిచియున్నట్లు తోచును. మనుజుడు ఒక ఐదువేల మైళ్ళు ఏ దిక్కునందైనను ప్రయాణించి పిదప సూర్యుడెక్కడున్నాడని ప్రశ్నించినచో తిరిగి ఆ సమయమున తన శిరముపైననే ఉన్నాడనెడి సమాధానమును పొందగలడు.

శ్రీకృష్ణభగవానుడు అవిభక్తుడైనను విభక్తుడైనట్లుగా కన్పించుచున్న ఈ విషయమును తెలుపుటకే వేదవాజ్మయమునందు ఈ ఉదాహరణము ఒసగబడినది. సూర్యుడు ఒక్కడేయైనను బహుప్రదేశములలో జనులకు ఏకకాలమున గోచరించురీతి, విష్ణువొక్కడేయైనను తన సర్వశక్తిమత్వముచే సర్వత్రా వసించియున్నాడనియు వేదవాజ్మయము నందు తెలుపబడినది. ఆ భగవానుడే సర్వజీవుల పోషకుడైనను ప్రళయ సమయమున సమస్తమును కబళించివేయును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 506 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 17 🌴

17. avibhaktaṁ ca bhūteṣu vibhaktam iva ca sthitam
bhūta-bhartṛ ca taj jñeyaṁ grasiṣṇu prabhaviṣṇu ca

🌷 Translation : Although the Supersoul appears to be divided among all beings, He is never divided. He is situated as one. Although He is the maintainer of every living entity, it is to be understood that He devours and develops all.

🌹 Purport : The Lord is situated in everyone’s heart as the Supersoul. Does this mean that He has become divided? No. Actually, He is one. The example is given of the sun: The sun, at the meridian, is situated in its place.

But if one goes for five thousand miles in all directions and asks, “Where is the sun?” everyone will say that it is shining on his head. In the Vedic literature this example is given to show that although He is undivided, He is situated as if divided. Also it is said in Vedic literature that one Viṣṇu is present everywhere by His omnipotence, just as the sun appears in many places to many persons. And the Supreme Lord, although the maintainer of every living entity, devours everything at the time of annihilation.

🌹 🌹 🌹 🌹 🌹


28 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 505: 13వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 505: Chap. 13, Ver. 16


🌹. శ్రీమద్భగవద్గీత - 505 / Bhagavad-Gita - 505 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 16 🌴

16. బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ |
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్ ||


🌷. తాత్పర్యం : పరమాత్ముడు స్థావర, జంగములైన సర్వజీవుల అంతర్భాహ్యములలో నిలిచియుండును. సూక్ష్మత్వకారణముగా అతడు భౌతికేంద్రియములకు అగోచరుడును, ఆగ్రాహ్యుడును అయియున్నాడు. అతిదూరమున ఉన్నను అతడు సర్వులకు సమీపముననే ఉండును.

🌷. భాష్యము : పరమపురుషుడైన నారాయణుడు ప్రతిజీవి యొక్క అంతర్భాహ్యములలో నిలిచియుండునని వేదవాజ్మయము ద్వారా మనము తెలిసికొనగలము. అతడు భౌతిక, ఆధ్యాత్మిక జగత్తులు రెండింటి యందును నిలిచియున్నాడు. అతడు అత్యంత దూరమున ఉన్నను మనకు సమీపముననే యుండును. ఇవియన్నియును వేదవచనములు. ఈ విషయమున కఠోపనిషత్తు (1.2.21) “ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వత:” అని పలికినది.

దివ్యానందమగ్నుడైన ఆ పరమపురుషుడు ఎట్లు తన ఐశ్వర్యముల ననుభవించునో మనము అవగతము చేసికొనజాలము. ఈ భౌతికేంద్రియములతో ఈ విషయమును గాంచుట గాని, అవగతము చేసికొనుట గాని చేయజాలము. కనుకనే అతనిని తెలియుట యందు మన భౌతిక మనో, ఇంద్రియములు పనిచేయజాలవని వేదములు పలుకుచున్నవి. కాని కృష్ణభక్తిరసభావనలో భక్తియోగమును అవలంబించుచు మనస్సును, ఇంద్రియములను పవితమొనర్చుకొనినవాడు అతనిని నిత్యము గాంచగలడు. శ్రీకృష్ణభగవానుని యెడ ప్రేమను వృద్ధిగావించుకొనినవాడు అతనిని నిర్విరామముగా నిత్యము గాంచగలడని బ్రహ్మసంహిత యందు నిర్ధారింపబడినది. భక్తియుక్తసేవ ద్వారానే అతడి దర్శింపబడి అవగతమగునని భగవద్గీత (11.54) యందును ఈ విషయము నిర్ధారింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 505 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 16 🌴

16. bahir antaś ca bhūtānām acaraṁ caram eva ca
sūkṣmatvāt tad avijñeyaṁ dūra-sthaṁ cāntike ca tat


🌷 Translation : The Supreme Truth exists outside and inside of all living beings, the moving and the nonmoving. Because He is subtle, He is beyond the power of the material senses to see or to know. Although far, far away, He is also near to all.

🌹 Purport : In Vedic literature we understand that Nārāyaṇa, the Supreme Person, is residing both outside and inside of every living entity. He is present in both the spiritual and material worlds. Although He is far, far away, still He is near to us. These are the statements of Vedic literature. Āsīno dūraṁ vrajati śayāno yāti sarvataḥ (Kaṭha Upaniṣad 1.2.21). And because He is always engaged in transcendental bliss, we cannot understand how He is enjoying His full opulence. We cannot see or understand with these material senses.

Therefore in the Vedic language it is said that to understand Him our material mind and senses cannot act. But one who has purified his mind and senses by practicing Kṛṣṇa consciousness in devotional service can see Him constantly. It is confirmed in Brahma-saṁhitā that the devotee who has developed love for the Supreme God can see Him always, without cessation. And it is confirmed in Bhagavad-gītā (11.54) that He can be seen and understood only by devotional service. Bhaktyā tv ananyayā śakyaḥ.

🌹 🌹 🌹 🌹 🌹

27 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 504: 13వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 504: Chap. 13, Ver. 15


🌹. శ్రీమద్భగవద్గీత - 504 / Bhagavad-Gita - 504 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 15 🌴

15. సర్వేన్ద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ |
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ||


🌷. తాత్పర్యం : పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారుడైనను ఇంద్రియరహితుడు. అతడు సర్వజీవులను పోషించు వాడైనను ఆసక్తి లేనట్టివాడు. అతడు ప్రకృతిగుణములకు అతీతుడేగాక వానికి ప్రభువును అయియున్నాడు.

🌷. భాష్యము : జీవుల సర్వేంద్రియములకు కారణభూతుడైనను భగవానుడు అట్టి జీవుల భౌతికేంద్రియముల వంటివాటిని కలిగియుండడు. వాస్తవమునకు జీవులు సైతము ఆధ్యాత్మికమైన ఇంద్రియములనే కలిగియున్నను, బద్ధస్థితిలో అవి భౌతికాంశములచే ఆవరింపబడి యుండుట వలన వాటి ద్వారా భౌతికకర్మలే ప్రకటితమగుచుండును. కాని భగవానుని ఇంద్రియములు ఆ విధముగా ఆచ్ఛాదితము కాకపోవుట వలన దివ్యములై నిర్గుణములని పిలువబడుచున్నవి.

గుణమనగా ప్రకృతి త్రిగుణములని భావము. అనగా అతని ఇంద్రియములు భౌతికఆచ్ఛాదనారహితములు. అవి మన ఇంద్రియముల వంటివి కావని అవగతము చేసికొనగలవు. మన ఇంద్రియ కార్యకలాపములన్నింటికి అతడే కారణుడైనను అతడు మాత్రము గుణరహితమైన దివ్యేంద్రియములను కలిగియున్నాడు. ఈ విషయమే “అపాణిపాదో జవనో గ్రహీతా” యని శ్వేతాశ్వతరోపనిషత్తు (3.19) నందలి శ్లోకములో చక్కగా వివరింపబడినది. అనగా భగవానుడు భౌతికగుణ సంపర్కము కలిగిన హస్తములను కాక దివ్యహస్తములను కలిగియుండి, తనకు అర్పించినదానిని వాని ద్వారా స్వీకరించును. ఇదియే బద్ధజీవునకు మరియు పరమాత్మునకు నడుమ గల భేదము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 504 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 15 🌴

15. sarvendriya-guṇābhāsaṁ sarvendriya-vivarjitam
asaktaṁ sarva-bhṛc caiva nirguṇaṁ guṇa-bhoktṛ ca


🌷 Translation : The Supersoul is the original source of all senses, yet He is without senses. He is unattached, although He is the maintainer of all living beings. He transcends the modes of nature, and at the same time He is the master of all the modes of material nature.

🌹 Purport : The Supreme Lord, although the source of all the senses of the living entities, doesn’t have material senses like they have. Actually, the individual souls have spiritual senses, but in conditioned life they are covered with the material elements, and therefore the sense activities are exhibited through matter. The Supreme Lord’s senses are not so covered. His senses are transcendental and are therefore called nirguṇa.

Guṇa means the material modes, but His senses are without material covering. It should be understood that His senses are not exactly like ours. Although He is the source of all our sensory activities, He has His transcendental senses, which are uncontaminated. This is very nicely explained in the Śvetāśvatara Upaniṣad (3.19) in the verse apāṇi-pādo javano grahītā. The Supreme Personality of Godhead has no hands which are materially contaminated, but He has His hands and accepts whatever sacrifice is offered to Him. That is the distinction between the conditioned soul and the Supersoul.

🌹 🌹 🌹 🌹 🌹


26 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 503: 13వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 503: Chap. 13, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 503 / Bhagavad-Gita - 503 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 14 🌴

14. సర్వత సర్వత: పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖమ్ |
సర్వత: శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి ||

🌷. తాత్పర్యం : సర్వత్ర అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించియున్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి నిలిచి యుండును.

🌷. భాష్యము : సూర్యుడు తన అపరిమిత కిరణములను ప్రసరించుచు స్థితిని కలిగియున్నట్లు, పరమాత్ముడు తన శక్తిని సర్వత్ర వ్యాపింపజేయుచు నిలిచియుండును. అతడు సర్వవ్యాపి రూపమున స్థితిని కలిగియుండగా ఆదిగురువైన బ్రహ్మ మొదలుగా చీమ వరకు సర్వజీవులు అతని యందు స్థితిని కలిగియుందురు. అనగా అసంఖ్యాకములుగా గల శిరములు, పాదములు, హస్తములు, నయనములు, అసంఖ్యాక జీవులన్నియును పరమాత్మ యందే స్థితిని కలిగియున్నవి. జీవులందరును పరమాత్ముని అంతర్భాహ్యములందు స్తితులై యున్నారు. కనుకనే అతడు సర్వవ్యాపిగా తెలియబడినాడు. పరమాత్మవలెనే తాను సైతము సర్వత్ర పాదములు మరియు హస్తములు కలిగి యున్నానని జీవుడెన్నడును పలుకలేడు. అది ఎన్నటికిని అతనికి సాధ్యము కాదు.

వాస్తవమునకు తన హస్తములు మరియు పాదములు సర్వత్ర వ్యాపించియున్నను అజ్ఞానకారణముగా తాను అది తెలియలేకున్నాననియు, కాని సరియైన జ్ఞానసముపార్జన పిమ్మట నిజముగా తాను అట్టి స్థితిని పొందగలననియు జీవుడు తలచినచో అది సత్యవిరుద్ధమే కాగలదు. అనగా ప్రకృతిచే బద్ధుడైన జీవుడు ఎన్నడును పరమాత్ముడు కాజాలడు. పరమాత్ముడు సర్వదా జీవునికి భిన్నమైనవాడు. ఉదాహరణకు భగవానుడు హద్దు అనునది లేకుండా తన హస్తములను చాచగలడు. కాని జీవునకు అది సాధ్యము కాదు. కనుకనే తనకు ఎవరైనా పత్రమునుగాన, పుష్పమునుగాని, ఫలమునుగాని లేదా జలమునుగాని అర్పించినచో తాను స్వీకరింతునని ఆ శ్రీకృష్ణభగవానుడు పలికియున్నాడు. అనగా అతడు తన ధామమునందు దివ్యలీలలలో నిమగ్నుడై యున్నను సర్వవ్యాపకుడై యుండునని భావము. భగవానుని వలె తానును సర్వవ్యాపినని జీవుడెన్నడును పలుకజాలడు. కనుకనే ఈ శ్లోకము పరమాత్మునే(దేవదేవుని) వర్ణించుచున్నది గాని జీవాత్ముని కాదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 503 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 14 🌴

14. sarvataḥ pāṇi-pādaṁ tat sarvato ’kṣi-śiro-mukham
sarvataḥ śrutimal loke sarvam āvṛtya tiṣṭhati



🌷 Translation : Everywhere are His hands and legs, His eyes, heads and faces, and He has ears everywhere. In this way the Supersoul exists, pervading everything.

🌹 Purport : As the sun exists diffusing its unlimited rays, so does the Supersoul, or Supreme Personality of Godhead. He exists in His all-pervading form, and in Him exist all the individual living entities, beginning from the first great teacher, Brahmā, down to the small ants. There are unlimited heads, legs, hands and eyes, and unlimited living entities. All are existing in and on the Supersoul. Therefore the Supersoul is all-pervading. The individual soul, however, cannot say that he has his hands, legs and eyes everywhere. That is not possible. If he thinks that under ignorance he is not conscious that his hands and legs are diffused all over but when he attains to proper knowledge he will come to that stage, his thinking is contradictory. This means that the individual soul, having become conditioned by material nature, is not supreme. The Supreme is different from the individual soul.

The Supreme Lord can extend His hand without limit; the individual soul cannot. In Bhagavad-gītā the Lord says that if anyone offers Him a flower, or a fruit, or a little water, He accepts it. If the Lord is a far distance away, how can He accept things? This is the omnipotence of the Lord: even though He is situated in His own abode, far, far away from earth, He can extend His hand to accept what anyone offers. That is His potency. In the Brahma-saṁhitā (5.37) it is stated, goloka eva nivasaty akhilātma-bhūtaḥ: although He is always engaged in pastimes in His transcendental planet, He is all-pervading. The individual soul cannot claim that he is all-pervading. Therefore this verse describes the Supreme Soul, the Personality of Godhead, not the individual soul.

🌹 🌹 🌹 🌹 🌹


25 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 502: 13వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 502: Chap. 13, Ver. 13


🌹. శ్రీమద్భగవద్గీత - 502 / Bhagavad-Gita - 502 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 13 🌴

13. జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యజ్ జ్ఞాత్వామృతమశ్నుతే |
అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ||


🌷. తాత్పర్యం : దేనిని తెలిసికొనుట ద్వారా నీవు అమృతత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. అనాదియును, నాకు ఆధీనమును అగు బ్రహ్మము(ఆత్మ) ఈ భౌతికజగపు కార్యకారణములకు అతీతమై యుండును.

🌷. భాష్యము : శ్రీకృష్ణభగవానుడు ఇంతవరకు కర్మక్షేత్రమును గూర్చి మరియు కర్మక్షేత్రము నెరిగిన క్షేత్రజ్ఞుని గూర్చి వివరించియున్నాడు. అలాగుననే క్షేత్రజ్ఞుని యెరుంగు విధానమును సైతము అతడు విశదీకరించియున్నాడు. ఇక తెలియదగినదానిని గూర్చి వివరింపనెంచి తొలుత ఆత్మను గూర్చియు, పిమ్మట పరమాత్మను గూర్చియు వివరించుట నారంభించుచున్నాడు. అట్టి ఆత్మ, పరమాత్మల జ్ఞానముచే మనుజుడు అమృతతత్త్వమును ఆస్వాదింపగలడు. ఆత్మ నిత్యమని ద్వితీయాధ్యాయమున తెలుపబడిన విషయమే ఇచ్చతను నిర్ధారింపబడుచున్నది. వాస్తవమునకు జీవుడు ఎన్నడు జన్మించెనో ఎవ్వరును తెలుపలేరు. అదే విధముగా అతడు భగవానుని నుండి ఉద్భవించిన వైనమునకు సంబంధించిన చరిత్రను సైతము ఎవ్వరును ఎరుంగరు. కనుకనే అతడు అనాది యని పిలువబడినాడు. ఈ విషయమే “న జాయతే మ్రియతే వా విపశ్చిత్” అని కఠోపనిషత్తు (1.2.18) నిర్ధారించుచున్నది. అనగా దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు అజుడును, అమృతుడును, జ్ఞానపూర్ణుడును అయియున్నాడు.

భగవానుడు పరమాత్ముని రూపమున ప్రధాన క్షేత్రజ్ఞునిగాను (దేహము నెరిగిన ప్రధాన జ్ఞాత) మరియు త్రిగుణములకు ప్రభువుగాను ఉన్నాడని శ్వేతాశ్వతరోపనిషత్తు (6.16) నందును తెలుపబడినది (ప్రధాన క్షేత్రజ్ఞపతి: గుణేశ).

అట్టి శ్రీకృష్ణభగవానుని సేవలో జీవులు సర్వదా నిలిచియుందురని “స్మృతి” యందు తెలుపబడినది (దాసభూతో హరేరేవ నాన్యస్యైవ కదాచన). ఈ విషయమునే శ్రీచైతన్యమహాప్రభువు తన బోధనల యందును నిర్ధారించియున్నారు. కావుననే ఈ శ్లోకమునందు తెలుపబడిన బ్రహ్మము యొక్క వర్ణనము ఆత్మకు సంబంధించినది. బ్రహ్మమను పదమును జీవునికి అన్వయించినపుడు అది జీవుడు విజ్ఞానబ్రహ్మమనియే సూచించును గాని ఆనందబ్రహ్మమని కాదు. పరబ్రహ్మమైన శ్రీకృష్ణభగవానుడే ఆనందబ్రహ్మము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 502 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 13 🌴

13. jñeyaṁ yat tat pravakṣyāmi yaj jñātvāmṛtam aśnute
anādi mat-paraṁ brahma na sat tan nāsad ucyate

🌷 Translation : I shall now explain the knowable, knowing which you will taste the eternal. Brahman, the spirit, beginningless and subordinate to Me, lies beyond the cause and effect of this material world.

🌹 Purport : The Lord has explained the field of activities and the knower of the field. He has also explained the process of knowing the knower of the field of activities. Now He begins to explain the knowable, first the soul and then the Supersoul. By knowledge of the knower, both the soul and the Supersoul, one can relish the nectar of life. As explained in the Second Chapter, the living entity is eternal. This is also confirmed here. There is no specific date at which the jīva was born. Nor can anyone trace out the history of the jīvātmā’s manifestation from the Supreme Lord.

Therefore it is beginningless. The Vedic literature confirms this: na jāyate mriyate vā vipaścit (Kaṭha Upaniṣad 1.2.18). The knower of the body is never born and never dies, and he is full of knowledge. The Supreme Lord as the Supersoul is also stated in the Vedic literature (Śvetāśvatara Upaniṣad 6.16) to be pradhāna-kṣetrajña-patir guṇeśaḥ, the chief knower of the body and the master of the three modes of material nature. In the smṛti it is said, dāsa-bhūto harer eva nānyasvaiva kadācana. The living entities are eternally in the service of the Supreme Lord. This is also confirmed by Lord Caitanya in His teachings. Therefore the description of Brahman mentioned in this verse is in relation to the individual soul, and when the word Brahman is applied to the living entity, it is to be understood that he is vijñāna-brahma as opposed to ānanda-brahma. Ānanda-brahma is the Supreme Brahman Personality of Godhead.

🌹 🌹 🌹 🌹 🌹

24 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 501: 13వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 501: Chap. 13, Ver. 12


🌹. శ్రీమద్భగవద్గీత - 501 / Bhagavad-Gita - 501 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 12 🌴

12. అధ్యాత్మ జ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థ దర్శనమ్ |
ఏతజ్ జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా ||


🌷. తాత్పర్యం : ఆధ్యాత్మ జ్ఞానపు ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్త్వము యొక్క తాత్త్వికాన్వేషణము అనునవి అన్నియును జ్ఞానమని నేను ప్రకటించు చున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే.

🌷. భాష్యము :


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 501 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 12 🌴


12. adhyātma-jñāna-nityatvaṁ tattva-jñānārtha-darśanam
etaj jñānam iti proktam ajñānaṁ yad ato ’nyathā



🌷 Translation : Accepting the importance of self-realization; and Philosophical search for the Absolute Truth – all these I declare to be knowledge, and besides this whatever there may be is ignorance.


🌹 Purport :


🌹 🌹 🌹 🌹 🌹


23 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 500: 13వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 500: Chap. 13, Ver. 11


🌹. శ్రీమద్భగవద్గీత - 500 / Bhagavad-Gita - 500 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 11 🌴

11. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ |
వివిక్త దేశ సేవిత్య మరతిర్జన సంసది


🌷. తాత్పర్యం : నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి, ఏకాంతవాస కోరిక, సామాన్య జనుల సహవాసము నందు అనాసక్తి.,

🌷. భాష్యము : ఇచ్చట తెలుపబడిన జ్ఞానము అనునది అతడు దాని నుండి బయటపడుటకు మార్గమై యున్నది. ఈ జ్ఞానవిధాన వర్ణనలలో అత్యంత ముఖ్యమైనది పదునొకండవ శ్లోకపు మొదటి పాదమునందు వివరింపబడినది.

అదియే “మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ” యనునది. అనగా జ్ఞానమనునది శ్రీకృష్ణభగవానుని విశుద్ధ భక్తియుతసేవ యందే పరిసమాప్తి నొందును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 500 🌹

✍️ Sri Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 11 🌴

11. mayi cānanya-yogena bhaktir avyabhicāriṇī
vivikta-deśa-sevitvam aratir jana-saṁsadi


🌷 Translation : Constant and unalloyed devotion to Me; Aspiring to live in a solitary place; detachment from the general mass of people;

🌹 Purport : The knowledge given here is the way for him to get out of it. The most important of these epistemological descriptions is that described in the first pada of the eleventh verse.

That is “My Chananyayogena Bhaktiravyabhi charini”. That is, knowledge is the culmination of pure devotional service to Lord Krishna.

🌹 🌹 🌹 🌹 🌹


23 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 499: 13వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 499: Chap. 13, Ver. 10


🌹. శ్రీమద్భగవద్గీత - 499 / Bhagavad-Gita - 499 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 10 🌴

10. అసక్తిరనభిష్వఙ్గః పుత్రదారగృహాదిషు |
నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు ||


🌷. తాత్పర్యం : అనాసక్తి, పుత్రకళత్ర గృహాదుల బంధము నుండి విముక్తి, సుఖదుఃఖ సమయము లందు సమభావము.,

🌷. భాష్యము : వాస్తవమైన ఆధ్యాత్మిక జీవనము ఆధ్యాత్మిక గురువును పొందిన పిమ్మటయే ఆరంభమగును గనుక భక్తియోగము నందున్నవారికి కూడా గురువును స్వీకరించుట అత్యంత ముఖ్యమైనది. ఈ జ్ఞానవిధానమే నిజమైన మార్గమని పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా పలుకుచున్నాడు. దీనికి అన్యముగా ఊహింపబడునదంతయు అర్థరహితమే.

పుత్ర, కళత్ర, గృహములందు అసంగత్వముగా వారియెడ ఎట్టి ప్రేమను కలిగియుండరాదని భావముకాదు. వాస్తవమునకు ప్రేమకు అవియన్నియును సహజ లక్ష్యములు. కాని ఆధ్యాత్మికపురోగతికి వారు అనుకూలము గాకున్నచో మనుజుడు వారియెడ ఆసక్తిని కలిగియుండరాదు.

సుఖదుఃఖములనునవి భౌతిక జీవనమునకు అనుబంధమైన విషయములు. కనుక గీత యందు ఉపదేశింప బడినట్లు వాటిని సహించుటను అలవరచు కొనవలెను. సుఖదుఃఖముల రాకపోకలను నిరోధించుట అసాధ్యము గనుక మనుజుడు భౌతిక జీవన విధానమునందు ఆసక్తిని విడనాడ వలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 499 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 10 🌴

10. asaktir anabhiṣvaṅgaḥ putra-dāra-gṛhādiṣu
nityaṁ ca sama-cittatvam iṣṭāniṣṭopapattiṣu


🌷 Translation : Detachment; freedom from entanglement with children, wife, home and the rest; even-mindedness amid pleasant and unpleasant events;

🌹 Purport : The principle of accepting a spiritual master, as mentioned in the eighth verse, is essential. Even for one who takes to devotional service, it is most important. Transcendental life begins when one accepts a bona fide spiritual master. The Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, clearly states here that this process of knowledge is the actual path. Anything speculated beyond this is nonsense.

As for detachment from children, wife and home, it is not meant that one should have no feeling for these. They are natural objects of affection. But when they are not favorable to spiritual progress, then one should not be attached to them.

Happiness and distress are concomitant factors of material life. One should learn to tolerate.

🌹 🌹 🌹 🌹 🌹


23 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 498: 13వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 498: Chap. 13, Ver. 09


🌹. శ్రీమద్భగవద్గీత - 498 / Bhagavad-Gita - 498 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 09 🌴

09. ఇన్ద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ |
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ ||


🌷. తాత్పర్యం : ఇంద్రియార్థముల పరిత్యాగము, మిథ్యాహంకార రాహిత్యము, జన్మమృత్యుజరా వ్యాధుల దోషమును గుర్తించుట,

🌷. భాష్యము : చతుర్వింశతి తత్త్వములచే (అంశములచే) తయారైన ఆచ్ఛాదనము వంటి దేహమునందు జీవుడు చిక్కుబడి యున్నాడు. ఇచ్చట తెలుపబడిన జ్ఞానము అనునది అతడు దాని నుండి బయట పడుటకు మార్గమై యున్నది. ఎనిమిదవ శ్లోకంలో పేర్కొన్నట్లుగా ఆధ్యాత్మిక గురువును అంగీకరించే సూత్రం చాలా అవసరం. భక్తి సేవలో పాల్గొనేవారికి కూడా ఇది చాలా ముఖ్యమైనది. ఒక మంచి ఆధ్యాత్మిక గురువును అంగీకరించినప్పుడు అతీంద్రియ జీవితం ప్రారంభమవుతుంది. భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తి, శ్రీ కృష్ణుడు, ఈ జ్ఞాన ప్రక్రియ నిజమైన మార్గం అని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఇంతకు మించిన ఊహాగానాలు ఏమీ అర్ధం కావు.

కనుక శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను స్వీకరింపనిచో లేక అంగీకరింప లేక పోయినచో ఇతర తొమ్మిది జ్ఞానప్రక్రియలు విలువ రహితములు కాగలవు. కాని సంపూర్ణ కృష్ణ భావనలో శ్రీకృష్ణుని భక్తియుత సేవను స్వీకరించినచో మనుజుని యందు మిగిలిన పంతొమ్మిది అంశములు అప్రయత్నముగా వృద్ధి నొందగలవు.

మిథ్యాహంకారమనగా దేహమునే ఆత్మయని భావించుట. మనుజుడు తాను దేహమును కానని, ఆత్మనని తెలిసినప్పుడు వాస్తవ అహంకారమునకు వచ్చును. అహంకారమనునది సత్యమైనది. అనగా మిథ్యాహంకారమే నిరసించబడుచున్నది గాని అహంకారము కాదు.

ఈ జన్మము, మృత్యువు, ముసలితనము మరియు వ్యాధుల యందలి దుఖమును తలచుచు భౌతికజీవితమునందు నిరాశ మరియు వైరాగ్యదృష్టిని కలిగియుండనిదే మన ఆధ్యాత్మికజీవనము నందు పురోగతికి ప్రేరణము లభింపదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 498 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 09 🌴

09. indriyārtheṣu vairāgyam anahaṅkāra eva ca
janma-mṛtyu-jarā-vyādhi- duḥkha-doṣānudarśanam


🌷 Translation : Renunciation of the objects of sense gratification; absence of false ego; the perception of the evil of birth, death, old age and disease;

🌹 Purport : The embodied soul is entrapped by the body, which is a casing made of the twenty-four elements, and the process of knowledge as described here is the means to get out of it. But if one takes to devotional service in full Kṛṣṇa consciousness, the other nineteen items automatically develop within him. The principle of accepting a spiritual master, as mentioned in the eighth verse, is essential. Even for one who takes to devotional service, it is most important. Transcendental life begins when one accepts a bona fide spiritual master. The Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, clearly states here that this process of knowledge is the actual path. Anything speculated beyond this is nonsense.

Cleanliness is essential for making advancement in spiritual life. There are two kinds of cleanliness: external and internal.

False ego means accepting this body as oneself. When one understands that he is not his body and is spirit soul, he comes to his real ego. Ego is there. False ego is condemned, but not real ego.

🌹 🌹 🌹 🌹 🌹

23 Aug 2020

శ్రీమద్భగవద్గీత - 497: 13వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 497: Chap. 13, Ver. 08


🌹. శ్రీమద్భగవద్గీత - 497 / Bhagavad-Gita - 497 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 08 🌴

08. అమానిత్వమదమ్భిత్వమహింసా క్షాన్తిరార్జవమ్ |
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహ: ||

🌷. తాత్పర్యం : వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణిక గురువు నాశ్రయించుట, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము.,

🌷. భాష్యము : ఈ జ్ఞానవిధానము అల్పజ్ఞులైన మనుజులచే కొన్నిమార్లు కర్మక్షేత్రపు అంత:ప్రక్రియ యనుచు తప్పుగా భావింపబడును. కాని వాస్తవమునకు ఇదియే నిజమైన జ్ఞానవిధానము. ఇట్టి విధానము మనుజుడు స్వీకరించినచో పరతత్త్వమును చేరగల అవకాశము కలుగ గలదు. పూర్వము వివరించినట్లు ఈ జ్ఞానము కర్మక్షేత్రము నందలి ఇరువదినాలుగు అంశముల యొక్క అంత:ప్రక్రియ గాక వాటి బంధము నుండి ముక్తి నొందుట నిజమైన మార్గమై యున్నది.

మొదటిదైన వినమ్రత అనగా ఇతరులచే గౌరవమును పొందవలెనని ఆరాటపడకుండుట యని భావము.

అహింస యనునది చంపకుండుట లేదా దేహమును నశింపజేయకుండుటనెడి భావనలో స్వీకరించుబడుచుండును. కాని వాస్తవమునకు ఇతరులను కష్టపెట్టకుండుటయే అహింస యనుదాని భావము.

సహనమనగా ఇతరుల నుండి కలుగు మానావమానములను సహించు ఆభాసమును కలిగియుండుట యని భావము.

ఆర్జవమనగా ఎట్టి తంత్రము లేకుండా శత్రువునకు సైతము సత్యమును తెలుప గలిగనంత ఋజుత్వమును కలిగి యుండుట యని భావము.

ఆధ్యాత్మిక జీవనమున పురోగతి సాధింపవలెను దృఢ నిశ్చయమును మనుజుడు కలిగి యుండుటయే స్థిరత్వమను దాని భావము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 497 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 08 🌴

08. amānitvam adambhitvam ahiṁsā kṣāntir ārjavam
ācāryopāsanaṁ śaucaṁ sthairyam ātma-vinigrahaḥ


🌷 Translation : Humility; pridelessness; nonviolence; tolerance; simplicity; approaching a bona fide spiritual master; cleanliness; steadiness; self-control;

🌹 Purport : This process of knowledge is sometimes misunderstood by less intelligent men as being the interaction of the field of activity. But actually this is the real process of knowledge. If one accepts this process, then the possibility of approaching the Absolute Truth exists. This is not the interaction of the twenty-four elements, as described before. This is actually the means to get out of the entanglement of those elements.

Humility means that one should not be anxious to have the satisfaction of being honored by others.

Nonviolence is generally taken to mean not killing or destroying the body, but actually nonviolence means not to put others into distress.

Tolerance means that one should be practiced to bear insult and dishonor from others.

Steadiness means that one should be very determined to make progress in spiritual life. Without such determination, one cannot make tangible progress.

Simplicity means that without diplomacy one should be so straightforward that he can disclose the real truth even to an enemy.

self-control means that one should not accept anything which is detrimental to the path of spiritual progress. One should become accustomed to this and reject anything which is against the path of spiritual progress.

🌹 🌹 🌹 🌹 🌹


23 Aug 2020

శ్రీమద్భగవద్గీత - 496: 13వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 496: Chap. 13, Ver. 07


🌹. శ్రీమద్భగవద్గీత - 496 / Bhagavad-Gita - 496 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 07 🌴

07. ఇచ్చా ద్వేష: సుఖం దుఃఖం సఙ్ఘాతశ్చేతనా ధృతి: |
ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ||


🌷. తాత్పర్యం : కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవలక్షణములు, విశ్వాసము అనునవి సంగ్రహముగా కర్మక్షేత్రముగను, దాని అంత:ప్రక్రియలుగను భావింపబడు చున్నవి.

🌷. భాష్యము : మనస్సు అంతరమందుండుటచే అతరేంద్రియముగా పిలువబడును. కావున ఈ మనస్సుతో కలిపి మొత్తము పదుకొండు ఇంద్రియములు గలవు. ఇక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనెడి ఇంద్రియార్థములు ఐదు. ఈ ఇరువదినాలుగు అంశములు విశ్లేషణాత్మక అధ్యయనము కావించినచో కర్మక్షేత్రము అతనికి సంపూర్ణముగా అవగతము కాగలదు. ఇక అంత:ప్రక్రియములైన కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము అనునవి దేహమునందు పంచభూతముల యొక్క ప్రాతినిధ్యములు. అదే విధముగా చైతన్యముచే సుచింపబడు జీవలక్షణములు మరియు విశ్వాసమనునవి మనస్సు, బుద్ధి, అహంకారమును సూక్ష్మశరీరమును యొక్క వ్యక్తరూపములు. ఈ సూక్ష్మంశములు కర్మక్షేత్రమునందే చేర్చబడియున్నవి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 496 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 07 🌴

07. icchā dveṣaḥ sukhaṁ duḥkhaṁ saṅghātaś cetanā dhṛtiḥ
etat kṣetraṁ samāsena sa-vikāram udāhṛtam

🌷 Translation : The desire, hatred, happiness, distress, the aggregate, the life symptoms, and convictions – all these are considered, in summary, to be the field of activities and its interactions.

🌹 Purport : Then, above the senses, there is the mind, which is within and which can be called the sense within. Therefore, including the mind, there are eleven senses altogether. Then there are the five objects of the senses: smell, taste, form, touch and sound. Now the aggregate of these twenty-four elements is called the field of activity. If one makes an analytical study of these twenty-four subjects, then he can very well understand the field of activity. Then there are desire, hatred, happiness and distress, which are interactions, representations of the five great elements in the gross body. The living symptoms, represented by consciousness, and convictions are the manifestation of the subtle body – mind, ego and intelligence. These subtle elements are included within the field of activities.

🌹 🌹 🌹 🌹 🌹


22 Aug 2020

శ్రీమద్భగవద్గీత - 495: 13వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 495: Chap. 13, Ver. 06


🌹. శ్రీమద్భగవద్గీత - 495 / Bhagavad-Gita - 495 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 06 🌴

06. మహాభూతన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ |
ఇన్ద్రియాణి దశైకం చ పంచ చేన్ద్రియగోచరా: ||


🌷. తాత్పర్యం : పంచ మహాభూతములు, మిథ్యాహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, ఐదు ఇంద్రియార్థములు..

🌷. భాష్యము : మహాఋషులు ప్రామాణిక వచనములైనట్టి వేదమంత్రములు మరియు వేదాంతసూత్రముల ననుసరించి విశ్వము యొక్క మూలాంశములను ఈ క్రింది విధముగా అవగాహననము చేసికొనవచ్చును.

తొలుత పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశామును పంచమహాభూతములు, తరువాత మిథ్యాహంకారము, బుద్ధి, ప్రకృతిజన్య త్రిగుణముల అవ్యక్తస్థితి, ఆ తరువాత త్వక్, చక్షు, శోత్ర, జిహ్వ, ఘ్రాణములనెడి పంద జ్ఞానేంద్రియములు, ఆ పిదప వాక్కు, పాదములు, హస్తములు, గుదము, జననేంద్రియములనెడి పంచ కర్మేంద్రియములు, ఆ ఇంద్రియములపై మనస్సు గలవు. ఈ మనస్సు అంతరమందుండుటచే అతరేంద్రియముగా పిలువబడును. కావున ఈ మనస్సుతో కలిపి మొత్తము పదుకొండు ఇంద్రియములు గలవు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 495 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 06 🌴


06. mahā-bhūtāny ahaṅkāro buddhir avyaktam eva ca
indriyāṇi daśaikaṁ ca pañca cendriya-gocarāḥ

🌷 Translation : The five great elements, false ego, intelligence, the unmanifested, the ten senses and the mind, the five sense objects.,

🌹 Purport : From all the authoritative statements of the great sages, the Vedic hymns and the aphorisms of the Vedānta-sūtra, the components of this world can be understood as follows. First there are earth, water, fire, air and ether. These are the five great elements (mahā-bhūta). Then there are false ego, intelligence and the unmanifested stage of the three modes of nature. Then there are five senses for acquiring knowledge: the eyes, ears, nose, tongue and skin. Then five working senses: voice, legs, hands, anus and genitals. Then, above the senses, there is the mind, which is within and which can be called the sense within.

Therefore, including the mind, there are eleven senses altogether. Then there are the five objects of the senses: smell, taste, form, touch and sound. Now the aggregate of these twenty-four elements is called the field of activity. If one makes an analytical study of these twenty-four subjects, then he can very well understand the field of activity.

🌹 🌹 🌹 🌹 🌹


22 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 494: 13వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 494: Chap. 13, Ver. 05


🌹. శ్రీమద్భగవద్గీత - 494 / Bhagavad-Gita - 494 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 05 🌴

05. ఋషిభిర్బహుధా గీతం ఛన్దోభిర్వివిధై: పృథక్ |
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై: ||


🌷. తాత్పర్యం : క్షేత్రము, క్షేత్రములను గూర్చిన ఆ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేదగ్రంథము లందు వర్ణింప బడినది. అట్టి జ్ఞానము విశేషముగా వేదాంతసూత్రములందు కార్యకారణములతో హేతుబద్ధముగా ప్రకటింప బడినది.

🌷. భాష్యము : ఈ క్షేత్రక్షేత్రజ్ఞ జ్ఞానమును విశదీకరించుటలో దేవదేవుడైన శ్రీకృష్ణుడే వాస్తవమునకు అత్యున్నత ప్రామాణికుడై యున్నాడు. అయినను సామాన్య ఆచారము ప్రకారము విద్వాంసులు మరియు ప్రామాణికులైనవారు సర్వదా ఏ విషయమును గూర్చియైననను పూర్వపు ఆచార్యుల వచనములను నిదర్శనములుగా చూపుదురు గనుక ఇచ్చట శ్రీకృష్ణుడు ఆత్మ, పరమాత్మల అతి వివాదాస్పాదమైన ద్వైతాద్వైత విషయములను ప్రామాణికమైనవిగా అంగీకరించబడిన వేదాంతసూత్రములకు అన్వయించుచు వివరించుచున్నాడు. కనుకనే తొలుత అతడు “ఇది పలువురు ఋషుల అభిప్రాయము ననుసరించి యున్నది” యని పలికియుండెను. అట్టి ఋషులలో వేదాంతసూత్ర కర్తయైన వ్యాసదేవుడు గొప్ప ఋషి.

ఆ వ్యాసదేవుని వేదాంతసూత్రములలో ద్వైతత్వము పూర్ణముగా విశదీకరింపబడినది. వ్యాసదేవుని జనకుడైన పరాశరముని సైతము గొప్ప ఋషి. ఆయన తన ధర్మగ్రంథములలో “అహం త్వం చ తథాన్యే.... “ యని రచించియుండెను. “అనగా నేను, నీవు, ఇతర జీవులనెడి మనమందరము భౌతికదేహముల యందున్నను వాస్తవమునకు దివ్యులమే. కాని ప్రస్తుతము మన వివిధకర్మల కారణముగా మనము వివిధ ప్రకృతిజన్యగుణములచే బంధితులమైనాము. తత్కారణముగా కొందరు ఉన్నతగుణ స్థితిలో, మరికొందరు అధమనైజములో నిలిచియున్నారు. కాని ఈ ఉన్నత, అధమ స్వభావములనునవి అజ్ఞానజనితములు. అవియే అసంఖ్యాక జీవరాసులుగా ప్రకటమగుచుండును. కాని చ్యుతి లేనటువంటి పరమాత్ముడు మాత్రము ప్రకృతిజన్య త్రిగుణములచే అపవిత్రుడు గాక దివ్యుడై యున్నాడు.”

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 494 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 05 🌴

05. ṛṣibhir bahudhā gītaṁ chandobhir vividhaiḥ pṛthak
brahma-sūtra-padaiś caiva hetumadbhir viniścitaiḥ


🌷 Translation : That knowledge of the field of activities and of the knower of activities is described by various sages in various Vedic writings. It is especially presented in Vedānta-sūtra with all reasoning as to cause and effect.

🌹 Purport : The Supreme Personality of Godhead, Kṛṣṇa, is the highest authority in explaining this knowledge. Still, as a matter of course, learned scholars and standard authorities always give evidence from previous authorities. Kṛṣṇa is explaining this most controversial point regarding the duality and nonduality of the soul and the Supersoul by referring to a scripture, the Vedānta, which is accepted as authority. First He says, “This is according to different sages.” As far as the sages are concerned, besides Himself, Vyāsadeva (the author of the Vedānta-sūtra) is a great sage, and in the Vedānta-sūtra duality is perfectly explained.

And Vyāsadeva’s father, Parāśara, is also a great sage, and he writes in his books of religiosity, aham tvaṁ ca tathānye.… “we – you, I and the various other living entities – are all transcendental, although in material bodies. Now we are fallen into the ways of the three modes of material nature according to our different karma. As such, some are on higher levels, and some are in the lower nature. The higher and lower natures exist due to ignorance and are being manifested in an infinite number of living entities. But the Supersoul, which is infallible, is uncontaminated by the three qualities of nature and is transcendental.”

🌹 🌹 🌹 🌹 🌹


21 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 493: 13వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 493: Chap. 13, Ver. 04


🌹. శ్రీమద్భగవద్గీత - 493 / Bhagavad-Gita - 493 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 04 🌴

04. తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ |
స చ యో యత్ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు ||


🌷. తాత్పర్యం : ఇప్పుడు క్షేత్రమును, అది నిర్మించబడిన విధానము, దాని యందలి మార్పులను, దేని నుండి అది ఉద్భవించినదనెడి విషయమును, క్షేత్రజ్ఞుడు మరియు అతని ప్రభావములను గూర్చిన నా సంక్షేపవర్ణనను ఆలకింపుము.

🌷. భాష్యము : కర్మక్షేత్రము మరియు కర్మక్షేత్రపు జ్ఞాతయైన క్షేత్రజ్ఞుని సహజస్థితిని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వర్ణించుచున్నాడు. ఏ విధముగా ఈ దేహము నిర్మింపబడుచున్నది, ఏ మూలకములచే ఇది ఏర్పడుచున్నది, ఎవని నియామకమున ఇది పనిచేయుచున్నది, దీనియందలి మార్పులు ఎట్లు కలుగుచున్నవి, ఆ మార్పులు ఎచ్చట నుండి కలుగుచున్నవి, అట్టి మార్పులకు కారణము మరియు హేతువులేవి, ఆత్మ యొక్క చరమగమ్యమేది, ఆత్మ యొక్క నిజరూపమేది యనెడి విషయములను ప్రతియొక్కరు తెలిసికొనవలసియున్నది.

అంతియే గాక జీవాత్మకును పరమాత్మకును నడుమగల భేదము, వారి ప్రభావములు, సామర్థ్యములు కూడ మనుజుడు ఎరిగియుండవలెను. అందులకు శ్రీకృష్ణభగవానుడు ప్రత్యక్షముగా ఉపదేశించిన ఈ భగవద్గీతను అవగతము చేసికొనిన చాలును. అంతట సర్వము సుస్పష్టము కాగలదు. కాని ఎల్లదేహముల యందున్న భగవానుడు జీవాత్మతో సమానుడని ఎవ్వరును భావింపరాదు. అట్టి భావనము శక్తిమంతుడైనవానిని శక్తిహీనునితో సమానము చేయుటయే కాగలదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 493 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 04 🌴

04. tat kṣetraṁ yac ca yādṛk ca yad-vikāri yataś ca yat
sa ca yo yat-prabhāvaś ca tat samāsena me śṛṇu

🌷 Translation : Now please hear My brief description of this field of activity and how it is constituted, what its changes are, whence it is produced, who that knower of the field of activities is, and what his influences are.

🌹 Purport : The Lord is describing the field of activities and the knower of the field of activities in their constitutional positions. One has to know how this body is constituted, the materials of which this body is made, under whose control this body is working, how the changes are taking place, wherefrom the changes are coming, what the causes are, what the reasons are, what the ultimate goal of the individual soul is, and what the actual form of the individual soul is.

One should also know the distinction between the individual living soul and the Supersoul, their different influences, their potentials, etc. One just has to understand this Bhagavad-gītā directly from the description given by the Supreme Personality of Godhead, and all this will be clarified. But one should be careful not to consider the Supreme Personality of Godhead in every body to be one with the individual soul, the jīva. This is something like equating the potent and the impotent.

🌹 🌹 🌹 🌹 🌹


20 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 492: 13వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 492: Chap. 13, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 492 / Bhagavad-Gita - 492 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 03 🌴

03. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |
క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ ||

🌷. తాత్పర్యం : ఓ భరత వంశీయుడా ! సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలిసికొనుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసికొనుటయే జ్ఞానమని నా అభిప్రాయము.


🌷. భాష్యము : దేహము మరియు దేహము నెరిగినవాని గూర్చియు, ఆత్మ మరియు పరమాత్ముని గూర్చియు చర్చించునపుడు భగవానుడు, జీవుడు, భౌతికపదార్థమనెడి మూడు అంశములు మనకు గోచరించును. ప్రతి కర్మక్షేత్రమునందును (ప్రతిదేహమునందును) జీవాత్మ, పరమాత్మలను రెండు ఆత్మలు గలవు. అట్టి పరమాత్మ రూపము తన ప్రధాన విస్తృతాంశమైనందున శ్రీకృష్ణభగవానుడు “నేను కూడా క్షేత్రజ్ఞుడను. కాని దేహము నందలి వ్యక్తిగత క్షేత్రజ్ఞుడను కాను. పరమజ్ఞాతయైన నేను పరమాత్మరూపమున ప్రతిదేహము నందును వసించియున్నాను” అని పలికెను. భగవద్గీత దృష్ట్యాఈ కర్మక్షేత్రమును మరియు కర్మక్షేత్రము నెరిగినవానిని గూర్చిన విషయమును సూక్ష్మముగా అధ్యయనము చేయువాడు సంపూర్ణజ్ఞానమును పొందగలడు.

“ప్రతిదేహమునందును నేను కూడా క్షేత్రజ్ఞుడనై యుందును” అని శ్రీకృష్ణభగవానుడు పలికియున్నాడు. అనగా జీవుడు తన దేహమును గూర్చి మాత్రమే ఎరిగియుండును. ఇతర దేహముల జ్ఞానమతనికి ఉండదు. కాని సర్వదేహముల యందు పరమాత్మ రూపమున వసించు శ్రీకృష్ణభగవానుడు మాత్రము సర్వదేహములను గూర్చిన సమస్త విషయములను మరియు వివిధ జీవజాతుల వివిధ దేహములను సంపూర్ణముగా ఎరిగియుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 492 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 03 🌴

03. kṣetra-jñaṁ cāpi māṁ viddhi sarva-kṣetreṣu bhārata
kṣetra-kṣetrajñayor jñānaṁ yat taj jñānaṁ mataṁ mama


🌷 Translation : O scion of Bharata, you should understand that I am also the knower in all bodies, and to understand this body and its knower is called knowledge. That is My opinion.

🌹 Purport : While discussing the subject of the body and the knower of the body, the soul and the Supersoul, we shall find three different topics of study: the Lord, the living entity, and matter. In every field of activities, in every body, there are two souls: the individual soul and the Supersoul. Because the Supersoul is the plenary expansion of the Supreme Personality of Godhead, Kṛṣṇa, Kṛṣṇa says, “I am also the knower, but I am not the individual knower of the body. I am the superknower. I am present in every body as the Paramātmā, or Supersoul.”

One who studies the subject matter of the field of activity and the knower of the field very minutely, in terms of this Bhagavad-gītā, can attain to knowledge. The Lord says, “I am the knower of the field of activities in every individual body.” The individual may be the knower of his own body, but he is not in knowledge of other bodies. The Supreme Personality of Godhead, who is present as the Supersoul in all bodies, knows everything about all bodies. He knows all the different bodies of all the various species of life.

🌹 🌹 🌹 🌹 🌹

19 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 491: 13వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 491: Chap. 13, Ver. 02


🌹. శ్రీమద్భగవద్గీత - 491 / Bhagavad-Gita - 491 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 02 🌴

02. శ్రీ భగవానువాచ

ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిదీయతే |
ఏతద్ యో వేత్తి తం ప్రాహు: క్షేత్రజ్ఞ ఇతి తద్విద: ||

🌷. తాత్పర్యం : శ్రీకృష్ణభగవానుడు పలికెను; ఓ కౌంతేయా! ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును.


🌷. భాష్యము : ఈ దేహము క్షేత్రముగా పిలివబడుననియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞునిగా పిలువ బడుననియు శ్రీకృష్ణభగవానుడు పలికెను. ఈ దేహము బద్ధజీవునకు కర్మక్షేత్రము. అతడు భౌతికస్థితిలో చిక్కుకొని ప్రకృతిపై అధిపత్యమును చెలాయించవలెనని యత్నించును. ఆ విధముగా ప్రకృతిపై అధిపత్యము వహింపగలిగిన తన సామర్థ్యము ననుసరించి అతడు కర్మక్షేత్రమును పొందును. ఆ కర్మక్షేత్రమే దేహము. ఇక దేహమనగా ఇంద్రియములను కూడినట్టిది. బద్ధజీవుడు ఇంద్రియసుఖమును అనుభవింపగోరును. ఆ ఇంద్రియసుఖము అనుభవించుటకు గల సామర్థ్యము ననుసరించి అతనికి ఒక దేహము(కర్మ క్షేత్రము) ఒసగబడును. కనుకనే దేహము బద్ధజీవుని కర్మక్షేత్రమని పిలువబడును.

అట్టి దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడని పిలువబడును. క్షేత్రమునకు మరియు క్షేత్రజ్ఞునకు నడుమగల భేదమును, అనగా దేహమునకు మరియు దేహము నెరిగినవానికి నడుమ భేదమును అవగాహన చేసికొనుట కష్టమైన విషయము కాదు. దేహమునకు యజమాని “క్షేత్రజ్ఞుడు”. నేను సుఖిని, నేను పురుషుడను, నేను స్త్రీని, నేను శునకమును, నేను మార్జాలమును అను భావనల ఆ క్షేత్రజ్ఞుని ఉపాధులు మాత్రమే. కాని వాస్తవమునకు క్షేత్రజ్ఞుడు దేహమునకు అన్యుడు. దేహమునకు వస్త్రమువంటి పెక్కింటిని మనము ఉపయోగించినను వాటికన్నను మనము అన్యులమని స్పష్టముగా నెరుగగలము. అనగా దేహమునకు యజమాని (నేను లేదా నీవు లేదా ఎవరైనను) క్షేత్రజ్ఞుడనియు (కర్మక్షేత్రము నెరిగినవాడు) మరియు దేహము క్షేత్రమనియు (కర్మ క్షేత్రమని) పిలువబడును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 491 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 02 🌴

02. śrī-bhagavān uvāca

idaṁ śarīraṁ kaunteya kṣetram ity abhidhīyate
etad yo vetti taṁ prāhuḥ kṣetra-jña iti tad-vidaḥ


🌷 Translation : The Supreme Personality of Godhead said: This body, O son of Kuntī, is called the field, and one who knows this body is called the knower of the field.

🌹 Purport : When he inquired about all these, Kṛṣṇa said that this body is called the field and that one who knows this body is called the knower of the field. This body is the field of activity for the conditioned soul. The conditioned soul is entrapped in material existence, and he attempts to lord it over material nature. And so, according to his capacity to dominate material nature, he gets a field of activity. That field of activity is the body. And what is the body? The body is made of senses. The conditioned soul wants to enjoy sense gratification, and, according to his capacity to enjoy sense gratification, he is offered a body, or field of activity.

Therefore the body is called kṣetra, or the field of activity for the conditioned soul. Now, the person, who should not identify himself with the body, is called kṣetra-jña, the knower of the field. It is not very difficult to understand the difference between the field and its knower, the body and the knower of the body. Although we may use many articles – our clothes, etc. – we know that we are different from the things used. Similarly, we also understand by a little contemplation that we are different from the body. I or you or anyone else who owns the body is called kṣetra-jña, the knower of the field of activities, and the body is called kṣetra, the field of activities itself.

🌹 🌹 🌹 🌹 🌹


18 Aug 2020

శ్రీమద్భగవద్గీత - 490: 13వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 490: Chap. 13, Ver. 01


🌹. శ్రీమద్భగవద్గీత - 490 / Bhagavad-Gita - 490 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 01 🌴

01. అర్జున ఉవాచ : ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ |
ఏతద్ వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ ||


🌷. తాత్పర్యం : అర్జునుడు పలికెను : ఓ కృష్ణా! ప్రకృతి మరియు పురుషుని (భోక్త) గూర్చియు, క్షేత్రము మరియు క్షేత్రము నెరిగినవానిని గూర్చియు, జ్ఞానము మరియు జ్ఞానలక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను.

🌷. భాష్యము : ప్రకృతి, పురుషుడు(భోక్త), క్షేత్రము, క్షేత్రజ్ఞుడు (క్షేత్రము నెరిగినవాడు), జ్ఞానము, జ్ఞానలక్ష్యముల యెడ అర్జునుడు మిగుల జిజ్ఞాసువై యున్నాడు. అర్జునుడు ఈ విషయములను గూర్చి వివరింప మని కోరాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 490 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 01🌴

01. arjuna uvāca

prakṛtiṁ puruṣaṁ caiva kṣetraṁ kṣetra-jñam eva ca
etad veditum icchāmi jñānaṁ jñeyaṁ ca keśava


🌷 Translation : Arjuna said: O my dear Kṛṣṇa, I wish to know about prakṛti [nature], puruṣa [the enjoyer], and the field and the knower of the field, and of knowledge and the object of knowledge.

🌹 Purport : Arjuna was inquisitive about prakṛti (nature), puruṣa (the enjoyer), kṣetra (the field), kṣetra-jña (its knower), and knowledge and the object of knowledge.


🌹 🌹 🌹 🌹 🌹


18 Aug 2020



శ్రీమద్భగవద్గీత - 489: 12వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 489: Chap. 12, Ver. 20


🌹. శ్రీమద్భగవద్గీత - 489 / Bhagavad-Gita - 489 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -20 🌴

20. యే తు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే |
శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తే(తీవ మే ప్రియా: ||


🌷. తాత్పర్యం : నన్నే పరమగమ్యముగా చేసికొని భక్తియోగమను ఈ అమృతపథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైనవారు నాకు అత్యంత ప్రియులు.

🌷. భాష్యము : ఈ అధ్యాయపు రెండవ శ్లోకము “మయ్యావేశ్య మనో యే మాం” (మనస్సును నా యందే సంలగ్నము చేసి) నుండి చివరి ఈ శోకమైన “యే తు ధర్మామృతమిదం” (ఈ నిత్యసేవాధర్మము) వరకు శ్రీకృష్ణభగవానుడు తనను చేరుటకు గల దివ్య సేవాపద్ధతులను వివరించెను. ఈ భక్తియుక్తసేవా కార్యములు శ్రీకృష్ణునకు అత్యంత ప్రియములై యున్నవి. వాని యందు నియుక్తుడైన మనుజుని అతడు ప్రేమతో అనుగ్రహించును.

నిరాకార బ్రహ్మ మార్గము నందు నిమగ్నుడైనవాడు ఉత్తముడా లేక పూర్ణపురుషోత్తముడగు భగవానుని ప్రత్యక్షసేవలో నియుక్తుడైనవాడు ఉత్తముడా అను ప్రశ్నను అర్జునుడు లేవదీసియుండెను. అర్జునుని అట్టి ప్రశ్నకు శ్రీకృష్ణుడు తన భక్తియుతసేవయే ఆత్మానుభవమునకు గల వివిధపద్ధతులలో అత్యంత శ్రేష్టమైనదనుటలో ఎట్టి సందేహము లేదని స్పష్టముగా సమాధానమొసగినాడు. అనగా సత్సంగము ద్వారా మనుజుడు శుద్ధ భక్తియోగము నెడ అభిరుచిని వృద్ధిచేసికొనుననియు, తద్ద్వారా అతడు ఆధ్యాత్మికగురువును స్వీకరించి ఆయన నుండి శ్రవణ, కీర్తనములను చేయుటను ఆరంభించి శ్రద్ధ, అనురాగము, భక్తిభావములతో భక్తియోగమందలి నియమనిబంధనలను పాటించుచు శ్రీకృష్ణభగవానుని దివ్యసేవలో నియుక్తుడు కాగలడనియు ఈ అధ్యాయమున నిర్ణయింపబడినది.

శ్రీమద్భగవద్గీత యందలి “భక్తియోగము” అను ద్వాదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 489 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 20 🌴

20. ye tu dharmāmṛtam idaṁ yathoktaṁ paryupāsate
śraddadhānā mat-paramā bhaktās te ’tīva me priyāḥ


🌷 Translation : Those who follow this imperishable path of devotional service and who completely engage themselves with faith, making Me the supreme goal, are very, very dear to Me.

🌹 Purport : In this chapter, from verse 2 through the end – from mayy āveśya mano ye mām (“fixing the mind on Me”) through ye tu dharmāmṛtam idam (“this religion of eternal engagement”) – the Supreme Lord has explained the processes of transcendental service for approaching Him. Such processes are very dear to the Lord, and He accepts a person engaged in them. The question of who is better – one who is engaged in the path of impersonal Brahman or one who is engaged in the personal service of the Supreme Personality of Godhead – was raised by Arjuna, and the Lord replied to him so explicitly that there is no doubt that devotional service to the Personality of Godhead is the best of all processes of spiritual realization.

In other words, in this chapter it is decided that through good association one develops attachment for pure devotional service and thereby accepts a bona fide spiritual master and from him begins to hear and chant and observe the regulative principles of devotional service with faith, attachment and devotion and thus becomes engaged in the transcendental service of the Lord. This path is recommended in this chapter; therefore there is no doubt that devotional service is the only absolute path for self-realization, for the attainment of the Supreme Personality of Godhead.

Thus end the Bhaktivedanta Purports to the Twelfth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Devotional Service.

🌹 🌹 🌹 🌹 🌹


17 Aug 2020



శ్రీమద్భగవద్గీత - 488: 12వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 488: Chap. 12, Ver. 19


🌹. శ్రీమద్భగవద్గీత - 488 / Bhagavad-Gita - 488 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము - 19 🌴

19. తుల్యనిన్దాస్తుతిర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్ |
అనికేత: స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నర: ||


🌷. తాత్పర్యం : అసత్సంగము నుండి సదా విడివడియుండువాడును, సదా మౌనియైన వాడును, దేనిచేతనైనను సంతుష్టి నొందెడి వాడును, నివాసమేదైనను లెక్క చేయనివాడును, జ్ఞానమునందు స్థితుడైన వాడును, నా భక్తియుతసేవ యందు నియుక్తుడైనట్టి వాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు.

🌷. భాష్యము : ఒక భక్తుడు అన్ని పరిస్థితులలో సంతోషంగా ఉంటాడు; కొన్నిసార్లు అతను చాలా రుచికరమైన ఆహార పదార్థాలను పొందవచ్చు, కొన్నిసార్లు కాదు, కానీ అతను సంతృప్తి చెందాడు. అలాగే అతను ఏ నివాస సౌకర్యాన్ని పట్టించుకోడు. అతను కొన్నిసార్లు చెట్టు కింద నివసించ వచ్చు మరియు కొన్నిసార్లు అతను చాలా రాజభవన భవనంలో నివసించవచ్చు; అతను ఎవరికీ ఆకర్షించబడడు. అతను తన సంకల్పం మరియు జ్ఞానంలో స్థిరంగా ఉన్నందున అతన్ని స్థిరంగా పిలుస్తారు.

భక్తుని అర్హతల వర్ణనలో మనం కొన్ని పునరావృత్తులు కనుగొనవచ్చు, కానీ ఇది కేవలం భక్తుడు ఈ అర్హతలన్నింటినీ తప్పనిసరిగా పొందాలనే వాస్తవాన్ని నొక్కి చెప్పడం కోసం మాత్రమే. మంచి అర్హతలు లేకుండా, స్వచ్ఛమైన భక్తుడు కాలేడు. భక్తుడు కాని వ్యక్తికి మంచి అర్హత లేదు. భక్తునిగా గుర్తింపు పొందాలనుకునే వ్యక్తి మంచి అర్హతలను పెంపొందించుకోవాలి. వాస్తవానికి అతను ఈ అర్హతలను పొందేందుకు బాహ్యంగా ప్రయత్నించడు, కానీ కృష్ణ చైతన్యం మరియు భక్తి సేవలో నిమగ్నమవ్వడం అతనికి స్వయంచాలకంగా వాటిని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 488 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 19 🌴

19. tulya-nindā-stutir maunī santuṣṭo yena kenacit
aniketaḥ sthira-matir bhaktimān me priyo naraḥ


🌷 Translation : One who is always free from contaminating association, always silent and satisfied with anything, who doesn’t care for any residence, who is fixed in knowledge and who is engaged in devotional service – such a person is very dear to Me.

🌹 Purport : A devotee is happy in all conditions; sometimes he may get very palatable foodstuffs, sometimes not, but he is satisfied. Nor does he care for any residential facility. He may sometimes live underneath a tree, and he may sometimes live in a very palatial building; he is attracted to neither. He is called fixed because he is fixed in his determination and knowledge.

We may find some repetition in the descriptions of the qualifications of a devotee, but this is just to emphasize the fact that a devotee must acquire all these qualifications. Without good qualifications, one cannot be a pure devotee. one who is not a devotee has no good qualification. One who wants to be recognized as a devotee should develop the good qualifications. Of course he does not extraneously endeavor to acquire these qualifications, but engagement in Kṛṣṇa consciousness and devotional service automatically helps him develop them.

🌹 🌹 🌹 🌹 🌹


16 Aug 2020

శ్రీమద్భగవద్గీత - 487: 12వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 487: Chap. 12, Ver. 18


🌹. శ్రీమద్భగవద్గీత - 487 / Bhagavad-Gita - 487 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -18 🌴

18. సమ: శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో: |
శీతోష్ణసుఖదు:ఖేషు సమ: సఙ్గవివర్జిత: ||


🌷. తాత్పర్యం : శత్రుమిత్రుల యెడ సమభావము కలిగిన వాడును, మానావమానము లందు, శీతోష్ణములందు, సుఖదుఃఖములందు, నిందాస్తుతులందు సమబుద్ధి కలిగినవాడును...

🌷. భాష్యము : భక్తుడు సమస్త దుష్టసంగము నుండి సదా దూరుడై యుండును. ఒకప్పుడు పొగడుట, మరియొకప్పుడు నిందించుట యనునది మానవసంఘపు నైజము. కాని భక్తుడు అట్టి కృత్రిమములైన మానావమానములకు, సుఖదుఃఖములకు సదా అతీతుడై యుండును. అతడు గొప్ప సహనవంతుడై యుండును.

“హరావభక్తస్య కుతో మహద్గుణ: - అనగా భక్తుడు కానివానికి శుభ లక్షణము లుండజాలవు.” కనుక భక్తునిగా గుర్తింప బడగోరువాడు శుభలక్షణములను వృద్ధిపరచుకొనవలెను. కాని వాస్తవమునకు ఈ గుణములను పొందుటకు భక్తుడు బాహ్యముగా యత్నింపనవసరము లేదు. కృష్ణభక్తిభావన యందు మరియు భక్తియుతసేవ యందు నిమగ్నత ఆ గుణములను వృద్ధిచేసికొనుటకు అప్రయత్నముగా అతనికి సహాయభూతమగును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 487 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 18 🌴

18. samaḥ śatrau ca mitre ca tathā mānāpamānayoḥ
śītoṣṇa-sukha-duḥkheṣu samaḥ saṅga-vivarjitaḥ


🌷 Translation : One who is equal to friends and enemies, who is equipoised in honor and dishonor, heat and cold, happiness and distress, fame and infamy...

🌹 Purport : A devotee is always free from all bad association. Sometimes one is praised and sometimes one is defamed; that is the nature of human society. But a devotee is always transcendental to artificial fame and infamy, distress or happiness. He is very patient. He does not speak of anything but the topics about Kṛṣṇa; therefore he is called silent. Silent does not mean that one should not speak; silent means that one should not speak nonsense. One should speak only of essentials, and the most essential speech for the devotee is to speak for the sake of the Supreme Lord.

🌹 🌹 🌹 🌹 🌹


16 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 486: 12వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 486: Chap. 12, Ver. 17


🌹. శ్రీమద్భగవద్గీత - 486 / Bhagavad-Gita - 486 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -17 🌴

17. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ య: స మే ప్రియ: ||


🌷. తాత్పర్యం : ఉప్పొంగుటగాని దుఃఖించుటగాని తెలియనివాడు, శోకించుటగాని వాంచించుట గాని ఎరుగనివాడు, శుభాశుభములు రెండింటిని త్యాగము చేసిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు.

🌷. భాష్యము : శుద్ధభక్తుడు విషయపరములైన లాభనష్టములందు హర్షశోకములను ప్రకటింపడు. పుత్రుని గాని, శిష్యుని గాని పొందవలెననెడి ఆతురతను అతడు కలిగియుండడు. అలాగుననే వారిని పొందనందుకు చింతను సైతము కలిగియుండడు.

తనకు మిగుల ప్రియమైనది కోల్పోయినప్పుడు అతడు శోకింపడు. అదేవిధముగా కోరినది పొందినపుడు అతడు కలతనొందడు. అట్టి భక్తుడు సర్వశుభములకు, అశుభములకు మరియు పాపకార్యములనెడి విషయములకు అతీతుడై యుండును. శ్రీకృష్ణుభగవానుని ప్రీత్యర్థము అన్నిరకముల కష్టములకును అతడు వెనుదీయడు. అతని భక్తినిర్వాహణలో ఏదియును అవరోధమును కాజాలదు. అట్టి భక్తుడు శ్రీకృష్ణుడు అత్యంత ప్రియతముడు.

🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 486 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 17 🌴

17. yo na hṛṣyati na dveṣṭi na śocati na kāṅkṣati
śubhāśubha-parityāgī bhaktimān yaḥ sa me priyaḥ


🌷 Translation : One who neither rejoices nor grieves, who neither laments nor desires, and who renounces both auspicious and inauspicious things – such a devotee is very dear to Me.

🌹 Purport : A pure devotee is neither happy nor distressed over material gain and loss, nor is he very much anxious to get a son or disciple, nor is he distressed by not getting them. If he loses anything which is very dear to him, he does not lament. Similarly, if he does not get what he desires, he is not distressed.

He is transcendental in the face of all kinds of auspicious, inauspicious and sinful activities. He is prepared to accept all kinds of risks for the satisfaction of the Supreme Lord. Nothing is an impediment in the discharge of his devotional service. Such a devotee is very dear to Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


15 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 485: 12వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 485: Chap. 12, Ver. 16


🌹. శ్రీమద్భగవద్గీత - 485 / Bhagavad-Gita - 485 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -16 🌴

16. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ య: |
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో య: స చ మే ప్రియ: ||

🌷. తాత్పర్యం : ఎవ్వరికినీ కష్టమును కలిగించనివాడును, ఎవరిచేతను కలతకు గురికానివాడును, సుఖదుఃఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు.

🌷. భాష్యము : భక్తుని కొన్ని లక్షణములు ఇంకను ఇచ్చట వర్ణింపబడినవి. అట్టి భక్తునిచే ఎవ్వరును కష్టమునకు గాని, వేదనకు గాని, భయమునకు గాని, అసంతుష్టికి గాని గురికారు. భక్తుడు సర్వుల యెడ కరుణను కలిగియుండుటచే ఇతరులకు వేదన, కలత కలుగురీతిలో ఎన్నడును వర్తించడు. అదే సమయమున ఇతరులు తనకు వేదనను కలిగింప యత్నించినను అతడు కలతకు గురికాకుండును. భగవానుని కరుణచే అతడు ఎట్టి బాహ్యక్షోభలచే కలత నొందకుండునట్లుగా అభ్యాసము కావించియుండును.

వాస్తవమునకు భక్తుడు కృష్ణభక్తిరసభావనలో రమించుచు భక్తియుతసేవ యందు నియుక్తుడై యున్నందున భౌతికపరిస్థితులు అతనిని కలతను కలిగింపలేవు. సాధారణముగా భౌతికభావన కలిగిన మనుజుడు తన ఇంద్రియప్రీతికి ఏదేని లభించినచో అత్యంత ఆనందమును పొందును. కాని తన వద్ద లేనివి ఇతరులు తమ ఇంద్రియప్రీత్యర్థము కలిగియున్నచో అతడు దుఃఖమును, అసూయను పొందును. శత్రువు నుండి ఏదేని ఎదురుదాడికి అవకాశమున్నచో భయస్థుడగును మరియు ఏదేని ఒక కార్యమును విజయవంతముగా నిర్వహింపలేకపోయినచో విషణ్ణుడగును. ఇటువంటి కలతలకు మరియు సంక్షోభములకు సదా అతీతుడై యుండెడి భక్తుడు శ్రీకృష్ణునకు మిగుల ప్రియతముడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 485 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 16 🌴

16. anapekṣaḥ śucir dakṣa udāsīno gata-vyathaḥ
sarvārambha-parityāgī yo mad-bhaktaḥ sa me priyaḥ

🌷 Translation : My devotee who is not dependent on the ordinary course of activities, who is pure, expert, without cares, free from all pains, and not striving for some result, is very dear to Me.

🌹 Purport : Money may be offered to a devotee, but he should not struggle to acquire it. If automatically, by the grace of the Supreme, money comes to him, he is not agitated. Naturally a devotee takes a bath at least twice in a day and rises early in the morning for devotional service. Thus he is naturally clean both inwardly and outwardly. A devotee is always expert because he fully knows the essence of all activities of life and he is convinced of the authoritative scriptures. A devotee never takes the part of a particular party; therefore he is carefree.

He is never pained, because he is free from all designations; he knows that his body is a designation, so if there are some bodily pains, he is free. The pure devotee does not endeavor for anything which is against the principles of devotional service. For example, constructing a big building requires great energy, and a devotee does not take to such business if it does not benefit him by advancing his devotional service. He may construct a temple for the Lord, and for that he may take all kinds of anxiety, but he does not construct a big house for his personal relations.

🌹 🌹 🌹 🌹 🌹


14 Aug 2020

శ్రీమద్భగవద్గీత - 484: 12వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 484: Chap. 12, Ver. 15


🌹. శ్రీమద్భగవద్గీత - 484 / Bhagavad-Gita - 484 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -15 🌴

15. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ య: |
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో య: స చ మే ప్రియ: ||

🌷. తాత్పర్యం : ఎవ్వరికినీ కష్టమును కలిగించనివాడును, ఎవరిచేతను కలతకు గురికానివాడును, సుఖదుఃఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు.

🌷. భాష్యము : భక్తుని కొన్ని లక్షణములు ఇంకను ఇచ్చట వర్ణింపబడినవి. అట్టి భక్తునిచే ఎవ్వరును కష్టమునకు గాని, వేదనకు గాని, భయమునకు గాని, అసంతుష్టికి గాని గురికారు. భక్తుడు సర్వుల యెడ కరుణను కలిగియుండుటచే ఇతరులకు వేదన, కలత కలుగురీతిలో ఎన్నడును వర్తించడు. అదే సమయమున ఇతరులు తనకు వేదనను కలిగింప యత్నించినను అతడు కలతకు గురికాకుండును. భగవానుని కరుణచే అతడు ఎట్టి బాహ్యక్షోభలచే కలత నొందకుండునట్లుగా అభ్యాసము కావించి యుండును.

వాస్తవమునకు భక్తుడు కృష్ణభక్తిరసభావనలో రమించుచు భక్తియుతసేవ యందు నియుక్తుడై యున్నందున భౌతికపరిస్థితులు అతనిని కలతను కలిగింపలేవు. సాధారణముగా భౌతికభావన కలిగిన మనుజుడు తన ఇంద్రియప్రీతికి ఏదేని లభించినచో అత్యంత ఆనందమును పొందును. కాని తన వద్ద లేనివి ఇతరులు తమ ఇంద్రియప్రీత్యర్థము కలిగియున్నచో అతడు దుఃఖమును, అసూయను పొందును. శత్రువు నుండి ఏదేని ఎదురుదాడికి అవకాశమున్నచో భయస్థుడగును మరియు ఏదేని ఒక కార్యమును విజయవంతముగా నిర్వహింపలేకపోయినచో విషణ్ణుడగును. ఇటువంటి కలతలకు మరియు సంక్షోభములకు సదా అతీతుడై యుండెడి భక్తుడు శ్రీకృష్ణునకు మిగుల ప్రియతముడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 484 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 15 🌴

15. yasmān nodvijate loko lokān nodvijate ca yaḥ
harṣāmarṣa-bhayodvegair mukto yaḥ sa ca me priyaḥ

🌷 Translation : He by whom no one is put into difficulty and who is not disturbed by anyone, who is equipoised in happiness and distress, fear and anxiety, is very dear to Me.

🌹 Purport : A few of a devotee’s qualifications are further being described. No one is put into difficulty, anxiety, fearfulness or dissatisfaction by such a devotee. Since a devotee is kind to everyone, he does not act in such a way as to put others into anxiety. At the same time, if others try to put a devotee into anxiety, he is not disturbed. It is by the grace of the Lord that he is so practiced that he is not disturbed by any outward disturbance. Actually because a devotee is always engrossed in Kṛṣṇa consciousness and engaged in devotional service, such material circumstances cannot move him.

Generally a materialistic person becomes very happy when there is something for his sense gratification and his body, but when he sees that others have something for their sense gratification and he hasn’t, he is sorry and envious. When he is expecting some retaliation from an enemy, he is in a state of fear, and when he cannot successfully execute something he becomes dejected. A devotee who is always transcendental to all these disturbances is very dear to Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹

13 Aug 2020


శ్రీమద్భగవద్గీత - 483: 12వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 483: Chap. 12, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 483 / Bhagavad-Gita - 483 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము - 14 🌴

14. సంతుష్ట: సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయ: |
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్త: స మే ప్రియ: ||


🌷. తాత్పర్యం : సదా సంతుష్టుడైన వాడును, ఆత్మనిగ్రహము కలవాడును, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢనిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు.

🌷. భాష్యము : భక్తుడు ప్రతి ఒక్కరి పట్ల, తన శత్రువు పట్ల కూడా ఎల్లప్పుడూ దయతో ఉంటాడు. నిర్మమ అంటే ఒక భక్తుడు శరీరానికి సంబంధించిన బాధలు మరియు ఇబ్బందులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడు, ఎందుకంటే అతను భౌతిక శరీరం కాదని అతనికి బాగా తెలుసు. అతను శరీరంతో గుర్తించడు; అందువల్ల అతడు తప్పుడు అహంకార భావన నుండి విముక్తుడయ్యాడు మరియు ఆనందం మరియు దుఃఖంలో సమృద్ధిగా ఉంటాడు. అతడు సహనశీలి, పరమేశ్వరుని కృపతో ఏది వచ్చినా తృప్తి చెందుతాడు. అతను చాలా కష్టపడి ఏదైనా సాధించడానికి పెద్దగా ప్రయత్నించడు; అందువలన అతను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు.

అతను ఆధ్యాత్మిక గురువు నుండి స్వీకరించబడిన సూచనలలో స్థిరంగా ఉన్నందున మరియు అతని ఇంద్రియాలు నియంత్రించ బడినందున అతను పూర్తిగా పరిపూర్ణ ఆధ్యాత్మికవేత్త. అతను తప్పుడు వాదనల ద్వారా వణికిపోడు, ఎందుకంటే భక్తి సేవ యొక్క స్థిరమైన సంకల్పం నుండి అతన్ని ఎవరూ నడిపించలేరు. కృష్ణుడు శాశ్వతమైన భగవంతుడని అతనికి పూర్తిగా స్పృహ ఉంది, కాబట్టి ఎవరూ అతనిని భంగపరచలేరు. ఈ అన్ని అర్హతలు అతని మనస్సు మరియు తెలివిని పూర్తిగా భగవంతునిపై స్థిరపరచగలవు. భక్తి సేవ యొక్క అటువంటి ప్రమాణం నిస్సందేహంగా చాలా అరుదు, కానీ భక్తి సేవ యొక్క నియంత్రణ సూత్రాలను అనుసరించడం ద్వారా భక్తుడు ఆ దశలో స్థాణువు అవుతాడు. ఇంకా, భగవంతుడు అటువంటి భక్తుడు తనకు చాలా ప్రియమైన వాడని చెప్పాడు, ఎందుకంటే భగవంతుడు తన కార్యకలాపాలన్నిటితో సంపూర్ణ కృష్ణ చైతన్యంతో ఎల్లప్పుడూ సంతోషిస్తాడు.

🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 483 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 14 🌴

14. santuṣṭaḥ satataṁ yogī yatātmā dṛḍha-niścayaḥ
mayy arpita-mano-buddhir yo mad-bhaktaḥ sa me priyaḥ

🌷 Translation : Who is always satisfied, self-controlled, and engaged in devotional service with determination, his mind and intelligence fixed on Me – such a devotee of Mine is very dear to Me.

🌹 Purport : A devotee is also always kind to everyone, even to his enemy. Nirmama means that a devotee does not attach much importance to the pains and trouble pertaining to the body because he knows perfectly well that he is not the material body. He does not identify with the body; therefore he is freed from the conception of false ego and is equipoised in happiness and distress. He is tolerant, and he is satisfied with whatever comes by the grace of the Supreme Lord. He does not endeavor much to achieve something with great difficulty; therefore he is always joyful. He is a completely perfect mystic because he is fixed in the instructions received from the spiritual master, and because his senses are controlled he is determined.

He is not swayed by false arguments, because no one can lead him from the fixed determination of devotional service. He is fully conscious that Kṛṣṇa is the eternal Lord, so no one can disturb him. All these qualifications enable him to fix his mind and intelligence entirely on the Supreme Lord. Such a standard of devotional service is undoubtedly very rare, but a devotee becomes situated in that stage by following the regulative principles of devotional service. Furthermore, the Lord says that such a devotee is very dear to Him, for the Lord is always pleased with all his activities in full Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


12 Aug 2020

శ్రీమద్భగవద్గీత - 482: 12వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 482: Chap. 12, Ver. 13


🌹. శ్రీమద్భగవద్గీత - 482 / Bhagavad-Gita - 482 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము - భక్తియోగము -13 🌴

13. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర: కరుణ ఏవ చ |
నిర్మమో నిరహంకార: సమదుఃఖసుఖ: క్షమీ ||


🌷. తాత్పర్యం : ద్వేషమనునది లేకుండ సర్వజీవుల యెడ మైత్రిని కలిగినవాడును, మమత్వము లేనివాడును, మిథ్యాహంకార రహితుడును, సుఖదుఃఖములు రెండింటి యందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడును,

🌷. భాష్యము : విశుద్ధ భక్తియుత విషయమునకే మరల అరుదెంచి శ్రీకృష్ణభగవానుడు శుద్దభక్తుని దివ్యలక్షణములను ఈ రెండు శ్లోకములందు వివరించుచున్నాడు. శుద్ధభక్తుడు ఎటువంటి పరిస్థితి యందును ఎన్నడు కలతనొందడు. అతడు ఎవ్వరిని ద్వేషింపడు. అలాగుననే శత్రువుకు శత్రువు కావలెననియు అతడు తలపడు. పైగా అతడు “నా పూర్వపాపకర్మల కారణముగా ఇతడు నా యెడ శత్రువుగా వర్తించుచున్నాడు. కావున ఎదిరించుట కన్నను అనుభవించుటయే మేలు” అని తలపోయును.

ఈ విషయమే “తత్తే(నుకంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకం” అను శ్లోకము ద్వారా శ్రీమద్భాగవతమున (10.14.8) తెలుపబడినది. అనగా భక్తుడు కలతకు గురియైనప్పుడు లేదా కష్టము సంప్రాప్తించి నప్పుడు దానిని తనపై భగవానుడు చూపు కరుణగా భావించును. “నా పూర్వపాపము వలన ఇప్పుడు అనుభవించు కష్టము కన్నను అత్యంత దుర్భరమైన కష్టమును నేను అనుభవించ వలసి యున్నది. కాని ఆ భగవానుని కరుణ చేతనే నేను పొందవలసిన శిక్షనంతటిని పొందక, ఆ శిక్షలో కొద్దిభాగమును మాత్రమే నేను పొందుచున్నాను” అని ఆ భక్తుడు తలపోయును. కనుకనే పలు కష్టపరిస్థితుల యందైనను భక్తుడు సదా శాంతుడును, కలతనొందనివాడును, ఓర్పు కలిగినవాడును అయి యుండును. అట్టి భక్తుడు తన శత్రువుతో సహా ప్రతివారి యెడను సదా కరుణను కలిగియుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 482 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 13 🌴

13. adveṣṭā sarva-bhūtānāṁ maitraḥ karuṇa eva ca
nirmamo nirahaṅkāraḥ sama-duḥkha-sukhaḥ kṣamī


🌷 Translation : One who is not envious but is a kind friend to all living entities, who does not think himself a proprietor and is free from false ego, who is equal in both happiness and distress, who is tolerant,

🌹 Purport : Coming again to the point of pure devotional service, the Lord is describing the transcendental qualifications of a pure devotee in these two verses. A pure devotee is never disturbed in any circumstances. Nor is he envious of anyone. Nor does a devotee become his enemy’s enemy; he thinks, “This person is acting as my enemy due to my own past misdeeds. So it is better to suffer than to protest.”

In the Śrīmad-Bhāgavatam (10.14.8) it is stated: tat te ’nukampāṁ su-samīkṣamāṇo bhuñjāna evātma-kṛtaṁ vipākam. Whenever a devotee is in distress or has fallen into difficulty, he thinks that it is the Lord’s mercy upon him. He thinks, “Thanks to my past misdeeds I should suffer far, far greater than I am suffering now. So it is by the mercy of the Supreme Lord that I am not getting all the punishment I am due. I am just getting a little, by the mercy of the Supreme Personality of Godhead.” Therefore he is always calm, quiet and patient, despite many distressful conditions.

🌹 🌹 🌹 🌹 🌹


12 Aug 2020