శ్రీమద్భగవద్గీత - 284: 07వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 284: Chap. 07, Ver. 04


🌹. శ్రీమద్భగవద్గీత - 284 / Bhagavad-Gita - 284 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 04 🌴

04. భూమిరాపోనలో వాయు; ఖం మనో బుద్ధిరేవ చ |
అహజ్కార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా


🌷. తాత్పర్యం :

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను ఎనిమిది అంశముల సముదాయము నా భిన్నప్రకృతి యనబడును.

🌷. భాష్యము :

భగవత్తత్త్వవిజ్ఞానము భగవానుని దివ్యమగు స్థితిని మరియు అతని విభిన్నశక్తులను విశ్లేషించి చర్చించును. సాత్వతంత్ర్యములో వివరింపబడినట్లు ఆ భగవానుని వివిధ పురుషావతారముల యందలి శక్తిచే ప్రకృతి యని పేరు.

విష్ణోస్తు త్రీణి రూపాణి పురుషాఖ్యాన్యథో విదు: |
ఏకం తు మహత: స్రష్టృ ద్వితీయం త్వండ సంస్థితం |
తృతీయం సర్వభూతస్థం తాని జ్ఞాత్వా విముచ్యతే

“భౌతికజగత్తు సృష్టికై శ్రీకృష్ణభగవానుడు సంపూర్ణస్వాంశ మూడు విష్ణురూపములను దాల్చును. అందులో మొదటి విష్ణురూపమైన మాహావిష్ణువు మహతత్త్వమని తెలియబడును భౌతికశక్తిని సృష్టించును. రెండవ విష్ణురూపమైన గర్భోదకశాయివిష్ణువు వివధవ్యక్తీకరణలకై అన్ని విశ్వములందును ప్రవేశించును. ఇక మూడవ విష్ణురూపమైన క్షీరోదకశాయివిష్ణువు సకల విశ్వములందు పరమాత్మ రూపున వ్యాపించి పరమాత్మగా పిలువబడు అణువణువు నందును నిలిచియుండును. ఈ ముగ్గురు విష్ణువుల గూర్చి తెలిసినవాడు భవబంధము నుండి ముక్తిని పొందగలడు.”

ఈ శ్లోకమున తెలుపబడినట్లు భౌతికశక్తి యందు ముఖ్యముగా ఎనిమిది అంశములు కలవు. వీనిలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము లనునవి మహత్తర సృష్టి లేదా స్థూలసృష్టిగా పిలువబడును. వీనియందే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధమను ఐదు ఇంద్రియార్థములు ఇమిడియున్నవి. భౌతిక విజ్ఞానశాస్త్రము కేవలము ఈ పదివిషయములనే చర్చించును. కాని అన్యమును కాదు. కాని మనస్సు, బుద్ధి, అహంకారమను మిగతా మూడువిషయములు భౌతికవాదులచే ఉపేక్షింపబడును.

మనోకర్మలతో తాదాత్మ్యము చెందియుండు తత్త్వవేత్తలు కూడా సర్వమునకు మూలకారణము శ్రీకృష్ణుడని ఎరుగలేనందున జ్ఞానమునందు అసంపూర్ణులైయున్నారు. “నేను నాది” యను అహంకారభావనమే భౌతికస్థితి మూలకారణమై యున్నది. అట్టి అహంకారము భౌతికకర్మలకు ఉపయోగపడు దశేంద్రియములను కూడియుండును. బుద్ధి యనునది మహతత్త్వమని పిలువబడు పూర్ణ భౌతికసృష్టి సంబంధించినది. అనగా శ్రీకృష్ణభగవానుని ఈ ఎనిమిది భిన్నశక్తుల నుండి భౌతికజగత్తు యొక్క ఇరువదినాలుగు అంశములు వ్యక్తమగుచున్నవి. ఈ ఇరువదినాలుగు అంశములు విషయమే నాస్తిక సాంఖ్యవాదపు చర్చనీయాంశమై యున్నది.

వాస్తవమునకు అవియన్నియును శ్రీకృష్ణుని శక్తి నుండియే ఉద్భవించి, అతని నుండి విడివడియున్నవి. కాని అల్పజ్ఞులైన సాంఖ్యతత్త్వవేత్తలు అట్టి శ్రీకృష్ణుని సర్వకారణకారణునిగా ఎరుగలేరు. గీతయందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుని బాహ్యశక్తి స్వరూపమే సాంఖ్యతత్త్వమునందు చర్చనియాంశమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 284 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 04 🌴

04. bhūmir āpo ’nalo vāyuḥ khaṁ mano buddhir eva ca
ahaṅkāra itīyaṁ me bhinnā prakṛtir aṣṭadhā


🌷 Translation :

Earth, water, fire, air, ether, mind, intelligence and false ego – all together these eight constitute My separated material energies.

🌹 Purport :

The science of God analyzes the constitutional position of God and His diverse energies. Material nature is called prakṛti, or the energy of the Lord in His different puruṣa incarnations (expansions) as described in the Nārada Pañcarātra, one of the Sātvata-tantras:

viṣṇos tu trīṇi rūpāṇi
puruṣākhyāny atho viduḥ
ekaṁ tu mahataḥ sraṣṭṛ
dvitīyaṁ tv aṇḍa-saṁsthitam
tṛtīyaṁ sarva-bhūta-sthaṁ
tāni jñātvā vimucyate

“For material creation, Lord Kṛṣṇa’s plenary expansion assumes three Viṣṇus. The first one, Mahā-viṣṇu, creates the total material energy, known as the mahat-tattva. The second, Garbhodaka-śāyī Viṣṇu, enters into all the universes to create diversities in each of them. The third, Kṣīrodaka-śāyī Viṣṇu, is diffused as the all-pervading Supersoul in all the universes and is known as Paramātmā. He is present even within the atoms. Anyone who knows these three Viṣṇus can be liberated from material entanglement.”

🌷 🌷 🌷 🌷 🌷

31 Jan 2020