శ్రీమద్భగవద్గీత - 262: 06వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 262: Chap. 06, Ver. 29


🌹. శ్రీమద్భగవద్గీత - 262 / Bhagavad-Gita - 262 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 29 🌴

29. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన: ||


🌷. తాత్పర్యం :

నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నా యందును గాంచును. ఆత్మదర్శియైన అట్టివాడు దేవదేవుడైన నన్నే నిక్కముగా సర్వత్రా గాంచును.

🌷. భాష్యము :

సర్వుల హృదయములలో పరమాత్మ రూపున స్థితుడై యున్న శ్రీకృష్ణభగవానుని గాంచగలిగినందున కృష్ణభక్తిరసభావితుడైన యోగి నిజమైన ద్రష్ట యనబడును. “ఈశ్వర: సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి”. శ్రీకృష్ణభగవానుడు పరమాత్మ రూపములో శునక హృదయము నందును మరియు బ్రహ్మణుని హృదయమునందును నిలిచి యుండును. ఆ భగవానుడు నిత్యముగా భౌతికముగా ప్రభావితుడు కాడనియు పూర్ణయోగి ఎరిగి యుండును. ఆ విధముగా భౌతికత్వముచే ప్రభావితము కాకుండుటయే భగవానుని దివ్యమైన తటస్థ స్వభావమై యున్నది. పరమాత్మతో పాటు జీవాత్మయు హృదయమందు నిలిచియున్న పరమాత్మ వలె అది ఎల్లరి హృదయములలో నిలిచియుండలేదు.

ఇదియే జీవాత్మ మరియు పరమాటం నడుమ గల భేదము. నిజమైన యోగాభ్యాసము నందు నియుక్తుడు కానివాడు ఈ విషయమున స్పష్టముగా గాంచలేదు. బాహ్యమునను జీవులు సదా భగవానుని శక్తి యందే నిలిచి యుందురు. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు ఆధ్యాత్మికశక్తి (ఉత్తమము), భౌతికశక్తి (అల్పము) యను రెండు శక్తులను శ్రీకృష్ణభగవానుడు ప్రధానముగా కలిగియుండును. జీవుడు ఉత్తమశక్తి అంశయైన అల్పమైన భౌతికశక్తిచే బద్ధుడై యుండును. ఈ విధముగా అతడు సర్వదా భగవానుని శక్తి యందున్నట్టివాడే. అనగా జీవుడు భగవానుని యందే ఏదో ఒక విధముగా స్థితిని కలిగియున్నట్టివాడే యగుచున్నాడు.

జీవులు తమ కర్మఫలముల ననుసరించి వివిధస్థితుల యందున్నప్పటికిని ఆన్ని పరిస్థితుల యందును వారు శ్రీకృష్ణభగవానుని దాసులే యని గాంచగలిగినందున యోగి సమదర్శియై యుండును. భౌతికశక్తి యందు నిలిచినపుడు జీవుడు ఇంద్రియములను సేవించును. కాని అదే జీవుడు ఆధ్యాత్మికశక్తి యందు నిలిచినప్పుడు మాత్రము ప్రత్యక్షముగా భగవానుని సేవించును. ఈ విధముగా రెండు పరిస్థితుల యందును అతడు భగవానుని దాసుడే. ఇట్టి సమత్వ వీక్షణము కృష్ణభక్తిభావనాపూర్ణుడైన వ్యక్తి యందు పూర్ణముగా నుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 262 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 29 🌴

29. sarva-bhūta-stham ātmānaṁ sarva-bhūtāni cātmani
īkṣate yoga-yuktātmā sarvatra sama-darśanaḥ


🌷 Translation :

A true yogī observes Me in all beings and also sees every being in Me. Indeed, the self-realized person sees Me, the same Supreme Lord, everywhere.

🌹 Purport :

A Kṛṣṇa conscious yogī is the perfect seer because he sees Kṛṣṇa, the Supreme, situated in everyone’s heart as Supersoul (Paramātmā). Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe ’rjuna tiṣṭhati. The Lord in His Paramātmā feature is situated within both the heart of the dog and that of a brāhmaṇa. The perfect yogī knows that the Lord is eternally transcendental and is not materially affected by His presence in either a dog or a brāhmaṇa. That is the supreme neutrality of the Lord. The individual soul is also situated in the individual heart, but he is not present in all hearts.

That is the distinction between the individual soul and the Supersoul. Outwardly, also, every living being is situated in the energy of the Lord. As will be explained in the Seventh Chapter, the Lord has, primarily, two energies – the spiritual (or superior) and the material (or inferior). The living entity, although part of the superior energy, is conditioned by the inferior energy; the living entity is always in the Lord’s energy. Every living entity is situated in Him in one way or another.

The yogī sees equally because he sees that all living entities, although in different situations according to the results of fruitive work, in all circumstances remain the servants of God. While in the material energy, the living entity serves the material senses; and while in the spiritual energy, he serves the Supreme Lord directly. In either case the living entity is the servant of God. This vision of equality is perfect in a person in Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹

9 Jan 2020