శ్రీమద్భగవద్గీత - 269: 06వ అధ్., శ్లో 36 / Bhagavad-Gita - 269: Chap. 06, Ver. 36


🌹. శ్రీమద్భగవద్గీత - 269 / Bhagavad-Gita - 269 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 36 🌴

36. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి: |
వశ్యాత్మనా తు యతతా శక్యో(వాప్తుముపాయత: ||


🌷. తాత్పర్యం :

మనస్సు నిగ్రహింపబడినవానికి ఆత్మానుభవము అతికష్టకార్యము. కాని మనోనిగ్రహము కలిగి, తగిన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయము తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయము.

🌷. భాష్యము :

విషయకర్మల నుండు మనస్సును దూరము చేయుటకు తగిన చికిత్సను పొందనివాడు ఆత్మానుభవము నందు విజయమును సాధింపలేడని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట పకటించుచున్నాడు.

భౌతికానందమున మనస్సును నిమగ్నముచేసి యోగాభ్యాసమునకు యత్నించుట యనునది ఒకవైపు అగ్ని యందు నీరు పోయుచునే దానిని జ్వలింపజేయు యత్నము వంటిది. మనోనిగ్రహము లేనటువంటి యోగాభ్యాసము కేవలము కాలమును వ్యర్థము చేయుటయే కాగలదు.

అట్టి యోగ ప్రదర్శనము బాహ్యమునకు ఆకర్షణీయముగా తోచినను ఆత్మానుభవమునకు సంబంధించినంతవరకు మాత్రము అది నిరుపయోగమై యున్నది.

కనుక ప్రతియొక్కరు మనస్సును సదా దివ్యమగు ప్రేమయుతసేవ యందు లగ్నము చేయుట ద్వారా నియమించవలెను. మనుజుడు కృష్ణభక్తిభావన యందు నిలువనిదే తన మనస్సును నియమింపజాలడు.

అనగా కృష్ణభక్తిరసభావితుడు యోగాభ్యాసపు ఫలమును ప్రత్యేకమైన శ్రమ వేరేదియును లేకనే సులభముగా పొందగలడు. కాని కేవల యోగాభ్యాసపరుడు కృష్ణభక్తిరసభావితుడు కానిదే జయమును సాధింపలేడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 269 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 36 🌴

36. asaṁyatātmanā yogo duṣprāpa iti me matiḥ
vaśyātmanā tu yatatā śakyo ’vāptum upāyataḥ

🌷 Translation :

For one whose mind is unbridled, self-realization is difficult work. But he whose mind is controlled and who strives by appropriate means is assured of success. That is My opinion.

🌹 Purport :

The Supreme Personality of Godhead declares that one who does not accept the proper treatment to detach the mind from material engagement can hardly achieve success in self-realization.

Trying to practice yoga while engaging the mind in material enjoyment is like trying to ignite a fire while pouring water on it.

Yoga practice without mental control is a waste of time. Such a show of yoga may be materially lucrative, but it is useless as far as spiritual realization is concerned.

Therefore, one must control the mind by engaging it constantly in the transcendental loving service of the Lord. Unless one is engaged in Kṛṣṇa consciousness, he cannot steadily control the mind.

A Kṛṣṇa conscious person easily achieves the result of yoga practice without separate endeavor, but a yoga practitioner cannot achieve success without becoming Kṛṣṇa conscious.

🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2020