🌹. శ్రీమద్భగవద్గీత - 270 / Bhagavad-Gita - 270 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 37 🌴
37. అర్జున ఉవాచ
అయతి: శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానస: |
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను : ఓ కృష్ణా! తొలుత ఆత్మానుభవ విధానము శ్రద్ధతో అనుసరించి, పిదప లౌకికభావన కారణముగా దానిని త్యజించి, యోగమునందు పూర్ణత్వమును పొందలేని విఫలయోగి గమ్యమెట్టిది?
🌷. భాష్యము :
ఆత్మానుభావము (యోగము) పొందు మార్గము భగవద్గీత యందు వివరింపబడినది. జీవుడు వాస్తవమునాకు పాంచభౌతికదేహము గాక దానికి అతీతుడైన వాడనియు మరియు సత్, చిత్, ఆనందమందే అతనికి నిజమైన ఆనందము కలదనియు తెలిపెడి జ్ఞానము ఆత్మానుభావము యొక్క మూలసిద్ధాంతమై యున్నది. ఇట్టి నిత్యజీవనము, జ్ఞానము మరియు ఆనందములనునవి(సత్, చిత్, ఆనందము) దేహము, మనస్సులకు అతీతమైన దివ్యలక్షణములు. ఇట్టి ఆత్మానుభవము జ్ఞానమార్గము ద్వారా, అష్టాంగయోగ మార్గము ద్వారా లేక భక్తిమార్గము ద్వారా పొందుటకు సాధ్యమగును. ఈ మార్గములన్నింటి యందును జీవుడు తన నిజస్థితిని, తనకు భగవానునితో గల సంబంధమును మరియు తనకు భగవానునితో గల సంబంధమును పున:స్థాపించి కృష్ణభక్తిభావన యందలి అత్యున్నత పూర్ణత్వస్థితిని బడయుటకు వలసిన కర్మలను ఎరుగవలసియున్నది. ఈ మూడుమార్గములలో దేనిని చేపట్టినను శీఘ్రముగనో లేక ఆలస్యముగనో తప్పక మనుజుడు దివ్యగమ్యమును చేరగలడు.
ఆధ్యాత్మిక మార్గమున కొద్ది యత్నమైనను ముక్తికి గొప్పగా దోహదము కాగలదని పలుకుచు శ్రీకృష్ణభగవానుడు ద్వితీయాధ్యాయమున ఈ విషయమును నిర్ధారించియున్నాడు. ఈ మూడుమార్గములలో భక్తియోగమార్గము భగవదనుభూతిని బడయుటకు ప్రత్యక్షమార్గమై యున్నందున ఈ యుగమునకు మిక్కిలి అనువైనదియై యున్నది. భగవానుడు గతమునందు తెలిపియున్న వచనమును తిరిగి నిర్దారించుకొనుట కొరకే అర్జునుడిచ్చట ఈ విధముగా ప్రశ్నించుచున్నాడు. మనుజుడు ఆత్మానుభవమార్గమును శ్రద్ధతో స్వీకరించినను జ్ఞానయోగవిధానము మరియు అష్టాంగయోగపద్ధతి ఈ కాలమున మిగుల కష్టతరవిధానములై యున్నవి. కనుకనే ఈ మార్గములందు పలుయత్నములు కావించినను బహుకారణముల చేత మనుజుడు విఫలత్వమునే బడయవచ్చును. మొట్టమొదటి విషయమేమన ఈ విధానము ననుసరించుట యందు మనుజుడు అత్యంత శ్రద్ధ యుండదు.
అంతియేగాక ఆధ్యాత్మికమార్గమును చేపట్టుట యనగా దాదాపు మాయపై యుద్ధము ప్రకటించు వంటిది. కనుక ఎవ్వరైనను అట్లు యత్నించుగనే మాయ వివిధములైన ఆకర్షణలచే సాధకుని జయింప యత్నించుచుండును. వాస్తవమునకు బద్ధజీవుడు మయాగుణములచే ప్రభావితుడైనట్టివాడే గనుక ఆధ్యాత్మిక కలాపములందున్న తిరిగి ఆ గుణములచే మోహింపబడుటకు అవకాశము కలదు. ఇదియే ఆధ్యాత్మికమార్గము నుండి పతనము నొందుట యనబడును. యోగాచ్చలిత మానస: . ఆ విధముగా ఆత్మానుభవమార్గము నుండి వైదొలగుట వలన కలిగెడి ఫలితములను తెలిసికొనుట అర్జునుడు కుతూహలపడుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 270 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 37 🌴
37. arjuna uvāca
ayatiḥ śraddhayopeto yogāc calita-mānasaḥ
aprāpya yoga-saṁsiddhiṁ kāṁ gatiṁ kṛṣṇa gacchati
🌷 Translation :
Arjuna said: O Kṛṣṇa, what is the destination of the unsuccessful transcendentalist, who in the beginning takes to the process of self-realization with faith but who later desists due to worldly-mindedness and thus does not attain perfection in mysticism?
🌹 Purport :
The path of self-realization or mysticism is described in the Bhagavad-gītā. The basic principle of self-realization is knowledge that the living entity is not this material body but that he is different from it and that his happiness is in eternal life, bliss and knowledge. These are transcendental, beyond both body and mind. Self-realization is sought by the path of knowledge, by the practice of the eightfold system or by bhakti-yoga.
In each of these processes one has to realize the constitutional position of the living entity, his relationship with God, and the activities whereby he can reestablish the lost link and achieve the highest perfectional stage of Kṛṣṇa consciousness. Following any of the above-mentioned three methods, one is sure to reach the supreme goal sooner or later. This was asserted by the Lord in the Second Chapter: even a little endeavor on the transcendental path offers a great hope for deliverance. Out of these three methods, the path of bhakti-yoga is especially suitable for this age because it is the most direct method of God realization.
🌹 🌹🌹 🌹 🌹 🌹
17 Jan 2020