శ్రీమద్భగవద్గీత - 268: 06వ అధ్., శ్లో 35 / Bhagavad-Gita - 268: Chap. 06, Ver. 35


🌹. శ్రీమద్భగవద్గీత - 268 / Bhagavad-Gita - 268 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 35 🌴

35. శ్రీ భగవానువాచ

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే ||


🌷. తాత్పర్యం :

శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ గొప్పభుజములు కలిగిన కుంతీపుత్రా! చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిగులకష్టతరమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును.

🌷. భాష్యము :

దృఢమైన మనస్సును నిగ్రహించుట యందలి కష్టమును గూర్చి అర్జునుడు పలికినదానిని శ్రీకృష్ణభగవానుడు అంగీకరించెను. కాని అట్టి కార్యము అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధ్యమగునని అదే సమయమున అతడు ఉపదేశించుచున్నాడు. అట్టి అభ్యాసమంగా నేమి? తీర్థస్థలమున కేగుట, మనస్సును పరమాత్మ యందు సంలగ్నము చేయుట, ఇంద్రియ మనస్సులను నిరోధించుట బ్రహ్మచర్యము పాటించుట, ఏకాంతముగా వసించుట వంటి కటిన నియమనిబంధనలను ఈ కాలమున ఎవ్వరును పాటించలేరు. కాని కృష్ణభక్తిభావన ద్వారా మనుజుడు నవవిధములైన భక్తిమార్గములందు పాల్గొనగలడు. అట్టి భక్తికార్యములలో ప్రప్రథమమైనది శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణము. అది మనస్సును అన్నివిధములైన అపోహల నుండి ముక్తినొందించు దివ్యవిధానము. శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణము అధికాధికముగా జరిగిన కొలది మనుడు అధికముగా జ్ఞానవంతుడై, కృష్ణుని నుండి మనస్సును దూరము చేయు సమస్తవిషయములందును వైరాగ్యమును పొందును.

కృష్ణపరములు కానటువంటి కార్యములు నుండి మనస్సును నిగ్రహించుట ద్వారా మనుజుడు వైరాగ్యమును సులభముగా నేర్వగలడు. భౌతికత్వము నుండి విడివడి, ఆధ్యాత్మికత యందే మనస్సు లగ్నమగుట యనెడి కార్యము వైరాగ్యమనబడును. వాస్తవమునకు నిరాకారతత్త్వములో వైరాగ్యమును పొందుట యనునది మనస్సును కృష్ణపరకర్మల యందు నియుక్తము చేయుట కన్నను మిక్కిలి కష్టమైనది. కనుకనే కృష్ణభక్తి ఆచరణీయమైన పద్ధతియై యున్నది. ఏలయన కృష్ణుని గూర్చి శ్రవణము చేయుట ద్వారా మనుజుడు అప్రయత్నముగా పరతత్త్వమునందు అనురక్తుడగును. అట్టి పరతత్త్వానురాగమే “పరేశానుభవము” (ఆధ్యాత్మికసంతృప్తి) అనబడును. ఆకలిగొన్నవాడు తాను తిను ప్రతిముద్ద యందు తృప్తిని పొందుటతో ఈ ఆధ్యాత్మిక సంతృప్తిని పోల్చవచ్చును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 268 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 35 🌴

35. śrī-bhagavān uvāca

asaṁśayaṁ mahā-bāho mano durnigrahaṁ calam
abhyāsena tu kaunteya vairāgyeṇa ca gṛhyate

🌷 Translation :

Lord Śrī Kṛṣṇa said: O mighty-armed son of Kuntī, it is undoubtedly very difficult to curb the restless mind, but it is possible by suitable practice and by detachment.

🌹 Purport :

The difficulty of controlling the obstinate mind, as expressed by Arjuna, is accepted by the Personality of Godhead. But at the same time He suggests that by practice and detachment it is possible. What is that practice? In the present age no one can observe the strict rules and regulations of placing oneself in a sacred place, focusing the mind on the Supersoul, restraining the senses and mind, observing celibacy, remaining alone, etc. By the practice of Kṛṣṇa consciousness, however, one engages in nine types of devotional service to the Lord. The first and foremost of such devotional engagements is hearing about Kṛṣṇa.

This is a very powerful transcendental method for purging the mind of all misgivings. The more one hears about Kṛṣṇa, the more one becomes enlightened and detached from everything that draws the mind away from Kṛṣṇa. By detaching the mind from activities not devoted to the Lord, one can very easily learn vairāgya. Vairāgya means detachment from matter and engagement of the mind in spirit. Impersonal spiritual detachment is more difficult than attaching the mind to the activities of Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹

15 Jan 2020