శ్రీమద్భగవద్గీత - 259: 06వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 259: Chap. 06, Ver. 26


🌹. శ్రీమద్భగవద్గీత - 259 / Bhagavad-Gita - 259 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 26 🌴

26. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరమ్ |
తతస్తతో నియమ్యైతదాత్యన్యేవ వశం నయేత్ ||


🌷. తాత్పర్యం :

చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మనుజుడు దానిని అచ్చట నుండి తప్పక నిగ్రహించి ఆత్మ వశమునకు గొనిరావలెను.

🌷. భాష్యము :

చంచలత్వము, అస్థిరత్వమనునవి మనస్సు యొక్క స్వభావములు. కాని ఆత్మదర్శియైన యోగి అట్టి మనస్సును నియమింపవలెను. దానిచే అతడెన్నడును నియమింపబడరాదు. మనస్సును నియమించినవాడు (తద్ద్వారా ఇంద్రియములను నియమించినవాడు) గోస్వామి లేదా స్వామి యనబడును. అట్లుగాక మనస్సు చేతనే నియమింప బడెడివాడు గోదాసుడు లేదా ఇంద్రియదాసుడని పిలువబడును.

ఇంద్రియముల వలన కలిగే ఆనందపు పరిమాణమును గోస్వామి ఎరిగియుండును. కనుకనే దివ్యానంద భావనలో అతని ఇంద్రియములు హృషీకేశుని (ఇంద్రియాధినేతయైన శ్రీకృష్ణుడు) సేవ యందు నియుక్తమై యుండును. ఆ విధముగా పవిత్రములైన ఇంద్రియములతో కృష్ణుని సేవించుటయే కృష్ణభక్తిరసభావనమనబడును.

ఇంద్రియములను అదుపులోనికి తెచ్చుటకు ఇదియే ఉత్తమమార్గము. యోగాభ్యాసపు అత్యున్నత పూర్ణత్వమైన దీనికి మించినది వేరొక్కటి లేదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 259 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 26 🌴

26. yato yato niścalati manaś cañcalam asthiram
tatas tato niyamyaitad ātmany eva vaśaṁ nayet


🌷 Translation :

From wherever the mind wanders due to its flickering and unsteady nature, one must certainly withdraw it and bring it back under the control of the Self.

🌹 Purport :

The nature of the mind is flickering and unsteady. But a self-realized yogī has to control the mind; the mind should not control him. One who controls the mind (and therefore the senses as well) is called gosvāmī, or svāmī, and one who is controlled by the mind is called go-dāsa, or the servant of the senses. A gosvāmī knows the standard of sense happiness. In transcendental sense happiness, the senses are engaged in the service of Hṛṣīkeśa, or the supreme owner of the senses – Kṛṣṇa. Serving Kṛṣṇa with purified senses is called Kṛṣṇa consciousness.

That is the way of bringing the senses under full control. What is more, that is the highest perfection of yoga practice.

🌹 🌹 🌹 🌹 🌹


7 Jan 2020