శ్రీమద్భగవద్గీత - 257: 06వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 257: Chap. 06, Ver. 24


🌹. శ్రీమద్భగవద్గీత - 257 / Bhagavad-Gita - 257 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 24 🌴

24. స నిశ్చయేన యోక్తవ్యో యోగోనిర్విణ్ణ చేతసా |
సంకల్పప్రభవాన్ కామాంస్త్యక్త్వా సర్వాన శేషత: |
మనసైవేన్ద్రియగ్రామం వినియమ్యసమన్తత:


🌷. తాత్పర్యం :

స్థిరనిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగము నభ్యసించుచు మనుజుడు ఆ మార్గము నుండు వైదొలగక యుండవలెను. మానసికకల్పనల నుండి ఉత్పన్నమైన విషయకోరికల నన్నింటిని ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి, అతడు మనస్సు ద్వారా ఇంద్రియములను అన్నివైపుల నుండి నియమింపవలెను.

🌷. భాష్యము :

యోగము నభ్యసించువాడు స్థిరనిశ్చయము కలిగి ఏమాత్రము మార్గము నుండి వైదొలగకే ఓపికగా తన అభ్యాసమును కొనసాగింపవలెను. అంతిమవిజయము నెడ విశ్వాసమును కలిగియుండి, గొప్ప పట్టుదలతో తన పనిని నిర్వహింపవలెను. విజయము లభించుట యందు ఆలస్యమైనచో అతడెన్నడును నిరాశ చెందరాదు. నిష్ఠతో అభ్యాసము కావించువానికి విజయము తథ్యమై యుండును. శ్రీరూపగోస్వామి భక్తియోగమును గూర్చి ఈ విధముగా పలికియుండిరి.

ఉత్సాహా న్నిశ్చయాద్ధైర్యాత్ తత్తత్కర్మప్రవర్తనాత్ |
సంగత్యగాత్ సతో వృత్తే: షడ్భిర్భక్తి: ప్రసిధ్యతి

“ఉత్సాహము, పట్టుదల, నిశ్చయము, భక్తుల సమక్షములో విధ్యుక్తధర్మములను నిర్వర్తించుట మరియు సత్వగుణకార్యములందే సంపూర్ణముగా నిమగ్నమగుట ద్వారా భక్తియోగమును మనుజుడు విజయవంతముగా నిర్వహింపగలడు.” (ఉపదేశామృతము 3)

యోగాభ్యాశము, ముఖ్యముగా కృష్ణభక్తిరసభావన యందు నిర్వహింపబడెడి భక్తియోగము అతికటినమైనదిగా తోచవచ్చును. కాని దాని నియమములను నిశ్చయముగా పాటించువారికి శ్రీకృష్ణభగవానుడు తప్పక సహాయమును గూర్చును. తనకు తాను సహాయము చేసికొనెడివానికి భగవానుని సహాయము లభించుచున్నది తెలిసిన విషయమే కదా!

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 257 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 24 🌴


24. sa niścayena yoktavyo yogo ’nirviṇṇa-cetasā
saṅkalpa-prabhavān kāmāṁs tyaktvā sarvān aśeṣataḥ
manasaivendriya-grāmaṁ viniyamya samantataḥ

🌷 Translation :

One should engage oneself in the practice of yoga with determination and faith and not be deviated from the path. One should abandon, without exception, all material desires born of mental speculation and thus control all the senses on all sides by the mind.

🌹 Purport :

The yoga practitioner should be determined and should patiently prosecute the practice without deviation. One should be sure of success at the end and pursue this course with great perseverance, not becoming discouraged if there is any delay in the attainment of success. Success is sure for the rigid practitioner. Regarding bhakti-yoga, Rūpa Gosvāmī says:

utsāhān niścayād dhairyāt tat-tat-karma-pravartanāt
saṅga-tyāgāt sato vṛtteḥ ṣaḍbhir bhaktiḥ prasidhyati

“One can execute the process of bhakti-yoga successfully with full-hearted enthusiasm, perseverance and determination, by following the prescribed duties in the association of devotees and by engaging completely in activities of goodness.” (Upadeśāmṛta 3)

Practice of yoga, especially bhakti-yoga in Kṛṣṇa consciousness, may appear to be a very difficult job. But if anyone follows the principles with great determination, the Lord will surely help, for God helps those who help themselves.

🌹 🌹 🌹 🌹 🌹

5 Jan 2020