శ్రీమద్భగవద్గీత - 256: 06వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 256: Chap. 06, Ver. 23


🌹. శ్రీమద్భగవద్గీత - 256 / Bhagavad-Gita - 256 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 23 🌴

23. తం విద్యాద్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ ।
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ।। 23 ।।


🌷. తాత్పర్యం :

దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందురు. ఈ యోగమును ధృడ సంకల్పముతో ఎలాంటి నిరాశావాదం, అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలెను.

🌷. భాష్యము :

దేహమున్నంతవరకు దేహావసరములైన ఆహారము, నిద్ర, భయము, మైథునములను మనుజుడు నెరవేర్చవలసి యుండును. కాని శుద్ధభక్తియోగము (కృష్ణభక్తిరసభావనము) నందున్న వ్యక్తి అట్టి దేహావాసరములను తీర్చుకొనునప్పుడు ఇంద్రియములను అనవసరముగా ప్రేరేపింపడు. పైగా అతడు కేవలము దేహపోషణ నిమిత్తమే కావలసినవి గ్రహించి (చెడ్డబేరపు ఉత్తమలాభమును పొందుచు) కృష్ణభక్తిభావన యందు దివ్యసౌఖ్యము ననుభవించును.

అపాయము, రోగము, అభావము, ప్రియబంధువుల మృతి వంటి యాదృచ్చిక సంఘటనల యెడ అతడు నిర్లప్తుడై, తన కృష్ణపరకర్మల యెడ మాత్రము సదా జాగారూకుడై యుండును. అపాయము లెన్నడును అతనిని స్వీయకార్య విముఖుని చేయజాలవు. “ఆగమపాయినో (నిత్యాస్తాం స్తితిక్షస్వ భారత” యని భగవద్గీత యందలి ద్వితియాధ్యాయమున (2.14) తెలుపబడినది.

ఆ విధముగా అవి రాకపోకలు కలవనియు మరియు తన కర్మలను ప్రభావితము చేయజాలవనియు ఎరిగియుండుటచే అతడు తత్సంఘటనలను ఓర్పుతో సహించును. ఆ రీతిని అతడు యోగాభ్యాసమునందు అత్యున్నత పూర్ణత్వమును సాధించగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 256 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 23 🌴

23. taṁ vidyād duḥkha-sanyoga-viyogaṁ yogasaṅjñitam
sa niśhchayena yoktavyo yogo ’nirviṇṇa-chetasā


🌷 Translation :

That state of severance from union with misery is known as Yog. This Yog should be resolutely practiced with determination free from pessimism.

🌹 Purport :

The best practice of yoga in this age is Kṛṣṇa consciousness, which is not baffling. A Kṛṣṇa conscious person is so happy in his occupation that he does not aspire after any other happiness. There are many impediments, especially in this age of hypocrisy, to practicing haṭha-yoga, dhyāna-yoga and jñāna-yoga, but there is no such problem in executing karma-yoga or bhakti-yoga.

As long as the material body exists, one has to meet the demands of the body, namely eating, sleeping, defending and mating. But a person who is in pure bhakti-yoga, or in Kṛṣṇa consciousness, does not arouse the senses while meeting the demands of the body. Rather, he accepts the bare necessities of life, making the best use of a bad bargain, and enjoys transcendental happiness in Kṛṣṇa consciousness.

He is callous toward incidental occurrences – such as accidents, disease, scarcity and even the death of a most dear relative – but he is always alert to execute his duties in Kṛṣṇa consciousness, or bhakti-yoga. Accidents never deviate him from his duty. As stated in the Bhagavad-gītā (2.14), āgamāpāyino ’nityās tāṁs titikṣasva bhārata. He endures all such incidental occurrences because he knows that they come and go and do not affect his duties. In this way he achieves the highest perfection in yoga practice.

🌹 🌹 🌹 🌹 🌹


4 Jan 2020