శ్రీమద్భగవద్గీత - 271: 06వ అధ్., శ్లో 38 / Bhagavad-Gita - 271: Chap. 06, Ver. 38
🌹. శ్రీమద్భగవద్గీత - 271 / Bhagavad-Gita - 271 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 38 🌴
38. కచ్చిన్నోభయవిభ్రష్ట శ్చిన్నాభ్రమివ నశ్యతి |
అప్రతిష్టో మహాబాహా విమూడో బ్రహ్మణ: పథి ||
🌷. తాత్పర్యం :
ఓ మాహాబాహో శ్రీకృష్ణా! ఆధ్యాత్మికమార్గము నుండి వైదొలగిన అట్టి మనుజుడు ఆధ్యాత్మికజయము మరియు లౌకికజయమును రెండింటిని పొందినవాడై ఎచ్చోటను స్థానము లేకుండా గాలిచే చెదరిన మేఘము వలె నశింపడా?
🌷. భాష్యము :
మానవాభ్యుదయమునకు రెండు మార్గములు గలవు. లౌకికులు ఆధ్యాత్మికత యందు అనురక్తి యుండదు. తత్కారణమున వారు ఆర్ధికాభివృద్ధి ద్వారా లౌకికపురోగతిని బడయుట యందు గాని, తగిన కర్మల ద్వారా ఉన్నతలోకములను చేరుట యందు గాని ప్రియమును కలిగియుందురు. కాని ఎవ్వరేని ఆధ్యాత్మికమార్గమును చేపట్టినచో అట్టి విషయకర్మల నుండి విరమణను పొంది, సర్వవిధములైన నామమాత్ర సుఖముల నన్నింటిని త్యజించవలసివచ్చును.
ఇట్టి స్థితిలో ఆధ్యాత్మిక మార్గమున పయనించువాడు తన యత్నములో విఫలమైనచో బాహ్యమునకు రెండువిధములా నష్టపోయినవాడగును. వేరుమాటలలో అతడు భౌతికసుఖమును అనుభవింపలేదు. అలాగుననే ఆధ్యాత్మికజయమును సైతము పొందలేడు. గాలి చేత చెదరగొట్టబడిన మేఘమువలె అతడు రెండింటి యందును స్థానము లేకుండును. కొన్నిమార్లు ఆకాశమున మేఘము ఒక చిన్న మేఘము నుండి విడివడి పెద్ద మేఘముతో కలియుచుండును. కాని ఆ ప్రయత్నములో అది విఫలమైనచో, గాలిచే చెదరగొట్టబడి అనంత ఆకాశములో జాడలేకుండా పోవును.
బ్రహ్మము, పరమాత్మ, భగవానుని ప్రకటమగు పరతత్త్వపు అంశరూపమున తాను నిజమునకు దివ్యుడనని జీవుడు ఎరుగగలిగే ఆత్మానుభవమార్గమే “బ్రహ్మణపథి:” యనబడును. శ్రీకృష్ణభగవానుడే ఆ పరతత్త్వము కనుక అతనికి శరణము నొందినవాడు కృతకృత్యుడైన ఆధ్యాత్మికుడు కాగలడు. కాని బ్రహ్మానుభవము మరియు పరతత్త్వానుభవము ద్వారా ఇట్టి జీవితలక్ష్యమును చేరగలుగుట బహుజన్మలు అవసరమగును (బహూనాం జన్మనామన్తే). కనుకనే ప్రత్యక్ష విధానమైన భక్తియోగమే (కృష్ణభక్తిరసభావనము) అత్యుత్తమ ఆధ్యాత్మికానుభవ మార్గమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 271 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 38 🌴
38. kaccin nobhaya-vibhraṣṭaś chinnābhram iva naśyati
apratiṣṭho mahā-bāho vimūḍho brahmaṇaḥ pathi
🌷 Translation :
O mighty-armed Kṛṣṇa, does not such a man, who is bewildered from the path of transcendence, fall away from both spiritual and material success and perish like a riven cloud, with no position in any sphere?
🌹 Purport :
There are two ways to progress. Those who are materialists have no interest in transcendence; therefore they are more interested in material advancement by economic development, or in promotion to the higher planets by appropriate work. When one takes to the path of transcendence, one has to cease all material activities and sacrifice all forms of so-called material happiness. If the aspiring transcendentalist fails, then he apparently loses both ways; in other words, he can enjoy neither material happiness nor spiritual success. He has no position; he is like a riven cloud.
A cloud in the sky sometimes deviates from a small cloud and joins a big one. But if it cannot join a big one, then it is blown away by the wind and becomes a nonentity in the vast sky. The brahmaṇaḥ pathi is the path of transcendental realization through knowing oneself to be spiritual in essence, part and parcel of the Supreme Lord, who is manifested as Brahman, Paramātmā and Bhagavān. Lord Śrī Kṛṣṇa is the fullest manifestation of the Supreme Absolute Truth, and therefore one who is surrendered to the Supreme Person is a successful transcendentalist. To reach this goal of life through Brahman and Paramātmā realization takes many, many births (bahūnāṁ janmanām ante). Therefore the supermost path of transcendental realization is bhakti-yoga, or Kṛṣṇa consciousness, the direct method.
🌹 🌹 🌹 🌹 🌹
18 Jan 2020