శ్రీమద్భగవద్గీత - 283: 07వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 283: Chap. 07, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 283 / Bhagavad-Gita - 283 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴.7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 03 🌴

03. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే |
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వత:


🌷. తాత్పర్యం :

వేలాది మనుష్యులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలిసికొన గలుగుచున్నాడు.

🌷. భాష్యము :

మానవులందరు పెక్కు తరగతులవారు కలరు. అట్టి వేలాది మనుష్యులలో ఒకానొకడు మాత్రమే ఆత్మసాక్షాత్కారమునందు అభిరుచిని కలిగి ఆత్మ యననేమో, దేహమననేమో, పరతత్త్త్వమననేమో తెలిసికొనుటకు యత్నించును.

సాధారణముగా మనుజులు పశుప్రవృత్తులేయైన ఆహారము, భయము, నిద్ర, మైథునముల యందు మాత్రమే నియుక్తులై యుందురు. ఏ ఒక్కడు కుడా ఆధ్యాత్మికజ్ఞానము నందు అభిరుచిని కలిగియుండడు. భగవద్గీత యందలి మొదటి ఆరు అధ్యాయములు ఆధ్యాత్మికజ్ఞానము నందును, ఆత్మ, పరమాత్మలను అవగాహన చేసికొనుట యందును, జ్ఞానయోగము మరియు ధ్యానయోగము ద్వారా ఆత్మసాక్షాత్కారమును పొందుట యందును, అనాత్మయైన భౌతికపదార్థమును ఆత్మ నుండి వేరుగా గాంచుట యందును అనురక్తులై యుండెడి వారికై నిర్దేశింపబడినవి.

కాని వాస్తవమునకు కృష్ణభక్తిభావనయందున్న వారికే శ్రీకృష్ణభగవానుడు సంపూర్ణముగా అవగతము కాగలడు. ఇతర తత్త్వవేత్తలు నిరాకార బ్రహ్మతత్త్వమును మాత్రము పొందిన పొందవచ్చును.

ఏలయన నిరాకార బ్రహ్మతత్త్వము నెరుగుట శ్రీకృష్ణుని అవగతము చేసికొనుట కన్నను సులువైనది. శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడే గాక నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానములకు పరమైనవాడు. కనుకనే యోగులు మరియు జ్ఞానులైనవారు కృష్ణుని అవగాహనము చేసికొను యత్నములో భ్రమనొందుదురు. పరమ అద్వైతియైన శ్రీశంకరాచార్యులు తమ గీతాభాష్యములో శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించినను, ఆయన అనుయాయులు మాత్రము శ్రీకృష్ణుని దేవదేవుడని అంగీకరింపరు. మనుజడు నిరాకారబ్రహ్మానుభూతిని కలిగియున్నను శ్రీకృష్ణుని అవగతము చేసికొనుట అతి కష్టకార్యమగుటయే అందులకు కారణము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 283 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 03 🌴

03. manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye
yatatām api siddhānāṁ kaścin māṁ vetti tattvataḥ


🌷 Translation :

Out of many thousands among men, one may endeavor for perfection, and of those who have achieved perfection, hardly one knows Me in truth.

🌹 Purport :

There are various grades of men, and out of many thousands, one may be sufficiently interested in transcendental realization to try to know what is the self, what is the body, and what is the Absolute Truth.

Generally mankind is simply engaged in the animal propensities, namely eating, sleeping, defending and mating, and hardly anyone is interested in transcendental knowledge.

The first six chapters of the Gītā are meant for those who are interested in transcendental knowledge, in understanding the self, the Superself and the process of realization by jñāna-yoga, dhyāna-yoga and discrimination of the self from matter. However, Kṛṣṇa can be known only by persons who are in Kṛṣṇa consciousness.

Other transcendentalists may achieve impersonal Brahman realization, for this is easier than understanding Kṛṣṇa. Kṛṣṇa is the Supreme Person, but at the same time He is beyond the knowledge of Brahman and Paramātmā. The yogīs and jñānīs are confused in their attempts to understand Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹

30 Jan 2020