శ్రీమద్భగవద్గీత - 022: 01వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 022: Chap. 01, Ver. 22


🌹. శ్రీమద్భగవద్గీత - 22 / Bhagavad-Gita - 22 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము 🌴
శ్లోకము 22

యావదేతాన్నిరీక్షేహం
యోద్దుకామానవస్థితాన్ ||
కైర్మయా సహ యోద్ధవ్య
మస్మిన్ రణసముద్యమే ||


🌷. తాత్పర్యం :

ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను పరీక్షించాలి. 


🌷. బాష్యము : 
 
శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడగు దేవదేవుడైన తన నిర్హేతుక కరుణ వలన మిత్రుని సేవ యందు నియుక్తుడయ్యెను. తన భక్తుల యెడ ప్రేమను చూపుటలో అతడెన్నడును విఫలత్వము నొందడు. కనుకనే అతడు ఇచ్చట “అచ్యుతుని”గా సంబోధింపబడినాడు. రథసారథిగా అతడు అర్జునిని ఆదేశములను అమలుపరచ వలసివచ్చును. ఆ విధముగా నొనర్చుటకు ఆ దేవదేవుడు సంకోచింపనందున అచ్యుతునిగా పిలువబడినాడు.
తన భక్తుని కొరకు రథచోదకుని స్థానమును గ్రహించినను అతని దివ్యస్థితికి ఎన్నడును భంగము రాదు. అన్ని పరిస్థితుల యందును అతడు దేవదేవుడే. ఇంద్రియాధిపతియైన హృషీకేశుడే. భగవానుడు మరియు అతని సేవకుని నడుమ గల సంభందము దివ్యమైనది మరియు మధురమైనది. సేవకుడు సదా భగవానునికి సేవను గూర్చ సంసిద్ధుడై యుండును.
అదేవిధముగా భగవానుడు సైతము భక్తునికి ఏదియో కొంత సేవగూర్చెడి అవకాశము కొరకై వేచియుండును. ఆదేశము లొసగువానిగా తాను ఆజ్ఞల నొసగుట కన్నాను శుద్ధభక్తుడైనవాడు తనను ఆజ్ఞాపించు స్థానమును గైకొనినచో అతడు మిక్కిలి ముదమందును. వాస్తవమునకు అతడు ప్రభువైనందున ప్రతియెక్కరు అతని ఆజ్ఞాపాలకులే. ఆజ్ఞాపించుట అతనికి అధికులెవ్వరు లేరు.
కాని తనను శుద్ధభక్తుడైనవాడు ఆజ్ఞాపించుట తటస్థించినపుడు ఆ దేవదేవుడు దివ్యానందమును ననుభవించును. అయినప్పటికి అన్ని పరిస్థితుల యందును అతడు అచ్యుతుడైన ప్రభువే అయియున్నాడు.
భగవానుని శుద్ధభక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో మరియు సోదరులతో యుద్ధము చేయగోరలేదు.
కాని ఎటువంటి శాంతిమయ రాయబారమునకు సైతము సమ్మతింపని దుర్యోధనుని మొండితనము వలననే అతడు యుద్ధరంగమునకు బలవంతముగా రావలసివచ్చెను. కనుకనే యుద్ధరంగమునందు ఏ ప్రముఖుల ఉపస్థితులై యుండిరా యని గాంచుటలో అతడు ఆతురతను కలిగియుండెను. రణరంగమున శాంతియత్నములు చేయుటున్న ప్రశ్నలేకున్నను వారిని అతడు తిరిగి చూడగోరెను. అంతియేగాక అవాంచితమైన యుద్ధము వైపుకు వారెంత మ్రొగ్గు చూపియుండిరో అతడు గాంచగోరెను.
🌹 🌹 🌹 🌹 🌹 



🌹 Bhagavad-Gita as It is - 22 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 1 - Vishada Yoga 🌴
Verse 22

yāvad etān nirīkṣe ’haṁ yoddhu-kāmān avasthitān
kair mayā saha yoddhavyam asmin raṇa-samudyame


🌷 Translation :

So that I may see those present here, who desire to fight, and with whom I must contend in this great trial of arms.


🌷Purport : 

Although Lord Kṛṣṇa is the Supreme Personality of Godhead, out of His causeless mercy He was engaged in the service of His friend. He never fails in His affection for His devotees, and thus He is addressed herein as infallible.
As charioteer, He had to carry out the orders of Arjuna, and since He did not hesitate to do so, He is addressed as infallible. Although He had accepted the position of a charioteer for His devotee, His supreme position was not challenged. In all circumstances, He is the Supreme Personality of Godhead, Hṛṣīkeśa, the Lord of the total senses. The relationship between the Lord and His servitor is very sweet and transcendental.
The servitor is always ready to render service to the Lord, and, similarly, the Lord is always seeking an opportunity to render some service to the devotee. He takes greater pleasure in His pure devotee’s assuming the advantageous position of ordering Him than He does in being the giver of orders.
🌹 🌹 🌹 🌹 🌹

30 May 2019