శ్రీమద్భగవద్గీత - 011: 01వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 011: Chap. 01, Ver. 11


🌹శరీమద్భగవద్గీత 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ

🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 11

అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితా: |
భీష్మమేవాభిరక్షన్తు భవన్త: సర్వ ఏవ హి ||

సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖ్యస్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసియున్నది.

భాష్యము : భీష్ముని నైపుణ్యమును శ్లాఘించిన పిదప దుర్యోధనుడు ఇతరులు తాము తక్కువ ప్రాముఖ్యమును కలిగినవారిగా తలతురేమోనని భావించెను. తత్కారణముగా తన సహజ రాజదోరణిలో అతడు పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబరచ యత్నించెను. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్పవీరుడే అయినను వృద్దుడైనందున ప్రతియెక్కరు అన్నివైపుల నుండి అతని రక్షణమును గూర్చి ప్రత్యేకముగా అలోచించవలెనని అతడు వక్కాణించెను. అతడు యుద్ధమునందు నియుక్తుడైనప్పుడు ఒకే ప్రక్క అతని పూర్తి సంలగ్నతను శత్రువులు అనువుగా తీసుకొనగలరు. కనుక ఇతర వీరులందరును తమ ముఖ్యస్థానములను వీడకుండుట మరియు సేనావ్యూహమును శత్రువు భేదించుట అవకాశమీయకపోవుట అతి ముఖ్యమై యున్నవి. కౌరవుల విజయము భీష్ముని సన్నిధి పైననే ఆధారపడియున్నదని దుర్యోధనునుడు స్పష్టముగా తలచెను. యుద్ధమునందు భీష్ముడు మరియు ద్రోణాచార్యుని పూర్ణ సహకారము నెడ అతడు పూర్ణ విశ్వాసము కలిగియుండెను. సభలో మహాసేనానాయకుల సమక్షమున నగ్నముగా నిలుపుటకు బలవంతము చేసెడి సమయమున అర్జునుని భార్యయైన ద్రౌపది నిస్సహాయస్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినపుడు వారు ఒక్కమాటైనను పలుకలేదని అతడెరుగుటయే అందులకు కారణము. ఆ ఇరువురు సేనానులు పాండవుల యెడ ఏదియో ఒక మమకారమును కలిగియున్నారని తెలిసినప్పటికినిటికిని పాచికల సమయమున గావించినట్లు వారిపుడు ఆ మమకారమును పూర్ణముగా త్యజింతురని అతడు ఆశించెను.

🌹 Bhagavad-Gita as It is 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj

🌴 Chapter 1 🌴
Verse 11

ayaneṣu ca sarveṣu
yathā-bhāgam avasthitāḥ
bhīṣmam evābhirakṣantu
bhavantaḥ sarva eva hi

All of you must now give full support to Grandfather Bhīṣma, as you stand at your respective strategic points of entrance into the phalanx of the army.

Purport : Duryodhana, after praising the prowess of Bhīṣma, further considered that others might think that they had been considered less important, so in his usual diplomatic way, he tried to adjust the situation in the above words. He emphasized that Bhīṣmadeva was undoubtedly the greatest hero, but he was an old man, so everyone must especially think of his protection from all sides. He might become engaged in the fight, and the enemy might take advantage of his full engagement on one side.

Therefore, it was important that other heroes not leave their strategic positions and allow the enemy to break the phalanx. Duryodhana clearly felt that the victory of the Kurus depended on the presence of Bhīṣmadeva. He was confident of the full support of Bhīṣmadeva and Droṇācārya in the battle because he well knew that they did not even speak a word when Arjuna’s wife Draupadī, in her helpless condition, had appealed to them for justice while she was being forced to appear naked in the presence of all the great generals in the assembly. Although he knew that the two generals had some sort of affection for the Pāṇḍavas, he hoped that these generals would now completely give it up, as they had done during the gambling performances.

🌹🌹🌹🌹🌹