శ్రీమద్భగవద్గీత - 020: 01వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 020: Chap. 01, Ver. 20


🌹. శ్రీమద్భగవద్గీత - 20 / Bhagavad-Gita - 20 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. ప్రధమ అధ్యాయము🌴

శ్లోకము 20

20. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా
ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ: |
ప్రవృత్తే శస్త్రసమ్పాతే
ధనురుద్యమ్య పాణ్డవ: | 


🌷. తాత్పర్యం :

ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి, ధనుస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను.


🌷. బాష్యము :

యుద్ధము కొద్ది సమయములో ఆరంభము కానుండెను. యుద్ధరంగమున శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్షోపదేశములతో నిర్దేశితులైన పాండవులచే ఏర్పాటు చేయబడిన అనూహ్యమైన సేనావ్యూహము ధృతరాష్ట్రతనయులను దాదాపు పూర్తిగా నిరుత్సాహపరచినదని పై వ్యాక్యము ద్వారా అవగతమగుచున్నది.

హనుమానుని రూపముచే చిహ్నితమైన అర్జునుని ధ్వజము విజయమునకు మరొక సూచనయై యుండెను. ఏలయన, రామ, రావణుల నడుమ జరిగిన యుద్ధములో హనుమంతుడు రామునకు సహాయము చేయగా శ్రీరాముడు విజయము నొందెను. ఇప్పుడు రాముడు మరియు హనుమానులిరువురును అర్జునునికి సహాయము చేయుటకై అతని రథమున ఉండిరి.

శ్రీకృష్ణభగవానుడు స్వయముగా శ్రీరాముడే. అంతియేగాక శ్రీరాముడు ఎచ్చట నుండునో అతని నిత్య సేవకుడైన హనుమానుడు మరియు నిత్యసతియైన సీతాదేవి(లక్ష్మీదేవి) అచ్చట నుందురు. కావున వాస్తవమునకు అర్జునుడు ఎట్టి శత్రువు నుండియు భయము నొందుటకు కారణము లేదు. అన్నింటికీ మించి హృషీకేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయుటకు స్వయముగా ఉపస్తితుడై యుండెను.

ఈ విధముగా యుద్ధము నిర్వహించుట యనెడి విషయమున చక్కని సహాయము అర్జునునకు లభ్యమై యుండెను. తన నిత్యభక్తుని కొరకు భగవానుడు ఏర్పరచిన అట్టి శుభకరమైన పరిస్థితులు నిశ్చయముగా విజ్యమునకు సూచనలు కావించుచున్నవి.



🌹 Bhagavad-Gita as It is - 20 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 1 🌴
Verse 20

20. atha vyavasthitān dṛṣṭvā dhārtarāṣṭrān kapi-dhvajaḥ
pravṛtte śastra-sampāte dhanur udyamya pāṇḍavaḥ


🌷 Translation :

At that time Arjuna, the son of Pāṇḍu, seated in the chariot bearing the flag marked with Hanumān, took up his bow and prepared to shoot his arrows.


🌷 Purport :

The battle was just about to begin. It is understood from the above statement that the sons of Dhṛtarāṣṭra were more or less disheartened by the unexpected arrangement of military force by the Pāṇḍavas, who were guided by the direct instructions of Lord Kṛṣṇa on the battlefield.

The emblem of Hanumān on the flag of Arjuna is another sign of victory because Hanumān cooperated with Lord Rāma in the battle between Rāma and Rāvaṇa, and Lord Rāma emerged victorious. Now both Rāma and Hanumān were present on the chariot of Arjuna to help him.

Lord Kṛṣṇa is Rāma Himself, and wherever Lord Rāma is, His eternal servitor Hanumān and His eternal consort Sītā, the goddess of fortune, are present. Therefore, Arjuna had no cause to fear any enemies whatsoever. And above all, the Lord of the senses, Lord Kṛṣṇa, was personally present to give him direction.

Thus, all good counsel was available to Arjuna in the matter of executing the battle. In such auspicious conditions, arranged by the Lord for His eternal devotee, lay the signs of assured victory.

🌹🌹🌹🌹🌹


29 May 2019