🌹 శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 15
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ: |
పౌణ్డ్రం దధ్మౌ మాహాశంఖం భీమకర్మా వృకోదర: ||
శ్రీకృష్ణభగవానుడు పాంచజన్యమనెడి తన శంఖమును పూరించెను; అర్జునుడు దేవదత్తమనెడి తన శంఖమును పూరించెను; భోజనప్రియుడు, ఘన కార్యములను చేయువాడు అగు భీముడు పౌండ్రమనెడి తన మాహాశంఖము నూదెను.
బాష్యము : సర్వేంద్రియములకు ప్రభువైనందునే శ్రీకృష్ణుడు ఈ శ్లోకమునందు హృషీకేషుడు తెలుపబడినాడు. జీవులందరును అతని అంశలు గావున జీవుల ఇంద్రియములు సైతము అతని ఇంద్రియములు అంశలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను గూర్చి తెలియలేనందున వారికి ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపగోరుదురు. భగవానుడు జీవుల హృదయమునందు నిలిచి వారి ఇంద్రియములను నిర్దేశించుచుండును. కాని అతడు జీవుని శరణాగతిని బట్టి నిర్దేశమును గూర్చుచుండును. శుద్ధభక్తుని విషయమున అతడు ప్రత్యక్షముగా ఇంద్రియములను నియమించును. ఇచ్చట కురుక్షేత్ర రణరంగమునందు అర్జునుని దివ్యేంద్రియములను ప్రత్యక్షముగా నియమించుటచే శ్రీకృష్ణభగవానునికి ప్రత్యేకముగా “హృషీ కేశుడు” అనెడి నామము వాడబడినది. వివిధ కార్యములను అనుసరించి భగవానుడు వివిధనామములను కలిగియుండును. ఉదాహరణకు మధువనెడి రాక్షసుని సంహరించుట వలన అతనికి మధుసూదనుడనెడి నామము కలిగెను. గోవులకు మరియు ఇంద్రియములకు అతడు ఆనందము నొసగును కనుక “గోవిందుడు” అనెడి నామము కలిగెను. వసుదేవుని తనయుడై ఆవిర్భవించినందున “వాసుదేవుడు” అనెడి నామము కలిగెను. దేవకీదేవిని తల్లిగా అంగీకరించినందున “దేవకీనందన” అనెడి నామము కలిగెను. బృందావనమున యశోదకు బాల్యలలీలను దర్శించు అవకాశమొసగినందున “యశోదనందన” అనెడి నామము కలిగెను. స్నేహితుడైన అర్జునునకు సారథిగా వర్తించుట వలన “పార్థసారథి” యను నామము కలిగెను. అదేవిధముగా కురుక్షేత్రరణరంగమున అర్జునునకు నిర్దేశము నొసగుట వలన “హృషీకేశుడు” అను నామము కలిగెను.
వివిధ యజ్ఞముల నిర్వహణకు ధనము అవసరపడినప్పుడు దానిని సంపాదించుటలో అగ్రజునికి సహాయపడి నందున ఈ శ్లోకమున అర్జునుడు ధనుంజయునిగా తెలుపబడినాడు. అదేవిధముగా భీముడు వృకోదరునిగా తెలుపబడినాడు. విపరీతముగా తినుటయే గాక దానికి తగినట్లుగా హిడింబాసురుని వధించుట వంటి ఘనకార్యములు చేయుటయే అందులకు కారణము. ఈ విధముగా భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులు పూరించిన వారి ప్రత్యెక శంఖములు పాండవ సమీక్ష వీరులకు ఉత్సాహమును కలిగించెను. ప్రతిపక్షములో అట్టి ఘనతలు గాని, దివ్యనిర్దేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధి గాని, లక్ష్మీదేవి సన్నిది గాని లేవు. అనగా వారు రణమున ఓడిపోవుట నిశ్చయింపబడియే ఉన్నది. ఆ సందేశమే శంఖధ్వానముల ద్వారా ప్రకటింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 15
pāñcajanyaṁ hṛṣīkeśo
devadattaṁ dhanañ-jayaḥ
pauṇḍraṁ dadhmau mahā-śaṅkhaṁ
bhīma-karmā vṛkodaraḥ
Lord Kṛṣṇa blew His conchshell, called Pāñcajanya; Arjuna blew his, the Devadatta; and Bhīma, the voracious eater and performer of herculean tasks, blew his terrific conchshell, called Pauṇḍra.
Purport : Lord Kṛṣṇa is referred to as Hṛṣīkeśa in this verse because He is the owner of all senses. The living entities are part and parcel of Him, and therefore the senses of the living entities are also part and parcel of His senses. The impersonalists cannot account for the senses of the living entities, and therefore they are always anxious to describe all living entities as senseless, or impersonal. The Lord, situated in the hearts of all living entities, directs their senses. But He directs in terms of the surrender of the living entity, and in the case of a pure devotee He directly controls the senses. Here on the Battlefield of Kurukṣetra the Lord directly controls the transcendental senses of Arjuna, and thus His particular name of Hṛṣīkeśa. The Lord has different names according to His different activities. For example, His name is Madhusūdana because He killed the demon of the name Madhu; His name is Govinda because He gives pleasure to the cows and to the senses; His name is Vāsudeva because He appeared as the son of Vasudeva; His name is Devakī-nandana because He accepted Devakī as His mother; His name is Yaśodā-nandana because He awarded His childhood pastimes to Yaśodā at Vṛndāvana; His name is Pārtha-sārathi because He worked as charioteer of His friend Arjuna. Similarly, His name is Hṛṣīkeśa because He gave direction to Arjuna on the Battlefield of Kurukṣetra.
Arjuna is referred to as Dhanañjaya in this verse because he helped his elder brother in fetching wealth when it was required by the king to make expenditures for different sacrifices. Similarly, Bhīma is known as Vṛkodara because he could eat as voraciously as he could perform herculean tasks, such as killing the demon Hiḍimba. So the particular types of conchshell blown by the different personalities on the side of the Pāṇḍavas, beginning with the Lord’s, were all very encouraging to the fighting soldiers. On the other side there were no such credits, nor the presence of Lord Kṛṣṇa, the supreme director, nor that of the goddess of fortune. So they were predestined to lose the battle – and that was the message announced by the sounds of the conchshells.
🌹🌹🌹🌹🌹
26 May 2019