శ్రీమద్భగవద్గీత - 019: 01వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 019: Chap. 01, Ver. 19


🌹శరీమద్భగవద్గీత 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ

🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 19

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములో(భ్యనునాడయన్ ||

ఆ వివిధశంఖముల ధ్వని అతిభీకర మయ్యెను. భూమ్యాకాశములు రెండింటిని కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయము బ్రద్దలు చేసెను.

బాష్యము :  పాండుతనయులు మోసము చేయుట మరియు రాజ్యసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్ట యత్నించుట యనెడి అధర్మ యోచన ఏమాత్రము శ్లాఘనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు అతి చతురతతో తెలియజేసినాడు. కురువంశమంతయు ఆ మహారణమునందు సంహరింపబడు ననెడి సూచనలు స్పష్టముగా లభించినవి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుమలైన అభిమన్యుని వంటివారి వరకు సర్వులు (ప్రపంచ పలు దేశముల నుండి విచ్చేసిన రాజులతో సహా) అచ్చట నిలిచియుండిరి. వారందరును నశింపనున్నారు. తన కుమారులు అనునసరించిన యుక్తి విధానము ప్రోత్సాహించియున్నందున ధృతరాష్ట్రుడే ఆ సమస్త ఘోరవిపత్తుకు కారణమై యున్నాడు.


🌹 Bhagavad-Gita as It is 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj

🌴 Chapter 1 🌴
Verse 19

sa ghoṣo dhārtarāṣṭrāṇāṁ
hṛdayāni vyadārayat
nabhaś ca pṛthivīṁ caiva
tumulo ’bhyanunādayan

The blowing of these different conchshells became uproarious. Vibrating both in the sky and on the earth, it shattered the hearts of the sons of Dhṛtarāṣṭra.

Purport : When Bhīṣma and the others on the side of Duryodhana blew their respective conchshells, there was no heart-breaking on the part of the Pāṇḍavas. Such occurrences are not mentioned, but in this particular verse it is mentioned that the hearts of the sons of Dhṛtarāṣṭra were shattered by the sounds vibrated by the Pāṇḍavas’ party. This is due to the Pāṇḍavas and their confidence in Lord Kṛṣṇa. One who takes shelter of the Supreme Lord has nothing to fear, even in the midst of the greatest calamity.

🌹🌹🌹🌹🌹