శ్రీమద్భగవద్గీత - 014: 01వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 014: Chap. 01, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 14 / Bhagavad-Gita - 14 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. ప్రధమ అధ్యాయము - శ్లోకము 14 🌴

14. తత: శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ |
మాధవ: పాణ్డవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు: ||


🌷. తాత్పర్యం :

ఎదుటి పక్షమున శ్రీకృష్ణభగవానుడు, అర్జునుడు ఇరువురును తెల్లని గుఱ్ఱములు పూన్చబడిన మహారథమునందు ఆసీనులైనవారై తమ దివ్యశంఖములను పురించిరి.

“జయస్తు పాన్డుపుత్రాణాం యేషాం పక్షే జనార్దన:” – శ్రీకృష్ణభగవానుడు తన సాహచర్యము నొసగెడి కారణమున విజయము సదా పాండుపుత్రులకే లభించగలదు. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచియుండునో అచ్చట లక్ష్మీదేవి సైతము నిలిచియుండును. ఏలయన లక్ష్మీదేవి తన భర్తను వీడి ఎన్నడును ఒంటరిగా నివసింపదు.

అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్యధ్వని సూచించినట్లుగా విజయము మరియు ఐశ్వర్యములనునవి అర్జునుని కొరకు వేచియున్నవి. ఇదియే గాక మిత్రులిరువురు ఆసీనులై యున్న రథము అగ్నిదేవునిచే అర్జునునకు ఒసగబడినట్టిది. ముల్లోకములలో అన్ని దిక్కులను అది జయించు సామర్త్యమును కలిగియున్నదిని ఈ విషయము సూచించుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 14 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 1 Sloka 14 🌴

14. tataḥ śvetair hayair yukte
mahati syandane sthitau
mādhavaḥ pāṇḍavaś caiva
divyau śaṅkhau pradadhmatuḥ


🌷 Translation :

On the other side, both Lord Kṛṣṇa and Arjuna, stationed on a great chariot drawn by white horses, sounded their transcendental conchshells.


🌷 Purport :

Jayas tu pāṇḍu-putrāṇāṁ yeṣāṁ pakṣe janārdanaḥ. Victory is always with persons like the sons of Pāṇḍu because Lord Kṛṣṇa is associated with them. And whenever and wherever the Lord is present, the goddess of fortune is also there because the goddess of fortune never lives alone without her husband.

Therefore, victory and fortune were awaiting Arjuna, as indicated by the transcendental sound produced by the conchshell of Viṣṇu, or Lord Kṛṣṇa. Besides that, the chariot on which both the friends were seated had been donated by Agni (the fire-god) to Arjuna, and this indicated that this chariot was capable of conquering all sides, wherever it was drawn over the three worlds.

🌹🌹🌹🌹🌹


25 May 2019