శ్రీమద్భగవద్గీత - 463: 11వ అధ్., శ్లో 49 / Bhagavad-Gita - 463: Chap. 11, Ver. 49


🌹. శ్రీమద్భగవద్గీత - 463 / Bhagavad-Gita - 463 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 49 🌴

49. మా తే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ |
వ్యపేతభీ: ప్రీతమనా: పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య ||

🌷. తాత్పర్యం : నా ఈ ఘోర రూపమును చూచి నీవు కలత నొందిన వాడవు, భ్రాంతుడవు అయితివి. అదియంతయు నిపుడు అంతరించును గాక, ఓ భక్తుడా! అన్ని కలతల నుండియు విముక్తుడవై నీవు కోరిన రూపమును ప్రశాంత మనస్సుతో ఇప్పుడు గాంచుము.

🌷. భాష్యము : పూజనీయ పితామహుడైన భీష్ముని మరియు గురువైన ద్రోణుని వధించుటపట్ల అర్జునుడు ఆది యందు వ్యథ నొందెను. కాని పితామహుని వధించుట యందు అట్టి వెరుగు అవసరము లేదని శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశించెను. ధృతరాష్ట్ర తనయులు ద్రౌపదని కౌరవసభలో వివస్త్రను చేయ యత్నించినపుడు ఆ భీష్మ, ద్రోణులు మౌనము వహించిరి. ధర్మనిర్వహణలో అట్టి నిర్లక్ష్యకారణముగా వారు వాధార్హులు. వారు అధర్మయుత కర్మ వలన వారు ఇదివరకే సంహరింపబడిరని తెలియజేయుటకే అర్జునునకు శ్రీకృష్ణుడు విశ్వరూపమును చూపెను.

సాధారణముగా భక్తులు శాంతులును మరియు అట్టి ఘోరకార్యములను నొనరింప లేని వారును అయి యుందురు కావున అర్జునునకు విశ్వరూపము చూపబడినది. విశ్వరూప ప్రదర్శన ప్రయోజనము సిద్ధించియున్నందున అర్జునుడు చతుర్భుజ రూపమును గాంచగోరగా, శ్రీకృష్ణుడు దానిని అర్జునునకు చూపెను. ప్రేమభావముల పరస్పర వినిమయమునకు అవకాశమొసగనందున భగవానుని విశ్వరూపము నెడ భక్తుడు ఎక్కువగా ఆసక్తిని కలిగియుండడు. అతడు కేవలము దేవదేవునికి భక్తిపూర్వక నమస్సులు అర్పించవలెను గాని లేదా ద్విభుజ కృష్ణరూపమును గాంచవలెను గాని కోరును. తద్ద్వారా అతడు ఆ దేవదేవునితో ప్రేమయుక్తసేవలో భావవినిమయము కావింపగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 463 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada

📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 49 🌴


49. mā te vyathā mā ca vimūḍha-bhāvo dṛṣṭvā rūpaṁ ghoram īdṛṅ mamedam
vyapeta-bhīḥ prīta-manāḥ punas tvaṁ tad eva me rūpam idaṁ prapaśya

🌷 Translation : You have been perturbed and bewildered by seeing this horrible feature of Mine. Now let it be finished. My devotee, be free again from all disturbances. With a peaceful mind you can now see the form you desire.

🌹 Purport : In the beginning of Bhagavad-gītā Arjuna was worried about killing Bhīṣma and Droṇa, his worshipful grandfather and master. But Kṛṣṇa said that he need not be afraid of killing his grandfather. When the sons of Dhṛtarāṣṭra tried to disrobe Draupadī in the assembly of the Kurus, Bhīṣma and Droṇa were silent, and for such negligence of duty they should be killed. Kṛṣṇa showed His universal form to Arjuna just to show him that these people were already killed for their unlawful action. That scene was shown to Arjuna because devotees are always peaceful and they cannot perform such horrible actions.

The purpose of the revelation of the universal form was shown; now Arjuna wanted to see the four-armed form, and Kṛṣṇa showed him. A devotee is not much interested in the universal form, for it does not enable one to reciprocate loving feelings. Either a devotee wants to offer his respectful worshipful feelings, or he wants to see the two-handed Kṛṣṇa form so that he can reciprocate in loving service with the Supreme Personality of Godhead.

🌹 🌹 🌹 🌹 🌹


26 Jul 2020