శ్రీమద్భగవద్గీత - 448: 11వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 448: Chap. 11, Ver. 34


🌹. శ్రీమద్భగవద్గీత - 448 / Bhagavad-Gita - 448 🌹

✍️. శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 34 🌴

34. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ |
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్టా యుధ్యస్య జేతాసి రణే సపత్నాన్ ||


🌷. తాత్పర్యం : ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహా యోధులందరును నాచే ఇదివరకే చంపబడిరి. కావున నీవు వారిని సంహరింపుము. ఏ మాత్రము వ్యథనొందక కేవలము యుద్ధము నొనరింపుము. నీవు తప్పక నీ శత్రువులను రణమున నశింపజేయగలవు.

🌷. భాష్యము : ప్రతిప్రణాళికయు దేవదేవుని చేతనే నిర్వహింపబడుచుండును. కాని భక్తుల యెడ అరమ కరుణామయుడైన అతడు తన కోరిక ననుసరించి స్వీయప్రణాళికలను అమలరుపరచు భక్తుల కార్యసాఫల్య ప్రతిష్టను ఒసగగోరును. కనక గురుముఖముగా కృష్ణభక్తిభావన యందు వర్తించుచు ఆ దేవదేవుని అవగతము చేసికొనునట్లుగా ప్రతియొక్కరు జీవితమును మలచుకొనవలెను. శ్రీకృష్ణభగవానుని సంకల్పము అతని కరుణ తోడనే తెలియుటకు సాధ్యమగును. భక్తుల సంకల్పములు సైతము ఆ దేవదేవుని సంకల్పముతో సమానముగా ఉత్తమములై యుండును. కనుక మనుజుడు వాటిని అనుసరించి జీవనసమరమున జయమును పొందవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 448 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 34 🌴

34. droṇaṁ ca bhīṣmaṁ ca jayadrathaṁ ca karṇaṁ tathānyān api yodha-vīrān
mayā hatāṁs tvaṁ jahi mā vyathiṣṭhā yudhyasva jetāsi raṇe sapatnān

🌷 Translation : Droṇa, Bhīṣma, Jayadratha, Karṇa and the other great warriors have already been destroyed by Me. Therefore, kill them and do not be disturbed. Simply fight, and you will vanquish your enemies in battle.

🌹 Purport : Every plan is made by the Supreme Personality of Godhead, but He is so kind and merciful to His devotees that He wants to give the credit to His devotees who carry out His plan according to His desire. Life should therefore move in such a way that everyone acts in Kṛṣṇa consciousness and understands the Supreme Personality of Godhead through the medium of a spiritual master. The plans of the Supreme Personality of Godhead are understood by His mercy, and the plans of the devotees are as good as His plans. One should follow such plans and be victorious in the struggle for existence.

🌹 🌹 🌹 🌹 🌹



12 Jul 2020