🌹. శ్రీమద్భగవద్గీత - 446 / Bhagavad-Gita - 446 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 32 🌴
32. శ్రీ భగవానువాచ
కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్దో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త: |
ఋతేపి త్వాం న భవిష్యన్తి సర్వే యేవస్థితా: ప్రత్యనీకేషు యోధా:
🌷. తాత్పర్యం : దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికెను : నేను ఘనమైన లోకవినాశకర కాలమును. జనులందరినీ నశింపజేయుటకే నేను ఇచ్చటకు అరుదెంచితిని. నీవు (పాండవులు) తప్ప ఇచ్చటనున్న ఇరుపక్ష యోధులందరును చంపబడనున్నారు.
🌷. భాష్యము : శ్రీకృష్ణుడు దేవదేవుడని, తనకు స్నేహితుడని తెలిసినను అతని వివిధరూప ప్రదర్శనచే అర్జునుడు విభ్రాంతుడయ్యెను. కనుకనే అతడు ఆ వినాశకర శక్తి యొక్క వాస్తవ ప్రయోజనమును గూర్చి మరల అడిగెను. పరమసత్యము సమస్తమును (చివరికి బ్రాహ్మణులను కూడా) నశింపజేయునని వేదములందు తెలుపబడినది.
కఠోపనిషత్తు (1.2.25) నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.
యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదన: |
మృత్యుర్యస్యోపసేచనం కే ఇత్థా వేద యత్ర స:
అనగా అంత్యమున బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు ప్రతియొక్కరు దేవదేవునిచే ఆహారము వలె మ్రింగివేయబడుదురు. దేవదేవుని ఈ ప్రస్తుత రూపము సర్వమును హరించునటువంటిది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తనను సర్వమును హరించు కాలముగా ప్రదర్శించుచున్నాడు. పాండవులు తప్ప అచ్చట యుద్ధరంగము నందు నిలిచిన సర్వులును అతనిచే మ్రింగివేయ బడుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 446 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 32 🌴
32. śrī-bhagavān uvāca
kālo ’smi loka-kṣaya-kṛt pravṛddho lokān samāhartum iha pravṛttaḥ
ṛte ’pi tvāṁ na bhaviṣyanti sarve ye ’vasthitāḥ praty-anīkeṣu yodhāḥ
🌷 Translation : The Supreme Personality of Godhead said: Time I am, the great destroyer of the worlds, and I have come here to destroy all people. With the exception of you [the Pāṇḍavas], all the soldiers here on both sides will be slain.
🌹 Purport : Although Arjuna knew that Kṛṣṇa was his friend and the Supreme Personality of Godhead, he was puzzled by the various forms exhibited by Kṛṣṇa. Therefore he asked further about the actual mission of this devastating force. It is written in the Vedas that the Supreme Truth destroys everything, even the brāhmaṇas. As stated in the Kaṭha Upaniṣad (1.2.25),
yasya brahma ca kṣatraṁ ca ubhe bhavata odanaḥ
mṛtyur yasyopasecanaṁ ka itthā veda yatra saḥ
Eventually all the brāhmaṇas, kṣatriyas and everyone else are devoured like a meal by the Supreme.
This form of the Supreme Lord is the all-devouring giant, and here Kṛṣṇa presents Himself in that form of all-devouring time. Except for a few Pāṇḍavas, everyone who was present on that battlefield would be devoured by Him. Arjuna was not in favor of the fight, and he thought it was better not to fight; then there would be no frustration. In reply, the Lord is saying that even if he did not fight, every one of them would be destroyed, for that was His plan. If Arjuna stopped fighting, they would die in another way. Death could not be checked, even if he did not fight. In fact, they were already dead. Time is destruction, and all manifestations are to be vanquished by the desire of the Supreme Lord. That is the law of nature.
🌹 🌹 🌹 🌹 🌹
10 Jul 2020