🌹. శ్రీమద్భగవద్గీత - 460 / Bhagavad-Gita - 460 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 46 🌴
46. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ |
తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే ||
🌷. తాత్పర్యం : ఓ విశ్వరూపా! సహస్రబాహో! కిరీటము ధరించి శంఖ,చక్ర, గద, పద్మములను హస్తములందు కలిగియుండెడి నీ చతుర్భుజ రూపమును గాంచగోరుదురు. నిన్ను ఆ రూపమునందు గాంచ నేను అభిలషించుచున్నాను.
🌷. భాష్యము : బ్రహ్మసంహిత యందు (5.39) “రామాదిమూర్తిషు కలానియమేన తిష్ఠన్” అని చెప్పబడినది. అనగా శ్రీకృష్ణభగవానుడు వేలాది రూపములలో నిత్యస్థితుడై యుండుననియు మరియు రాముడు, నృసింహుడు, నారాయాణాది రూపములు వానిలో ముఖ్యమైనవనియు తెలుపబడినది. వాస్తవమునకు అట్టి రూపములు అసంఖ్యాకములు. కాని శ్రీకృష్ణుడు ఆదిదేవుడనియు, ప్రస్తుతము తన తాత్కాలిక విశ్వరూపమును ధరించియున్నాడనియు అర్జునుడు ఎరిగియున్నాడు. కనుకనే అతని దివ్యమగు నారాయణరూపమును చూపుమని అర్జునుడు ప్రార్థించుచున్నాడు. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడనియు మరియు ఇతర రూపములు అతని నుండియే ఉద్భవించుననియు తెలిపిన శ్రీమధ్భాగవత వచనము ఈ శ్లోకము నిస్సందేహముగా నిర్ధారించు చున్నది.
ప్రధాన విస్తృతాంశములైన వివిధ రూపములు అతనికి అభిన్నములు. అట్టి అసంఖ్యాక రూపములన్నింటి యందును అతడు భగవానుడే. వాటన్నింటి యందును నిత్య యౌవననిగా అలరారుట యనునది ఆ దేవదేవుని ముఖ్యలక్షణమై యున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి తెలిసికొనగలిగినవాడు భౌతికజగత్తు యొక్క సమస్త కల్మషము నుండి శీఘ్రమే ముక్తుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 460 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 46 🌴
46. kirīṭinaṁ gadinaṁ cakra-hastam icchāmi tvāṁ draṣṭum ahaṁ tathaiva
tenaiva rūpeṇa catur-bhujena sahasra-bāho bhava viśva-mūrte
🌷 Translation : O universal form, O thousand-armed Lord, I wish to see You in Your four-armed form, with helmeted head and with club, wheel, conch and lotus flower in Your hands. I long to see You in that form.
🌹 Purport : In the Brahma-saṁhitā (5.39) it is stated, rāmādi-mūrtiṣu kalā-niyamena tiṣṭhan: the Lord is eternally situated in hundreds and thousands of forms, and the main forms are those like Rāma, Nṛsiṁha, Nārāyaṇa, etc. There are innumerable forms. But Arjuna knew that Kṛṣṇa is the original Personality of Godhead assuming His temporary universal form. He is now asking to see the form of Nārāyaṇa, a spiritual form.
This verse establishes without any doubt the statement of the Śrīmad-Bhāgavatam that Kṛṣṇa is the original Personality of Godhead and all other features originate from Him. He is not different from His plenary expansions, and He is God in any of His innumerable forms. In all of these forms He is fresh like a young man. That is the constant feature of the Supreme Personality of Godhead. One who knows Kṛṣṇa becomes free at once from all contamination of the material world.
🌹 🌹 🌹 🌹 🌹
23 Jul 2020