శ్రీమద్భగవద్గీత - 452: 11వ అధ్., శ్లో 38 / Bhagavad-Gita - 452: Chap. 11, Ver. 38


🌹. శ్రీమద్భగవద్గీత - 452 / Bhagavad-Gita - 452 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 38 🌴

38. త్వమాదిదేవ: పురుష: పురాణ స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనన్తరూప ||


🌷. తాత్పర్యం : నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, విశ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయము. నీవే సర్వమును ఎరిగినవాడవు, తెలియదగిన సర్వము నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన నీవే దివ్యశరణ్యుడవు. ఓ అనంతరుపా! ఈ సమస్త విశ్వము నీచే ఆవరింప బడియున్నది.

🌷. భాష్యము : సమస్తము శ్రీకృష్ణభగవానునిపై ఆధారపడియుండుటచే అతడు పరమాధారమై యున్నాడు. “నిధానం” అనగా సమస్తము (చివరకు బ్రహ్మతేజస్సు సైతము) ఆ దేవదేవుడైన కృష్ణుని పైననే ఆధారపడియున్నదని భావము. ఈ జగమందు జరుగుచున్నదంతయు అతడు సంపూర్ణముగా నెరుగును. ఇక జ్ఞానమునకు అవధియన్నది ఉన్నచో అతడే సర్వజ్ఞానమునకు పరమావధి. కనుకనే తెలిసినవాడు మరియు తెలియదగినవాడు అతడే. సర్వవ్యాపియైనందున జ్ఞానధ్యేయమతడే. ఆధాత్మిక జగత్తులో అతడే కారణము కనుక దివ్యుడైనవాడతడే. ఆలాగుననే ఆధాత్మికజగమునందు ప్రధానపురుషుడు ఆ శ్రీకృష్ణభగవానుడే.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 452 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 38 🌴

38. tvam ādi-devaḥ puruṣaḥ purāṇas tvam asya viśvasya paraṁ nidhānam
vettāsi vedyaṁ ca paraṁ ca dhāma tvayā tataṁ viśvam ananta-rūpa


🌷 Translation : You are the original Personality of Godhead, the oldest, the ultimate sanctuary of this manifested cosmic world. You are the knower of everything, and You are all that is knowable. You are the supreme refuge, above the material modes. O limitless form! This whole cosmic manifestation is pervaded by You!

🌹 Purport : Everything is resting on the Supreme Personality of Godhead; therefore He is the ultimate rest. Nidhānam means that everything, even the Brahman effulgence, rests on the Supreme Personality of Godhead, Kṛṣṇa. He is the knower of everything that is happening in this world, and if knowledge has any end, He is the end of all knowledge; therefore He is the known and the knowable. He is the object of knowledge because He is all-pervading. Because He is the cause in the spiritual world, He is transcendental. He is also the chief personality in the transcendental world.

🌹 🌹 🌹 🌹 🌹


16 Jul 2020