శ్రీమద్భగవద్గీత - 439: 11వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 439: Chap. 11, Ver. 25


🌹. శ్రీమద్భగవద్గీత - 439 / Bhagavad-Gita - 439 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 25 🌴

25. దంష్ట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని |
దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగాన్నివాస ||

🌷. తాత్పర్యం : ఓ దేవదేవా! ప్రపంచశరణ్యా! దయచే నా యెడ ప్రసన్నుడవగుము. నీ మండుచున్న మృత్యువును బోలిన ముఖములను మరియు భయంకరములైన దంతములను గాంచి సమత్వమును నిలుపుకొనలేక సర్వవిధముల నేను భ్రాంతుడనైతిని.

🌷. భాష్యము : అర్జునుడు చూస్తున్న ఈ యొక్క శ్రీ కృష్ణుని విశ్వ రూపము శ్రీ కృష్ణుడి యొక్క ఇంకొక వ్యక్తిత్వమే మరియు అది శ్రీకృష్ణుడి కన్నా అభేదమే. అయినా ఆ స్వరూపము అర్జునుడికి శ్రీ కృష్ణుడి పట్ల ఇంతకుముందు ఉన్న సఖ్యభావమును హరించి వేసింది, అంతేకాక, అర్జునుడికి ఆయనంటే భయం కలుగుతోంది. ఎన్నెన్నో అద్బుతమైన మరియు భీతిని కలిగించే రూపములలో దేవదేవుడు కనిపించేసరికి, అర్జునుడు ఇప్పుడు బెదిరిపోయాడు మరియు తన పట్ల శ్రీకృష్ణుడు కోపంతో ఉన్నాడని అనుకుంటున్నాడు, అందుకే తనపై దయ చూపించమని ప్రార్థిస్తున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 439 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 25 🌴

25. daṁṣṭrā-karālāni ca te mukhāni dṛṣṭvaiva kālānala-sannibhāni
diśo na jāne na labhe ca śarma prasīda deveśa jagan-nivāsa


🌷 Translation : O Lord of lords, O refuge of the worlds, please be gracious to me. I cannot keep my balance seeing thus Your blazing deathlike faces and awful teeth. In all directions I am bewildered.

🌹 Purport : The universal form that Arjun beholds is just another aspect of Shree Krishna’s personality and is non-different from him. And yet, the vision of it has dried up the camaraderie that Arjun was previously experiencing toward Shree Krishna, and he is overcome with fear. Seeing the many wondrous and amazingly frightful manifestations of the Lord, Arjun is now scared, and thinks that Shree Krishna is angry with him. So he asks for mercy.

🌹 🌹 🌹 🌹 🌹


4 Jul 2020