🌹. శ్రీమద్భగవద్గీత - 468 / Bhagavad-Gita - 468 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 54 🌴
54. భక్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోర్జున |
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప ||
🌷. తాత్పర్యం : ఓ ప్రియమైన అర్జునా! కేవలము అనన్యభక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడినరీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింప నగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహనా రహస్యములందు ప్రవేశింప గలుగుదువు.
🌷. భాష్యము : అనన్యభక్తియుతసేవా విధానముననే శ్రీకృష్ణభగవానుడు అవగతము కాగలడు. మానసిక కల్పనాపద్దతుల ద్వారా భగవద్గీతను అవగతము చేసికొన యత్నించు అప్రమాణిక వ్యాఖ్యాతలు తాము కేవలము కాలమును వృథాపరచుచున్నామని అవగతము చేసికొనునట్లుగా ఈ విషయమును శ్రీకృష్ణభగవానుడు ఈ శ్లోకమున స్పష్టముగా తెలియజేసినాడు. కృష్ణుడుగాని లేదా కృష్ణుడు ఏ విధముగా తల్లిదండ్రుల ఎదుట చతుర్భుజరూపమున ప్రకటమై, పిదప ద్విభుజ రూపమునకు మారెనను విషయమును గాని ఎవ్వరును ఎరుగలేరు. వేదాధ్యయనముచే గాని, తత్త్వవిచారములచే గని ఈ విషయములను తెలియుట రహస్యములందు ప్రవేశింపజాలరనియు ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది.
అయినను వేదవాజ్మయమునందు పరమప్రవీణులైనవారు మాత్రము అట్టి వాజ్మయము ద్వారా అతనిని గూర్చి తెలిసికొనగలరు. భక్తియుతసేవ నొనర్చుటకు ప్రామాణిక శాస్త్రములందు పెక్కు నియమనిబంధనలు గలవు. శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొన గోరినచో మనుజుడు ప్రామాణిక గ్రంథములందు వర్ణింపబడిన విధియుక్త నియమములను తప్పక అనుసరించవలెను. ఆ నియమానుసారముగా అతడు తపస్సును కావించవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 468 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 54 🌴
54. bhaktyā tv ananyayā śakya aham evaṁ-vidho ’rjuna
jñātuṁ draṣṭuṁ ca tattvena praveṣṭuṁ ca paran-tapa
🌷 Translation : My dear Arjuna, only by undivided devotional service can I be understood as I am, standing before you, and can thus be seen directly. Only in this way can you enter into the mysteries of My understanding.
🌹 Purport : Kṛṣṇa can be understood only by the process of undivided devotional service. He explicitly explains this in this verse so that unauthorized commentators, who try to understand Bhagavad-gītā by the speculative process, will know that they are simply wasting their time. No one can understand Kṛṣṇa or how He came from parents in a four-handed form and at once changed Himself into a two-handed form. These things are very difficult to understand by study of the Vedas or by philosophical speculation. Therefore it is clearly stated here that no one can see Him or enter into understanding of these matters. Those who, however, are very experienced students of Vedic literature can learn about Him from the Vedic literature in so many ways.
There are so many rules and regulations, and if one at all wants to understand Kṛṣṇa, he must follow the regulative principles described in the authoritative literature. One can perform penance in accordance with those principles. For example, to undergo serious penances one may observe fasting on Janmāṣṭamī, the day on which Kṛṣṇa appeared, and on the two days of Ekādaśī (the eleventh day after the new moon and the eleventh day after the full moon). As far as charity is concerned, it is plain that charity should be given to the devotees of Kṛṣṇa who are engaged in His devotional service to spread the Kṛṣṇa philosophy, or Kṛṣṇa consciousness, throughout the world. Kṛṣṇa consciousness is a benediction to humanity. Lord Caitanya was appreciated by Rūpa Gosvāmī as the most munificent man of charity because love of Kṛṣṇa, which is very difficult to achieve, was distributed freely by Him. So if one gives some amount of his money to persons involved in distributing Kṛṣṇa consciousness, that charity, given to spread Kṛṣṇa consciousness, is the greatest charity in the world.
🌹 🌹 🌹 🌹 🌹
31 Jul 2020