✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 23 🌴
23. య: శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారత: |
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ||
🌷. తాత్పర్యం : శాస్త్రవిధులను త్యజించి తోచిన రీతిని వర్తించువాడు పూర్ణత్వమును గాని, సుఖమును గాని, పరమగతిని గాని పొందజాలడు.
🌷. భాష్యము : పూర్వము వివరించినట్లు మానవుల యందలి వివిధవర్ణములకు, ఆశ్రమములకు పలువిధములైన శాస్త్రవిధులు (శాస్త్రనిర్దేశములు) ఒసగబడియున్నవి. ప్రతియొక్కరు ఆ విధినియమములను తప్పక అనుసరింపవలెను. ఒకవేళ మనుజుడు వాటిని పాటింపక కామము, లోభము, కోరికల ననుసరించి తోచినరీతిలో వర్తించినచో జీవితమున ఎన్నడును పూర్ణత్వము నొందలేడు. అనగా మనుజుడు ఈ విషయముల నన్నింటిని సిద్దాంతరీతి తెలిసినను, తన జీవితమున వాటిని అమలుపరచక పోయినచో నరాధమునిగా తెలియబడగలడు. మానవజన్మ యందు జీవుడు బుద్ధిమంతుడై ఉన్నతపదమును పొందుటకు ఒసగబడిన విధినియమములను అనుసరింప వలసి యున్నది. అతడు వాటిని అనుసరింపనిచో తనను తాను పతనము కావించుకొనగలడు. ఒకవేళ అతడు విధినియమములను మరియు ధర్మనియమములను పాటించినను అంత్యమున శ్రీకృష్ణభగవానుని అవగాహన చేసికొనెడి స్థితికి అరుదెంచినచో అతని జ్ఞానము వ్యర్థమే కాగలదు.
భగవానుని అస్తిత్వమును అంగీకరించినను, ఆ పరమపురుషుని భక్తియుతసేవలో నిలువనిచో అతని యత్నములన్నియు వృథాయే కాగలవు. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిభావానాస్థితికి మరియు భక్తియోగస్థాయికి క్రమముగా ఎదగవలెను. ఆ సమయముననే మరియు ఆ స్థితియందే మనుజుడు అత్యున్నత పూర్ణత్వమును పొందును గాని అన్యథా కాదు. ఇచ్చట “కామారత:” యని పదము మిగుల ప్రధానమైనది. తెలిసియే నియమములకు ఉల్లంఘించువాడు కామమునందు వర్తించునవాడగును. తాను చేయునది నిషిద్దమని తెలిసియు అతడు అట్లే వర్తించును. అట్టి వర్తనమే యథేష్టాచరణ మనబడును. తప్పక చేయవలసియున్న కార్యములను సైతము చేయకుండుట చేతనే అతడు చపలుడు లేదా చంచలుడని పిలువబడును. అట్టివారు దేవదేవునిచే తప్పక శిక్షింపబడుదురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 594 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 23 🌴
23. yaḥ śāstra-vidhim utsṛjya vartate kāma-kārataḥ
na sa siddhim avāpnoti na sukhaṁ na parāṁ gatim
🌷 Translation : He who discards scriptural injunctions and acts according to his own whims attains neither perfection, nor happiness, nor the supreme destination.
🌹 Purport : As described before, the śāstra-vidhi, or the direction of the śāstra, is given to the different castes and orders of human society. Everyone is expected to follow these rules and regulations. If one does not follow them and acts whimsically according to his lust, greed and desire, then he never will be perfect in his life. In other words, a man may theoretically know all these things, but if he does not apply them in his own life, then he is to be known as the lowest of mankind. In the human form of life, a living entity is expected to be sane and to follow the regulations given for elevating his life to the highest platform, but if he does not follow them, then he degrades himself.
But even if he follows the rules and regulations and moral principles and ultimately does not come to the stage of understanding the Supreme Lord, then all his knowledge becomes spoiled. And even if he accepts the existence of God, if he does not engage himself in the service of the Lord his attempts are spoiled. Therefore one should gradually raise himself to the platform of Kṛṣṇa consciousness and devotional service; it is then and there that he can attain the highest perfectional stage, not otherwise.The word kāma-kārataḥ is very significant. A person who knowingly violates the rules acts in lust. He knows that this is forbidden, but still he acts. This is called acting whimsically. He knows that this should be done, but still he does not do it; therefore he is called whimsical. Such persons are destined to be condemned by the Supreme Lord. Such persons cannot have the perfection which is meant for the human life. The human life is especially meant for purifying one’s existence, and one who does not follow the rules and regulations cannot purify himself, nor can he attain the real stage of happiness.
🌹 🌹 🌹 🌹 🌹
22 Nov 2020