శ్రీమద్భగవద్గీత - 580: 16వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 580: Chap. 16, Ver. 09


🌹. శ్రీమద్భగవద్గీత - 580 / Bhagavad-Gita - 580 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 9 🌴

09. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మా నోల్ప బుద్ధయ: |
ప్రభవన్త్యుగ్రకర్మాణ: క్షయాయ జగతోహితా: ||

🌷. తాత్పర్యం : నష్టాత్ములును, అల్పబుద్దులును అగు అసురస్వభావము గలవారు ఇట్టి అభిప్రాయములనే అనుసరించుచు ఆహితములును, జగద్వినాశకరములును అగు ఘోరకర్మలలో నియుక్తులగుదురు.


🌷. భాష్యము : అసురస్వభావము గలవారు ప్రపంచనాశకర కర్మల యందే నియుక్తులై యుందురు. అట్టివారిని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట అల్పబుద్ధులని తెలుపుచున్నాడు. భగవద్భావన ఏమాత్రము లేనటువంటి ఆ భౌతికవాదులు తాము పురోభివృద్ది చెందుచున్నట్లు తలచినను భగవద్గీత ప్రకారము వారు అల్పబుద్ధులు మరియు జ్ఞానము లేనట్టివారే యగుదురు. భౌతికజగము నందు సాధ్యమైనంతవరకు సుఖము ననుభవింపవలెనని యత్నింపగోరుటచే ఇంద్రియతృప్తికి ఏదియో ఒక క్రొత్తదానిని కనిపెట్టుట యందు వారు సదా నిమగ్నులై యుందురు. అట్టి భౌతికపరిశోధన ఫలితములు మాత్రము జనులు మరింత హింసాప్రాయులుగా, క్రూరులుగా తయారగుచున్నారు. జనులు హింసామనస్కులై జంతువుల యెడ, ఇతర మానవుల యెడ హింసాప్రవృత్తిని వృద్ది చేసికొనుచున్నారు.

ఇతర జీవుల యెడ ఏ విధముగా వర్తించవలెనో వారు ఎరుగజాలకున్నారు. అట్టి అసురస్వభావుల యందు జంతుహింస మిక్కిలి ప్రముఖమై యుండును. తమ పరిశోధనల ద్వారా సర్వులకు వినాశనము కూర్చునదేదో తయారుచేయనున్నందున లేదా కనిపెట్టకున్నందున అట్టివారు ప్రపంచమునకు శత్రువులుగా పరిగణింపబడుదురు. అనగా అణ్వాయుధముల సృష్టి నేడు సమస్త ప్రపంచమునకు గర్వకారణమైనను, యుద్దారంభమైనంతనే అవి ఘోరవిపత్తును సృష్టింపగలవు. అట్టి యుద్ధము ఏ క్షణమునందైనను కలుగవచ్చును. అట్టివి కేవలము ప్రపంచ వినాశనముకే సృష్టింపబడునని ఇచ్చట పేర్కొనబడినది. భవద్భావన లేకపోవుట చేతనే అట్టి మారణాయుధములు మానవసమాజమున సృష్టింపబడుచున్నవి. అవి ఎన్నడును ప్రపంచ శాంతి, పురోగతులకు దోహదములు కాజాలవు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 580 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 09 🌴

09. etāṁ dṛṣṭim avaṣṭabhya naṣṭātmāno ’lpa-buddhayaḥ
prabhavanty ugra-karmāṇaḥ kṣayāya jagato ’hitāḥ

🌷 Translation : Following such conclusions, the demoniac, who are lost to themselves and who have no intelligence, engage in unbeneficial, horrible works meant to destroy the world.

🌹 Purport : The demoniac are engaged in activities that will lead the world to destruction. The Lord states here that they are less intelligent. The materialists, who have no concept of God, think that they are advancing. But according to Bhagavad-gītā, they are unintelligent and devoid of all sense. They try to enjoy this material world to the utmost limit and therefore always engage in inventing something for sense gratification. Such materialistic inventions are considered to be advancement of human civilization, but the result is that people grow more and more violent and more and more cruel, cruel to animals and cruel to other human beings.

They have no idea how to behave toward one another. Animal killing is very prominent amongst demoniac people. Such people are considered the enemies of the world because ultimately they will invent or create something which will bring destruction to all. Indirectly, this verse anticipates the invention of nuclear weapons, of which the whole world is today very proud. At any moment war may take place, and these atomic weapons may create havoc. Such things are created solely for the destruction of the world, and this is indicated here. Due to godlessness, such weapons are invented in human society; they are not meant for the peace and prosperity of the world.

🌹 🌹 🌹 🌹 🌹

10 Nov 2020