✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 01 🌴
01. అర్జున ఉవాచ
యే శాస్త్రవిధిముత్సృజ్య యజన్తే శ్రద్ధయాన్వితా: |
తేషాం నిష్టా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమ: ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు ప్రశ్నించెను : ఓ కృష్ణా! శాస్త్రనియమములను పాటింపక తమ మానసిక కల్పనల ననుసరించి పూజలనొనర్చు వారి స్థితి యెట్టిది? వారు సత్త్వగుణులా, రజోగుణులా లేక తమోగుణులా?
🌷. భాష్యము :
ఏదేని ఒక ప్రత్యేక పూజా విధానమున శ్రద్ధను గూడి నియుక్తుడైనవాడు క్రమముగా జ్ఞానస్థాయికి ఉద్ధరింపబడి పూర్ణశాంతిని, శ్రేయస్సును పొందగలడని భగవద్గీత యందలి చతుర్థాధ్యాయపు ముప్పదితొమ్మిదవ శ్లోకమున తెలుపబడినది.
ఇక గడచిన షోడశాధ్యాయమున శాస్త్రనియమములను అనుసరింపనివాడు అసురుడనియు, శాస్త్ర నియమములను శ్రద్ధతో పాటించువాడు దైవస్వభావము కలవాడనియు నిర్ణయింపబడినది. అట్టి యెడ మనుజుడు శాస్త్రమునందు తెలుపునటువంటి నియమములను శ్రద్ధతో అనుసరించినచో అతని స్థితి ఏమగును? అది ఎట్టిది? అర్జునుని ఈ సందేహమును శ్రీకృష్ణభగవానుడే తీర్చగలడు.
ఎవరో ఒక మానవుని భగవానుడని భావించి అతని యందు శ్రద్ధను నిలుపువారలు సత్త్వగుణమునందు పూజించువారలా, రజోగుణమునందు పూజించువారలా లేక తమోగుణమునందు పూజించువారలా? అట్టివారు జీవన పూర్ణత్వస్థితిని పొందగలరా? నిజమైన జ్ఞానమునందు స్థితిని కలిగి తమను తాము అత్యున్నత పూర్ణత్వస్థితికి ఉద్ధరించుకొనుట వారికి సాధ్యమగునా?
ఈ విధముగా శాస్త్రనియమములను ఏ మాత్రము పాటింపక దేని యందో శ్రద్ధను కలిగి వివిధదేవతలను మరియు మనుష్యులను పూజించువారు తమ యత్నములందు జయమును సాధింపగలరా? ఈ ప్రశ్నలన్నింటిని అర్జునుడు శ్రీకృష్ణభగవానుని ముందుంచుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 558 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 17 - The Divisions of Faith - 01 🌴
01. arjuna uvāca
ye śāstra-vidhim utsṛjya
yajante śraddhayānvitāḥ
teṣāṁ niṣṭhā tu kā kṛṣṇa
sattvam āho rajas tamaḥ
🌷 Translation :
Arjuna inquired: O Kṛṣṇa, what is the situation of those who do not follow the principles of scripture but worship according to their own imagination? Are they in goodness, in passion or in ignorance?
🌹 Purport :
In the Fourth Chapter, thirty-ninth verse, it is said that a person faithful to a particular type of worship gradually becomes elevated to the stage of knowledge and attains the highest perfectional stage of peace and prosperity.
In the Sixteenth Chapter, it is concluded that one who does not follow the principles laid down in the scriptures is called an asura, demon, and one who follows the scriptural injunctions faithfully is called a deva, or demigod. Now, if one, with faith, follows some rules which are not mentioned in the scriptural injunctions, what is his position? This doubt of Arjuna’s is to be cleared by Kṛṣṇa.
Are those who create some sort of God by selecting a human being and placing their faith in him worshiping in goodness, passion or ignorance? Do such persons attain the perfectional stage of life? Is it possible for them to be situated in real knowledge and elevate themselves to the highest perfectional stage?
Do those who do not follow the rules and regulations of the scriptures but who have faith in something and worship gods and demigods and men attain success in their effort? Arjuna is putting these questions to Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
24 Nov 2020