శ్రీమద్భగవద్గీత - 561: 17వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 561: Chap. 17, Ver. 04



🌹. శ్రీమద్భగవద్గీత - 561 / Bhagavad-Gita - 561 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 04 🌴


04. యజన్తే సాత్త్వికా దేవాన్ యక్షరాక్షాంసి రాజసా: |
ప్రేతాన్ భూతగణాం శ్చాన్యే యజన్తే తామసా జనా: ||


🌷. తాత్పర్యం :

సత్త్వగుణమునందు నిలిచినవారు దేవతలను, రజోగుణమునందు నిలిచినవారు యక్షరాక్షసులను, తమోగుణమునందు నిలిచినవారు భూతప్రేతములను పూజింతురు.


🌷. భాష్యము :

ఈ శ్లోకమునందు శ్రీకృష్ణభగవానుడు పలువిధములైన అర్చనాపరులను వారి బాహ్యకర్మల ననుసరించి వివరించుచున్నాడు. శాస్త్రనిర్దేశము ప్రకారము దేవదేవుడైన శ్రీకృష్ణుడొక్కడే పూజనీయుడు. కాని శాస్త్రమును ఎరుగనివారు లేదా దానియందు శ్రద్ధలేనివారు మాత్రము తమ గుణము ననుసరించి భగవానునికి అన్యులైనవారిని పూజింతురు.

సత్త్వగుణము నందు నిలిచినవారు సాధారణముగా దేవతలను పూజింతురు. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వంటివారే దేవతలు. అట్టి దేవతలు పలువురు గలరు. సత్త్వగుణము నందున్నవాడు ప్రత్యేక ప్రయోజనార్థమై ప్రత్యేక దేవతా పూజయందు నిమగ్నుడగును.

అదే విధముగా రజోగుణమునందున్నవారు దానవులను పూజింతురు. రెండవ ప్రపంచయుద్ధ సమయమున కలకత్తానగరమునందలి ఒక వ్యక్తి “హిట్లర్”ను పూజించియుండెను. యుద్ధకారణముగా నల్లబజారులో వ్యాపారము చేసి అనంతముగా ధనమును అతడు ప్రోగుచేయగలుగుటయే అందులకు కారణము.

ఈ విధముగా రజస్తమోగుణయుక్తులు సాధారణముగా శక్తిమంతుడైన మనుజునే దేవునిగా భావింతురు. ఎవరినైనను భగవానుని రూపమున పూజింప వచ్చుననియు, తద్ద్వారా ఒకే ఫలితములు లభించుననియు వారు తలంతురు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 561 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 17 - The Divisions of Faith - 04
🌴


04. . yajante sāttvikā devān
yakṣa-rakṣāṁsi rājasāḥ
pretān bhūta-gaṇāṁś cānye
yajante tāmasā janāḥ


🌷 Translation :

Men in the mode of goodness worship the demigods; those in the mode of passion worship the demons; and those in the mode of ignorance worship ghosts and spirits.


🌹 Purport :

In this verse the Supreme Personality of Godhead describes different kinds of worshipers according to their external activities.

According to scriptural injunction, only the Supreme Personality of Godhead is worshipable, but those who are not very conversant with, or faithful to, the scriptural injunctions worship different objects, according to their specific situations in the modes of material nature.

Those who are situated in goodness generally worship the demigods. The demigods include Brahmā, Śiva and others such as Indra, Candra and the sun-god. There are various demigods. Those in goodness worship a particular demigod for a particular purpose.

Similarly, those who are in the mode of passion worship the demons. We recall that during the Second World War a man in Calcutta worshiped Hitler because thanks to that war he had amassed a large amount of wealth by dealing in the black market.

Similarly, those in the modes of passion and ignorance generally select a powerful man to be God. They think that anyone can be worshiped as God and that the same results will be obtained.

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2020