శ్రీమద్భగవద్గీత - 590: 16వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 590: Chap. 16, Ver. 19

 

🌹. శ్రీమద్భగవద్గీత - 590 / Bhagavad-Gita - 590 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 19 🌴

19. తానహం ద్విషత: క్రూరాన్ సంసారేషు నరాధమాన్ |
క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ||


🌷. తాత్పర్యం : అసూయగలవారును, క్రూరులును అగు నరాదములను వివిధ ఆసురజన్మలనెడి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను.

🌷. భాష్యము : జీవుని ఒక ప్రత్యేక దేహమునందు ప్రవేశింపజేయుట యనునది శ్రీకృష్ణభగవానుని విశేష అధికారమని ఈ శ్లోకమున అతిస్పష్టముగ తెలుపబడినది. దానవప్రవృత్తి గలవాడు భగవానుని అధికారమును ఆంగీకరింపక తనకు తోచిన రీతిలో వర్తించినను, అతని తదుపరి జన్మము మాత్రము ఆ భగవానుని నిర్ణయముపైననే ఆధారపడి యుండును. అది ఎన్నడును అతనిపై ఆధారపడి యుండదు. మరణము పిదప జీవుడు తల్లి గర్భములో ప్రవేశపెట్ట బడుననియు, అచ్చట అతడు తగిన దేహమును భగవానుని దివ్య శక్తి యొక్క పర్యవేక్షణమున పొందుననియు శ్రీమద్భాగవతపు మూడవస్కంధమున తెలుపబడినది.

కనుకనే భౌతికజగమున జంతువులు, కీటకములు, మనుష్యాది పలుజీవ జాతులను మనము గాంచుచున్నాము. అవన్నియు శ్రీకృష్ణభగవానుని శక్తిచేతనే రూపొందినవి గాని యాదృచ్చికముగా కాదు. ఇక ఆసుర స్వభావుల విషయమున వారు సదా అసుర యోనులందే ఉంచబడుదరనియు, తత్కారణముగా వారు ద్వేషులుగాను మరియు నరాధములుగాను కొనసాగుదురనియు ఇచ్చట తెలుపబడినది. అట్టి అసురస్వభావులు సదా కామపూర్ణులును, హింసాపూర్ణులును, ద్వేషులును, శుచిరహితులును అయియుందురు. అరణ్యములందు నివసించు పలురకములైన వేటగాళ్ళు అట్టి అసురజాతికి చెందినవారుగా పరిగణింప బడుదురు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 590 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 19 🌴

19. tān ahaṁ dviṣataḥ krūrān saṁsāreṣu narādhamān
kṣipāmy ajasram aśubhān āsurīṣv eva yoniṣu

🌷 Translation : Those who are envious and mischievous, who are the lowest among men, I perpetually cast into the ocean of material existence, into various demoniac species of life.

🌹 Purport : In this verse it is clearly indicated that the placing of a particular individual soul in a particular body is the prerogative of the supreme will. The demoniac person may not agree to accept the supremacy of the Lord, and it is a fact that he may act according to his own whims, but his next birth will depend upon the decision of the Supreme Personality of Godhead and not on himself. In the Śrīmad-Bhāgavatam, Third Canto, it is stated that an individual soul, after his death, is put into the womb of a mother where he gets a particular type of body under the supervision of superior power.

Therefore in the material existence we find so many species of life – animals, insects, men, and so on. All are arranged by the superior power. They are not accidental. As for the demoniac, it is clearly said here that they are perpetually put into the wombs of demons, and thus they continue to be envious, the lowest of mankind. Such demoniac species of men are held to be always full of lust, always violent and hateful and always unclean. The many kinds of hunters in the jungle are considered to belong to the demoniac species of life.

🌹 🌹 🌹 🌹 🌹

18 Nov 2020