శ్రీమద్భగవద్గీత - 560: 17వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 560: Chap. 17, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 560 / Bhagavad-Gita - 560 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 03 🌴

03. సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత |
శ్రద్ధామయో(యం పురుషో యో యచ్చృద్ద: స ఏవ స: ||


🌷. తాత్పర్యం :

ఓ భారతా! మనుజుడు వివిధగుణముల యందలి తన స్థితి ననుసరించి తత్సంబంధితమైన శ్రద్ధను పొందుచుండును. అతడు పొందిన గుణముల ననుసరించి అతడు ఒకానొక శ్రద్ధను కూడియున్నాడని చెప్పుబడును.


🌷. భాష్యము :

మానవుడు ఎటువంటివాడైనను ఒకానొక శ్రద్ధను మాత్రము తప్పక కలిగియుండును. కాని అతడు కలిగియున్నట్టి గుణములు ననుసరించి అతని శ్రద్ద సాత్త్వికము, రాజసికము లేదా తామసికమని భావింపబడును.

ఆ విధముగా తన శ్రద్ధ ననుసరించి మానవుడు ఆ గుణమునకు సంబంధించినవారితో సాంగత్యమును పొందుచుండును.కాని వాస్తవమునకు పంచదశాధ్యాయమున వివరించినట్లు ప్రతిజీవుడు శ్రీకృష్ణభగవానుని అంశయై యున్నాడు. తత్కారణమున అతడు స్వత: త్రిగుణములకు పరుడై యున్నాడు.

కాని అతడు తనకు శ్రీకృష్ణభగవానునితో గల సంబంధమును మరచి బద్ధజీవనమున భౌతికప్రకృతితో సంబంధమునకు వచ్చినప్పుడు త్రిగుణముల సంపర్కముచే తన బద్ధస్థితిని ఏర్పరచుకొనుచున్నాడు. అట్టి బంధనము వలన కలిగెడి కృత్రిమ శ్రద్ధ మరియు స్థితి యనునవి నిజమునకు భౌతికములే. అనగా జీవుడు వివిధ భావములను లేదా జీవితపద్ధతులను కలిగియున్నప్పటికిని సహజముగా నిర్గుణుడే.

కనుక శ్రీకృష్ణభగవానునితో తమకు గల నిత్యసంబంధమును పునరుద్ధరించుకొనుటకై ప్రతియొక్కరు తాము పొందియున్నటువంటి ప్రకృతిగుణ మలిన సంపర్కమును శుభ్రపరచు కొనవలెను. భగవానుని చేరుటకు అదియొక్కటే భయరహితమార్గమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 560 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 03 🌴


03. . sattvānurūpā sarvasya
śraddhā bhavati bhārata
śraddhā-mayo ’yaṁ puruṣo
yo yac-chraddhaḥ sa eva saḥ


🌷 Translation :

O son of Bharata, according to one’s existence under the various modes of nature, one evolves a particular kind of faith. The living being is said to be of a particular faith according to the modes he has acquired.


🌹 Purport :

Everyone has a particular type of faith, regardless of what he is. But his faith is considered good, passionate or ignorant according to the nature he has acquired. Thus, according to his particular type of faith, one associates with certain persons. Now the real fact is that every living being, as is stated in the Fifteenth Chapter, is originally a fragmental part and parcel of the Supreme Lord.

Therefore one is originally transcendental to all the modes of material nature. But when one forgets his relationship with the Supreme Personality of Godhead and comes into contact with the material nature in conditional life, he generates his own position by association with the different varieties of material nature.

The resultant artificial faith and existence are only material. Although one may be conducted by some impression, or some conception of life, originally he is nirguṇa, or transcendental. Therefore one has to become cleansed of the material contamination that he has acquired, in order to regain his relationship with the Supreme Lord.

That is the only path back without fear: Kṛṣṇa consciousness. If one is situated in Kṛṣṇa consciousness, then that path is guaranteed for his elevation to the perfectional stage. If one does not take to this path of self-realization, then he is surely to be conducted by the influence of the modes of nature.

The word śraddhā, or “faith,” is very significant in this verse. Śraddhā, or faith, originally comes out of the mode of goodness. One’s faith may be in a demigod or some created God or some mental concoction. One’s strong faith is supposed to be productive of works of material goodness.

🌹 🌹 🌹 🌹 🌹


26 Nov 2020