శ్రీమద్భగవద్గీత - 568: 15వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 568: Chap. 15, Ver. 17


🌹. శ్రీమద్భగవద్గీత - 568 / Bhagavad-Gita - 568 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 17 🌴

17. ఉత్తమ: పురుషస్త్వస్య: పరమాత్మేత్యుదాహృత: |
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వర: ||

🌷. తాత్పర్యం : ఈ ఇరువురు గాక మూడులోకములందును ప్రవేశించి వాటిని భరించు సాక్షాత్తు అవ్యయ ప్రభువును, పరమాత్ముడును అగు ఉత్తమపురుషుడును కలడు.


🌷. భాష్యము : ఈ శ్లోకమునందలి భావము కఠోపనిషత్తు (2.2.13) మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు (6.13) నందు చక్కగా వివరింపబడినది. బంధ, ముక్తస్థితి యందున్న అసంఖ్యాకజీవులపైన పరమాత్మగా హృదయమందు నిలుచు దేవదేవుడు కలడని అందు తెలుపబడినది. “నిత్యో(నిత్యానాం చేతనశ్చేతనానాం” అనునది ఆ ఉపనిషత్తు నందలి వాక్యము.

బద్ధ, ముక్తస్థితి యందున్న జీవులలో, వాటిని పోషించుచు కర్మానుసారముగా వారి భోగానుభవమునకు అవకాశమునొసగు దేవదేవుడను శ్రేష్ఠపురుషుడు వేరొకడు కలడని దీని భావము. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడే ప్రతివారి హృదయమునందు పరమాత్మగా విరాజమానుడై యున్నాడు. అతనిని ఎరుగగలిగిన బుద్ధిమంతుడే సంపూర్ణశాంతిని పొందును గాని అన్యులు కారు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 568 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 15 - Purushothama Yoga - 17 🌴

17. uttamaḥ puruṣas tv anyaḥ paramātmety udāhṛtaḥ
yo loka-trayam āviśya bibharty avyaya īśvaraḥ


🌷 Translation : Besides these two, there is the greatest living personality, the Supreme Soul, the imperishable Lord Himself, who has entered the three worlds and is maintaining them.

🌹 Purport : The idea of this verse is very nicely expressed in the Kaṭha Upaniṣad (2.2.13) and Śvetāśvatara Upaniṣad (6.13). It is clearly stated there that above the innumerable living entities, some of whom are conditioned and some of whom are liberated, there is the Supreme Personality, who is Paramātmā. The Upaniṣadic verse runs as follows: nityo nityānāṁ cetanaś cetanānām.

The purport is that amongst all the living entities, both conditioned and liberated, there is one supreme living personality, the Supreme Personality of Godhead, who maintains them and gives them all the facility of enjoyment according to different work. That Supreme Personality of Godhead is situated in everyone’s heart as Paramātmā. A wise man who can understand Him is eligible to attain perfect peace, not others.

🌹 🌹 🌹 🌹 🌹

30 Oct 2020