🌹. శ్రీమద్భగవద్గీత - 540 / Bhagavad-Gita - 540 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 16 🌴
16. కర్మణ: సుకృతస్యాహు: సాత్త్వికం నిర్మలం ఫలమ్ |
రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమస: ఫలమ్ ||
🌷. తాత్పర్యం : సాత్త్వికములైన మంచి కర్మలను చేయుటచే నిర్మల శాంతిసుఖములే ఫలమనియు, రజోకర్మలను చేయుటచే సాంసారిక సుఖదు:ఖములే ఫలమనియు, తామసి కర్మలచే అఙ్ఞానమే ఫలమనియు తత్వవేత్తలు చెప్పిరి.
🌷. భాష్యము : సత్త్వగుణము నందుండి ఒనరింపబడు పుణ్యకర్మల ఫలితము నిర్మలత్వము లేదా పవిత్రత్వము. కనుకనే మోహరహితులైన ఋషులు సదా ఆనందమునందే స్థితులై యుందురు. కాని రజోగుణమునందు ఒనరింపబడు కార్యములు కేవలము దుఃఖపూర్ణములే. భౌతికానందము కొరకు చేయబడు ఏ కర్మకైనను అపజయము తప్పదు. ఉదాహరణమునకు ఆకాశమునంటెడి ఎత్తైన భవంతిని మనుజుడు నిర్మింపదలచినచో ఆ భవన నిర్మాణమునకు అత్యంత ఎక్కువ మానవపరిశ్రమ అవసరమగును. తొలుత అతడు అధికమొత్తములో ధనమును కూడబెట్టవలెను. అంతియేగాక భవన నిర్మాణమునకు మనుష్యుల చమటోర్చి పనిచేయవలసివచ్చును.
ఈ విధముగా అడుగడుగునా ఆ కార్యమున దుఖమే అధికముగా నుండును. కనుకనే రజోగుణమునందు చేయబడిన ఏ కార్యముమందైనను గొప్ప దుఃఖము తప్పక ఉండునని భగవద్గీత యందు ఇచ్చట పేర్కొనవడినది. “నాకీ గృహమున్నది, ఇంత ధనమున్నది” అనెడి నామమాత్ర మనస్సంతోషము లేదా సౌఖ్యము కలిగనను వాస్తవమునకు అది నిజమైన సౌఖ్యము కాదు. ఇక తమోగుణమునకు సంబంధించినంత వరకు ఆ గుణమునందు కర్తయైనవాడు జ్ఞానరహితుడై యుండును. తత్కారణముగా అతని కర్మలన్నియును వర్తమానమున దుఃఖమును కలిగించుటయే గాక, పిదప అతడు జంతుజాలమున జన్మించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 540 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 16 🌴
16. karmaṇaḥ sukṛtasyāhuḥ sāttvikaṁ nirmalaṁ phalam
rajasas tu phalaṁ duḥkham ajñānaṁ tamasaḥ phalam
🌷 Translation : The result of pious action is pure and is said to be in the mode of goodness. But action done in the mode of passion results in misery, and action performed in the mode of ignorance results in foolishness.
🌹 Purport : The result of pious activities in the mode of goodness is pure. Therefore the sages, who are free from all illusion, are situated in happiness. But activities in the mode of passion are simply miserable. Any activity for material happiness is bound to be defeated. If, for example, one wants to have a skyscraper, so much human misery has to be undergone before a big skyscraper can be built. The financier has to take much trouble to earn a mass of wealth, and those who are slaving to construct the building have to render physical toil.
The miseries are there. Thus Bhagavad-gītā says that in any activity performed under the spell of the mode of passion, there is definitely great misery. There may be a little so-called mental happiness – “I have this house or this money” – but this is not actual happiness. As far as the mode of ignorance is concerned, the performer is without knowledge, and therefore all his activities result in present misery, and afterwards he will go on toward animal life.
🌹 🌹 🌹 🌹 🌹
2 Oct 2020