శ్రీమద్భగవద్గీత - 561: 15వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 561: Chap. 15, Ver. 10


🌹. శ్రీమద్భగవద్గీత - 561 / Bhagavad-Gita - 561 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 10 🌴

10. యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్ |
యతన్తోప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతస: ||

🌷. తాత్పర్యం : ఆత్మానుభవము నందు స్థితిని పొందిన యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా గాంచగలుగుదురు. కాని అచేతసులు మరియు ఆత్మానుభవము నందు స్థితిని పొందినవారు ప్రయత్నించినను ఏమి జరుగుచున్నదో గాంచలేరు.

🌷. భాష్యము : ఆత్మానుభవమార్గమున పలువురు యోగులున్నను ఆత్మానుభవమునందు స్థితుడు కానివాడు దేహి యొక్క దేహమునందు మార్పులెట్లు కలుగుచున్నవో గాంచలేడు. కనుకనే ఈ విషయమున “యోగిన:” అను పదము మిక్కిలి ప్రాధాన్యమును సంతరించుకొన్నది. నేటికాలమున పలువురు నామమాత్ర యోగులు మరియు నామమాత్ర యోగసంఘములున్నను వాస్తవమునకు ఆత్మానుభవ విషయమున వారందరును అంధులై యున్నారు. వారు కేవలము ఏదియోనొక దేహవ్యాయామమునకు అలవాటుపడి, దేహము దృఢముగా మరియు ఆరోగ్యముగా నున్నచో తృప్తినొందుచున్నారు. దానికి అన్యమైన విషయము వారికి తెలియదు. అట్టివారే “యతన్తోప్యకృతాత్మాన:” యనబడుదురు.

వారు అట్టి నామమాత్రయోగమును అభ్యసించినను ఆత్మవిదులు కాజాలరు. వారెన్నడును ఆత్మా యొక్క పునర్జన్మ విధానమును అవగతము చేసికొనజాలరు. వాస్తవముగా యోగమునందు నిలిచి ఆత్మ, జగత్తు, శ్రీకృష్ణభగవానుడు అనెడి అంశములను అవగాహన చేసికొనినవారే (అనగా కృష్ణభక్తిభావన యందు విశుద్ధ భక్తియోగమున నియుక్తులైన భక్తియోగులు) ఏది యెట్లు జరుగుచున్నదో అవగతము చేసికొనగలరు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 561 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 15 - Purushothama Yoga - 10 🌴

10. utkrāmantaṁ sthitaṁ vāpi bhuñjānaṁ vā guṇānvitam
vimūḍhā nānupaśyanti paśyanti jñāna-cakṣuṣaḥ


🌷 Translation : The foolish cannot understand how a living entity can quit his body, nor can they understand what sort of body he enjoys under the spell of the modes of nature. But one whose eyes are trained in knowledge can see all this.

🌹 Purport : The word jñāna-cakṣuṣaḥ is very significant. Without knowledge, one cannot understand how a living entity leaves his present body, nor what form of body he is going to take in the next life, nor even why he is living in a particular type of body. This requires a great amount of knowledge understood from Bhagavad-gītā and similar literatures heard from a bona fide spiritual master. One who is trained to perceive all these things is fortunate. Every living entity is quitting his body under certain circumstances, he is living under certain circumstances, and he is enjoying under certain circumstances under the spell of material nature.

As a result, he is suffering different kinds of happiness and distress, under the illusion of sense enjoyment. Persons who are everlastingly fooled by lust and desire lose all power to understand their change of body and their stay in a particular body. They cannot comprehend it. Those who have developed spiritual knowledge, however, can see that the spirit is different from the body and is changing its body and enjoying in different ways. A person in such knowledge can understand how the conditioned living entity is suffering in this material existence. Therefore those who are highly developed in Kṛṣṇa consciousness try their best to give this knowledge to the people in general, for their conditional life is very much troublesome. They should come out of it and be Kṛṣṇa conscious and liberate themselves to transfer to the spiritual world.

🌹 🌹 🌹 🌹 🌹

23 Oct 2020