శ్రీమద్భగవద్గీత - 563: 15వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 563: Chap. 15, Ver. 12


🌹. శ్రీమద్భగవద్గీత - 563 / Bhagavad-Gita - 563 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 12 🌴

12. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలమ్ |
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ||

🌷. తాత్పర్యం : సమస్తజగమునందలి అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్నితేజము కూడా నా నుండియే కలుగుచున్నదవి.


🌷. భాష్యము : ఏది ఏవిధముగా జరుగుచున్నదో మందబుద్దులైనవారు ఎరుగజాలరు. కాని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వివరించు విషయమును అవగాహన చేసికొనుట ద్వారా మనుజుడు క్రమముగా జ్ఞానమునందు స్థితుడు కాగలడు. ప్రతియొక్కరు సూర్యుడు, చంద్రుడు,అగ్ని, విద్యుత్తులను గాంచుచునే యుందురు. అట్టి సూర్యుడు,చంద్రుడు, అగ్ని, విద్యుత్తుల యందలి తేజము దేవదేవుని నుండియే కలుగుచున్నదని వారు అవగతము చేసికొనుటకు యత్నించిన చాలును.

కృష్ణభక్తిరసభావనమునకు ఆరంభమువంటి అట్టి భావనము బద్ధజీవునకు భౌతికజగమునందు గొప్ప పురోగతిని కలిగించగలదు. వాస్తవమునకు జీవులు దేవదేవుడైన శ్రీకృష్ణుని నిత్యాంశలు. వారు ఏ విధముగా తిరిగి తనను చేరగలరనెడి విషయమున ఆ భగవానుడు ఇచ్చట కొన్ని సూచనల నొసగుచున్నాడు. గ్రహమండల మంతటిని సూర్యుడు ప్రకాశింపజేయుచున్నాడని ఈ శ్లోకము ద్వారా మనము అవగతము చేసికొనవచ్చును. వాస్తవమునకు విశ్వములు మరియు గ్రహమండలముల పెక్కు గలవు. అదేవిధముగా సూర్యులు,చంద్రులు, గ్రహములు కూడా పలుగలవు. కాని ఒక విశ్వమునందు మాత్రము ఒకే సూర్యుడుండును. భగవద్గీత (10.21) యందు తెలుపబడినట్లు చంద్రుడు నక్షత్రములలో ఒకడై యున్నాడు (నక్షత్రాణాం అహం శశీ). ఆధ్యాత్మికజగము నందలి భగవానుని ఆధ్యాత్మిక తేజమే సూర్యకాంతికి కారణమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 563 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 15 - Purushothama Yoga - 12 🌴

12. yad āditya-gataṁ tejo jagad bhāsayate ’khilam
yac candramasi yac cāgnau tat tejo viddhi māmakam

🌷 Translation : The splendor of the sun, which dissipates the darkness of this whole world, comes from Me. And the splendor of the moon and the splendor of fire are also from Me.


🌹 Purport : The unintelligent cannot understand how things are taking place. But one can begin to be established in knowledge by understanding what the Lord explains here. Everyone sees the sun, moon, fire and electricity. One should simply try to understand that the splendor of the sun, the splendor of the moon, and the splendor of electricity or fire are coming from the Supreme Personality of Godhead. In such a conception of life, the beginning of Kṛṣṇa consciousness, lies a great deal of advancement for the conditioned soul in this material world. The living entities are essentially the parts and parcels of the Supreme Lord, and He is giving herewith the hint how they can come back to Godhead, back to home.

From this verse we can understand that the sun is illuminating the whole solar system. There are different universes and solar systems, and there are different suns, moons and planets also, but in each universe there is only one sun. As stated in Bhagavad-gītā (10.21), the moon is one of the stars (nakṣatrāṇām ahaṁ śaśī). Sunlight is due to the spiritual effulgence in the spiritual sky of the Supreme Lord. With the rise of the sun, the activities of human beings are set up. They set fire to prepare their foodstuff, they set fire to start the factories, etc. So many things are done with the help of fire. Therefore sunrise, fire and moonlight are so pleasing to the living entities. Without their help no living entity can live. So if one can understand that the light and splendor of the sun, moon and fire are emanating from the Supreme Personality of Godhead, Kṛṣṇa, then one’s Kṛṣṇa consciousness will begin. By the moonshine, all the vegetables are nourished. The moonshine is so pleasing that people can easily understand that they are living by the mercy of the Supreme Personality of Godhead, Kṛṣṇa. Without His mercy there cannot be sun, without His mercy there cannot be moon, and without His mercy there cannot be fire, and without the help of sun, moon and fire, no one can live. These are some thoughts to provoke Kṛṣṇa consciousness in the conditioned soul.

🌹 🌹 🌹 🌹 🌹

25 Oct 2020