శ్రీమద్భగవద్గీత - 550: 14వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 550: Chap. 14, Ver. 26


🌹. శ్రీమద్భగవద్గీత - 550 / Bhagavad-Gita - 550 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 26 🌴

26. మాం చ యోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే |
స గుణేన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ||


🌷. తాత్పర్యం : అన్ని పరిస్థితుల యందును అకుంటితముగా నా పూర్ణముగు భక్తియుతసేవ యందు నిమగ్నుమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును.

🌷. భాష్యము : త్రిగుణరాహిత్యమును దివ్యస్థితిని పొందుటకు సాధనమేమనెడి అర్జునుని తృతీయప్రశ్నకు ఈ శ్లోకమే సమాధానము. పూర్వమే వివరింపబడినట్లు భౌతికజగమంతయు ప్రకృతిత్రిగుణ ప్రభావమునకు లోబడి వర్తించుచున్నది. కావున మనుజుడు త్రిగుణముల కార్యకలాపములచే ప్రభావితుడు గాక, తన చైతన్యమును ఆ త్రిగుణముల కర్మల యందుంచుటకు బదులు కృష్ణసంబంధకర్మల యందే దానిని నియుక్తము కావింపవలెను.

కృష్ణపరకర్మలే భక్తియోగముగా తెలియబడుచున్నవి. అనగా కృష్ణుని కొరకు కర్మ చేయుటయే భక్తియోగము. ఇట్టి భక్తియోగమున కృష్ణసేవయేగాక, ఆ శ్రీకృష్ణుని ప్రధాన విస్తారములైన రామ, నారాయణాది రూపముల సేవయు ఇమిడియున్నది. శ్రీకృష్ణుడు అసంఖ్యాక రూపములను కలిగియున్నాడు.

ఏ రూపము యొక్క (లేదా ప్రధానవిస్తారము యొక్క) సేవ యందు నిలిచినను మనుజుడు దివ్యస్థితిలో స్థితుడైనట్లుగానే భావింపబడును. అనగా శ్రీకృష్ణుని అన్ని రూపములు ఆధ్యాత్మికములనియు మరియు సచ్చిదానంద మాయములనియు ప్రతియొక్కరు ఎరుగవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 550 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 26 🌴

26. māṁ ca yo ’vyabhicāreṇa bhakti-yogena sevate
sa guṇān samatītyaitān brahma-bhūyāya kalpate

🌷 Translation : One who engages in full devotional service, unfailing in all circumstances, at once transcends the modes of material nature and thus comes to the level of Brahman.

🌹 Purport : This verse is a reply to Arjuna’s third question: What is the means of attaining to the transcendental position? As explained before, the material world is acting under the spell of the modes of material nature.

One should not be disturbed by the activities of the modes of nature; instead of putting his consciousness into such activities, he may transfer his consciousness to Kṛṣṇa activities. Kṛṣṇa activities are known as bhakti-yoga – always acting for Kṛṣṇa. This includes not only Kṛṣṇa, but His different plenary expansions such as Rāma and Nārāyaṇa. He has innumerable expansions.

One who is engaged in the service of any of the forms of Kṛṣṇa, or of His plenary expansions, is considered to be transcendentally situated. One should also note that all the forms of Kṛṣṇa are fully transcendental, blissful, full of knowledge and eternal. Such personalities of Godhead are omnipotent and omniscient, and they possess all transcendental qualities.

So if one engages himself in the service of Kṛṣṇa or His plenary expansions with unfailing determination, although these modes of material nature are very difficult to overcome, one can overcome them easily. This has already been explained in the Seventh Chapter.

One who surrenders unto Kṛṣṇa at once surmounts the influence of the modes of material nature.

🌹 🌹 🌹 🌹 🌹

9 Oct 2020