శ్రీమద్భగవద్గీత - 539: 14వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 539: Chap. 14, Ver. 15


🌹. శ్రీమద్భగవద్గీత - 539 / Bhagavad-Gita - 539 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 15 🌴

15. రజసి ప్రలయం గత్వా కర్మసఙ్గిషు జాయతే |
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ||


🌷. తాత్పర్యం : రజోగుణమునందుండి మరణించినవాడు కామ్యకర్మరతుల యందు జన్మించును. తమోగుణము నందుండి మరణించినవాడు జంతుజాలమున జన్మించును.

🌷. భాష్యము : ఆత్మ మానవజన్మ స్థాయిని పొందిన పిమ్మట తిరిగి పతనము నొందదనెడి అభిప్రాయమును కొందరు కలిగియున్నారు. కాని అట్టి భావన సరియైనది కాదు. ఈ శ్లోకము ననుసరించి తమోగుణమును వృద్ధిపరచుకొనినవాడు మరణానంతరము జంతురూపమునకు పతనము నొందును. తిరిగి ఆ స్థితి నుండి పరిణామ సిద్ధాంతము ద్వారా మానవజన్మను పొందుటకు జీవుడు తనను తాను ఉద్ధరించు కొనవలెను.

కనుక మనవజన్మ యెడ నిజముగా శ్రద్ధగలవారు సత్త్వగుణము నవలంబించి, సత్సాంగత్యమున గుణముల నధిగమించి కృష్ణభక్తిభావనలో నిలువవలెను. ఇదియే మానవజన్మ యొక్క లక్ష్యమై యున్నది. లేనిచో మానవుడు తిరిగి మానవజన్మనే పొందుచున్న హామీ ఏదియును లేదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 539 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 15 🌴

15. rajasi pralayaṁ gatvā karma-saṅgiṣu jāyate
tathā pralīnas tamasi mūḍha-yoniṣu jāyate

🌷 Translation : When one dies in the mode of passion, he takes birth among those engaged in fruitive activities; and when one dies in the mode of ignorance, he takes birth in the animal kingdom.

🌹 Purport : Some people have the impression that when the soul reaches the platform of human life it never goes down again. This is incorrect. According to this verse, if one develops the mode of ignorance, after his death he is degraded to an animal form of life. From there one has to again elevate himself, by an evolutionary process, to come again to the human form of life.

Therefore, those who are actually serious about human life should take to the mode of goodness and in good association transcend the modes and become situated in Kṛṣṇa consciousness. This is the aim of human life. Otherwise, there is no guarantee that the human being will again attain to the human status.

🌹 🌹 🌹 🌹 🌹

1 Oct 2020